లక్ష్యదీప్ వ్యవహారంలో ప్రధాని మోదీపై మాల్దీవుల మంత్రులు చేసిన అనుచిత వ్యాఖ్యలపై లక్ష్యదీప్ అడ్మినిస్ట్రేటర్ ప్రఫూల్ పటేల్ మండిపడ్డారు. మాల్దీవుల మంత్రుల వ్యాఖ్యలు భారతదేశ గౌరవాన్ని సవాల్ చేసినట్లు తెలిపారు. ఈ వ్యవహారంపై మొదటిసారి అడ్మినిస్ట్రేటర్ ప్రఫూల్ పటేల్ స్పందించారు. ఇలాంటి ద్వేష పూరిత వ్యాఖ్యలను భారత్ అస్సలు సహించదని అన్నారు. అదీ కాక, భారత దేశంలో మొత్తం ప్రధాని నరేంద్ర మోదీకి అండగా నిలుస్తుందని తెలిపారు. ఈ సమయంలో భారతప్రధాన మంత్రికి తమదైన శైలిలో అండగా నిలిచిన భారత దేశ ప్రజలకు తాను కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు.
అనుచిత వ్యఖ్యలు చేసిన మాల్దీవులు మంత్రులు బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. బహిరంగ క్షమాపణలు కూడా చెప్పాలని లేదని, తమ విలువలు పూర్తిగా భిన్నమైనవి పేర్కొన్నారు. మాల్దీవుల మంత్రులు అలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయాల్సింది కాదని అన్నారు. సదరు మంత్రులపై ఆ దేశ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. భారత దేశాన్ని, తమ దేశ ప్రధానమంత్రిని కించపరిచితే ఊరుకునే ప్రసక్తే లేదని మండిపడ్డారు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు మాల్దీవుల మంత్రుల వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారని గుర్తుచేశారు.
లక్ష్య దీప్‌కు మాల్దీవుల టూరిస్టులను అనుతిస్తారా? అని మీడియా ప్రశ్నకు.. అందరిని స్వాగతించడమే తమ దేశ సంస్కృతి అని అన్నారు. మాల్దీవుల సందర్శకులు లక్ష్యదీప్‌కు వచ్చి, ఇక్కడి అందాలను ఆస్వాదిస్తూ.. అభినందిస్తే తమకు ఎటువంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. వారు అలా ఉంటే తమకు కూడా సంతోషమేనని అన్నారు. వారి రాకపై తమకు ఎటువంటి అభ్యంతరం లేదని చెప్పారు. తప్పకుండా మాల్దీవుల టూరిస్టులు కూడా లక్ష్యదీప్‌కు రావాలని తెలిపారు.
ఇటీవల ప్రధానమంత్రి మోదీ లక్ష్యదీప్‌లో పలు కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ క్రమంలో అక్కడి అందాలకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేసిన విసయం తెలసిందే. అయితే కొంత మంది నెటిజన్లు మాల్దీవుల కంటే కూడా లక్ష్యదీప్ బాగుందని కామెంట్లు చేశారు. దీంతో మాల్దీవుల మంత్రులు.. ప్రధాని మోదీ వీడియో, ఫొటోలపై అక్కసుతో అనుచిత వ్యాఖ్యలు చేశారు.
ఈ వ్యవహారం వివాదాస్పదమై.. సోషల్ మీడియాలో బాయ్‌కాట్ మాల్దీవులు అంటూ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అయింది. ఇక.. మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సదరు ముగ్గురు మంత్రులను మాల్దీవుల ప్రభుత్వం వేటు వేసిన విషయం తెలిసిందే.
చదవండి: Lakshadweep vs Maldives: ముదిరిన లక్షద్వీప్–మాల్దీవుల వివాదం
Comments
Please login to add a commentAdd a comment