కార్యకర్తకు చెంపదెబ్బ! | Madhya Pradesh Congress leader Ajay Singh landed himself in a controversy | Sakshi
Sakshi News home page

కార్యకర్తకు చెంపదెబ్బ!

Published Tue, Jun 20 2017 11:21 AM | Last Updated on Tue, Sep 5 2017 2:04 PM

కార్యకర్తకు చెంపదెబ్బ!

కార్యకర్తకు చెంపదెబ్బ!

భోపాల్‌: మధ్యప్రదేశ్ కాంగ్రెస్‌ నేత అజయ్‌ సింగ్‌ చిక్కుల్లో పడ్డారు. ఇటీవల రాష్ట్రంలో జరిగిన రైతు హత్యలపై నిరసన తెలిపే కార్యక్రమంలో పాల్గొన్న ఆయన సహనం కోల్పోయారు. సొంతపార్టీ కార్యకర్తపైనే చేయిచేసుకున్నారు.

మంద్‌సౌర్‌లో రైతులపై కాల్పుల ఘటనపై సాగర్‌లో కాంగ్రెస్‌ నిర్వహించిన నిరసన కార్యక్రమంలో అజయ్ సింగ్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓ దశలో సహనం కోల్పోయిన ఆయన పార్టీ కార్యకర్తపై దురుసుగా ప్రవర్తించారు. ఈ దృశ్యాలు మీడియాలో ప్రసారం కావడంతో అజయ్‌ సింగ్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై వివరణ ఇచ్చిన అజయ్‌ సింగ్‌.. కలెక్టర్‌కు మెమొరాండం ఇచ్చేందుకు వెళ్తుండగా కొందరు కార్యకర్తలు ఆవేశంగా వ్యవహరించడంతో.. వారిని శాంతియుతంగా నిరసన చేపట్టాలని చెప్పానన్నారు. కార్యకర్తను పక్కకు నెట్టివేశానే తప్ప కొట్టలేదని చెప్పుకొచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement