
మెర్‌స్క్ నౌక
సాక్షి, లక్షద్వీప్: అరేబియా సముద్రంలోని లక్షద్వీప్‌లో అగట్టికి 340 నాటికల్ మైళ్ల దూరంలో ఓ భారీ వాణిజ్య నౌక మంటల్లో చిక్కుంది. డెన్మార్క్‌లోని మెర్‌స్క్ కంపెనీకి చెందిన ఈ నౌకలో మంగళవారం అర్ధరాత్రి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది తమ పైఅధికారులకు సమాచారమందించారు. గత రెండు రోజులుగా మంటలు అదుపులోకి రావడం లేదు. దీనిలో మొత్తం 27 మంది సిబ్బంది ఉన్నారు. వారిలో 13 మంది భారతీయులు ఉన్నారు. ప్రమాదంలో ఒకరు మరణించారు. ఆయన థాయ్‌ల్యాండ్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. మరో నలుగురు ఆచూకీ ఇప్పటికీ దొరకలేదు. మిగిలిన వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఇండియన్ కోస్ట్ గార్డ్ ఘటనకి సంబంధించిన నష్టంపై పూర్తి సమాచారం లేదని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment