బాంబు కలకలం సృష్టించిన వ్యక్తి అరెస్ట్
నిందితుడు కర్ణాటక వాస
తిరుపతి క్రైం: తిరుపతిలో బాంబు పేల్చేందుకు ఓ వ్యక్తి సిద్ధంగా ఉన్నాడని నాలుగు రోజుల క్రితం పోలీసులకు ఫోన్ ద్వారా చెప్పి కలకలం సృష్టించిన వ్యక్తిని తిరుపతి అర్బన్ పోలీసులు అరెస్టు చేశారు. తన దగ్గర పనిచేసి నిలి చిపోయిన వ్యక్తిని ఇబ్బందులపాలు చేయబోయి తానే పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యాడు. మంగళవారం అర్బన్ ఎస్పీ గోపీనాథ్ జట్టి వివరాలు వెల్లడించారు.. ఈనెల 11వ తేదిన తిరుపతికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వచ్చారు. ఆ నేపథ్యంలో గుర్తుతెలియని ఓ వ్యక్తి కర్ణాటక డీజీపీ ఆఫీసులోని 100 నెంబరుకు ఫోన్ చేశాడు. తిరుపతిలో ఉత్తమ్‌కుమార్ అనే వ్యక్త్తి బాంబు పేల్చేందుకు సిద్ధంగా ఉన్నాడని చెప్పాడు. అతని సెల్ నెంబ రు కూడా ఇచ్చాడు. వారు తిరుపతి పో లీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో అర్బన్ ఎస్పీ నగరంలో హై అలర్ట్ ప్రకటించారు. అన్ని ముఖ్య ప్రదేశాలకు టీమ్స్‌ను పంపి తనిఖీ చేశారు.
ఆ ఫోన్ నెంబరు ఆధారంగా విచారించి రాజు సర్కార్ అలియాస్ ఉత్తమ్‌కుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతడిని వి చారించగా తనది పశ్చిమ బెంగాల్‌లోని బాలార్ ఘాట్ జిల్లా, కలిబరి పెరూసా గ్రామమని బతుకు తెరువు కోసం తిరుపతికి వచ్చి సెంట్రింగ్ పనులతో జీవిస్తున్నానని చెప్పాడు. ఫోన్ చేసి తప్పుడు సమాచారం ఇచ్చిన వ్యక్తిని పట్టుకోవాలంటూ ఏఎస్పీ త్రిమూర్తులు, ఈస్ట్ డీఎ స్పీ రవిశంకర్‌రెడ్డిని ఆదేశించారు. వీరి ఆధ్వర్యంలో ప్రత్యేక టీమ్‌లు కర్ణాటక వెళ్లి కొప్పల్ జిల్లా, గంగావతి నగరంలో ఉండే మహమ్మద్ అమీరుల్ ఇస్లాం షేక్‌ను అదుపులోకి తీసుకున్నారు.
ఇబ్బంది పెట్టాలనే..
పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో మహమ్మద్ జరిగిన విషయం వివరంగా తెలిపాడు. కర్ణాటక రాష్ట్రంలో ఇతను సెంట్రింగ్ పనులు చేస్తూ జీవిస్తున్నాడు. అక్కడ కూలీల కొరత ఉండటంతో పశ్చిమబెంగాల్ నుంచి ఉత్తమ్‌కుమార్‌ను పిలిపించుకున్నాడు. అయితే కూలి డబ్బు చాలడం లేదని ఉత్తమ్‌కుమార్ పనిమానేసి, మహమ్మద్ వద్ద పనిచేసే మరో ఇద్దరిని వెంటబెట్టుకుని తిరుపతికి వెళ్లిపోయాడు. కూలీలు లేక పనులు నిలిచిపోయి మహమ్మద్ బాగా నష్టపోవాల్సి వచ్చింది. దీంతో ఉత్తమ్‌కుమార్‌ను ఎలాగైనా ఇబ్బంది పెట్టాలని పోలీసులకు తప్పుడు సమాచారం అందించానని ఒప్పుకున్నాడు. తప్పుడు సమాచారంతో పోలీసులను తప్పుదోవ పట్టించి, అధికారులను ప్రజలను భయభ్రాంతులకు గురిచేసిన అహ్మద్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించినట్టు అర్బన్ ఎస్పీ తెలిపారు.