Mandsaur
-
బర్డ్ ఫ్లూ: 15 రోజుల పాటు చికెన్ సెంటర్లు బంద్
భోపాల్: కరోనా వైరస్ ఇంకా కంట్రోల్ కాలేదు. మరో వైపు బర్డ్ ఫ్లూ ముంచుకోస్తుంది. ఇప్పటికే కేరళ, హిమాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ తీవ్ర రూపం దాల్చిన సంగతి తెలిసిందే. ఇక మధ్యప్రదేశ్ మాంద్సౌర్లో బర్డ్ ఫ్లూ విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. మంద్సౌర్ జిల్లా వ్యాప్తంగా 15 రోజుల పాటు చికెన్ సెంటర్లు ముసివేయడమే కాక, కోడిగుడ్ల విక్రయాలను నిషేధించారు. మంద్సౌర్ ప్రాంతంలో ఒకే రోజు 100 కాకులు చనిపోవడమే కాక.. ఇక ఇండోర్ ప్రాంతంలో చనిపోయిన కాకుల్లో బర్డ్ ఫ్లూ వైరస్‌ని గుర్తించడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక మరికొన్ని జిల్లాల్లో కూడా బర్డ్ ఫ్లూ మరణాలు వెలుగు చూసినట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి ప్రేమ్ సింగ్ పటేల్ మాట్లాడుతూ ‘ఇండోర్‌లో చనిపోయిన కాకుల్లో ఏవియన్ ఇన్ఫ్లుఎంజా (బర్డ్ ఫ్లూ) గుర్తించారు. దాంతో ఇక్కడ రాపిడ్ రెస్పాన్స్ టీం కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేస్తోందని’ తెలిపారు. (చదవండి: కరోనా వల్ల మేలెంత? కీడెంత? ) 2020 డిసెంబర్ 23 నుంచి 2021 జనవరి 3 వరకు మధ్యప్రదేశ్ ఇండోర్‌లో 142, మాంద్సౌర్లో 100, అగర్-మాల్వాలో 112, ఖార్గోన్లో 13, సెహోర్ జిల్లాలో తొమ్మిది కాకులు మరణించినట్లు అధికారులు తెలిపారు. ఇక కేరళలో కేరళలోని కొట్టాయం, అలపూజ జిల్లాల్లో బర్డ్ ఫ్లూ వైరస్ గుర్తించారు. దీని కారణంగా ఇప్పటికే ఈ ప్రాంతంలో 12 వేల బాతులు చనిపోగా.. మరో 36,000 బాతులు చనిపోయే ప్రమాదం ఉందని అధికారులు వెల్లడించారు. -
వరదలతో చెలగాటం.. తల్లీ, కూతురు మృతి
భోపాల్: వరదలతో అందరూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతుంటే ఓ మహిళ మాత్రం చేతిలో ఫోన్ పట్టుకుని సెల్ఫీ దిగటానికి ప్రయత్నించింది. అయితే సరదా కోసం ఆమె చేసిన ప్రయత్నం విషాదాన్ని మిగిల్చింది. తల్లి సెల్ఫీ పిచ్చి ఆమెతోపాటు కూతురి ప్రాణాలు కూడా తీసింది. ఈ విచార ఘటన మధ్యప్రదేశ్‌లోని మంద్‌సౌర్‌లో జరిగింది. వివరాల్లోకి వెళితే.. ఓ ఫిజిక్స్ ప్రొఫెసర్, తన భార్యాకూతురితో కలిసి బుధవారం వారి ఇంటికి కొద్ది దూరంలోని వరద కాలువ దగ్గరికి వెళ్లారు. అక్కడ తల్లీకూతురు సెల్ఫీ దిగడానికి ప్రయత్నించారు. ఈ సమయంలో వారు నిలుచున్న కల్వర్టు కూలిపోవడంతో వారిద్దరూ ఆ ప్రవాహంలో పడి కొట్టుకుపోయారు. స్థానికులు వారిని కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఇక మధ్యప్రదేశ్‌లోని ప్రధాన నదులన్నీ ఉధృతంగా ప్రవహించటంతో పలు ప్రాంతాలు జలదిగ్భందంలో చిక్కుకున్నాయి. భారీ వర్షాల కారణంగా పలువురు మృతి చెందగా, మూడు వేల మంది నిరాశ్రయులయ్యారు. -
చితక్కొట్టి.. ముక్కుతో షూను రాయించి..
మాండోసోర్ : మధ్యప్రదేశ్‌లో దారుణం జరిగింది. ఓ వివాహ వేడుకలో ఘర్షణ చోటుచేసుకోవడంతో కొందరు యువకులు ఓ వ్యక్తిని చితక్కొట్టారు. అక్కడితో ఆగకుండా అతడితో అక్కడున్నవారి షూపై ముక్కుతో రాయించారు. ఈ సంఘటన జున్ 16న చోటుచేసుకోగా, దీనికి సంబంధించి వీడియో సామాజికమాధ్యమాల్లో ప్రత్యక్షమవ్వడంతో ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ సంఘటన జరిగనప్పటి నుంచి బాధితుడు కనిపించకుండా పోయాడు. సీనియర్ అధికారుల పర్యవేక్షణలో నింధితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశామని మాండోసోర్ సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ దిలీప్ సింగ్ బిల్వాల్ తెలిపారు. -
ముక్కుతో షూను రాయించి..
-
మందసోర్లో బీజేపీకే మొగ్గు
భోపాల్ : హిందీ బెల్ట్‌లో కీలక రాజస్ధాన్, చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ రాష్ర్టాల్లో బీజేపీకి పరాజయం ఎదురైనా మధ్యప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో కాంగ్రెస్‌కు బీజేపీ నుంచి గట్టిపోటీ ఎదురైంది. రైతుల ఆందోళనలతో అట్టుడికిన మందసోర్ ప్రాంతంలో బీజేపీ మెరుగైన ఫలితాలు సాధించడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలోనూ రైతుల సమస్యలు, అన్నదాతల ఆందోళన ప్రధాన ప్రచారాస్త్రంగా మారింది. గత ఏడాది రైతుల ఆందోళన సందర్భంగా పోలీసులు, రైతుల మధ్య జరిగిన ఘర్షణలు కాల్పులకు దారితీసి ఆరుగురు రైతులు మరణించిన సంగతి తెలిసిందే. రైతుల మృతితో మందసోర్ జాతీయ పతాకశీర్షికలకు ఎక్కింది. బీజేపీ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలపై కాంగ్రెస్ పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టింది. మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్, ప్రధాని నరేంద్ర మోదీ రైతు సమస్యల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారని విమర్శలు గుప్పించింది. రైతుల ఆగ్రహానికి కేంద్ర బిందువుగా నిలిచి వివిధ రాష్ర్టాల్లో రైతాంగ పోరాటాలకు స్ఫూర్తిగా నిలిచిన మందసోర్లో ఊహించని ఫలితాలు రావడం విశేషం. మందసోర్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని మందసోర్, మల్హర్గర్, నీముచ్, మనస, జవాద్, జవోర స్ధానాలను బీజేపీ నిలబెట్టుకోగా, 2013లో కాంగ్రెస్ గెలుపొందిన సువర్సా స్ధానంలోనూ బీజేపీ విజయం సాధించడం గమనార్హం. -
విద్యార్థుల కాళ్లు మొక్కిన ప్రొఫెసర్
-
విద్యార్థుల కాళ్లు మొక్కిన ప్రొఫెసర్
భోపాల్ : అధ్యాపక వృత్తిలో ఉంటూ పాపం చేశానంటూ విద్యార్థులను వెంబడిస్తూ వారి కాళ్లను మొక్కుతున్న ఓ ఉపాధ్యాయుడి వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. మధ్యప్రదేశ్‌లోని మాంద్‌సోర్‌లో రాజీవ్ గాంధీ ప్రభుత్వ కళాశాలలో దినేశ్ గుప్తా ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. పరీక్షల ఫలితాలు జాప్యం అవుతున్నాయని ఏబీవీపీ జిల్లా అధ్యక్షుడు పవన్ శర్మ ఆధ్వర్యలో నిరసన చేపట్టారు. దీనిలో భాగంగా దినేశ్ గుప్తా పాఠాలు చెబుతున్న తరగతి దగ్గరకి వెళ్లి స్లోగన్లు ఇవ్వడం ప్రారంభించారు. తన క్లాస్‌ను అడ్డుకోవద్దంటూ దినేశ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో భారత్ మాతాకీ జై, వందేమాతరం స్లోగన్‌లనే అడ్డుకుంటారా.. దినేశ్ గుప్తా దేశ ద్రోహి అంటూ స్లోగన్లు ఇవ్వడం ప్రారంభించారు. ప్రిన్సిపాల్ రవింద్ర సొహానీ జోక్యం చేసుకొని దినేశ్ గుప్తాతోపాటూ ఏబీవీపీ విద్యార్థులను సంయమనం పాటించాలని సూచించారు. ప్రొఫెసర్ తమకు క్షమాణ చెప్పాల్సిందేనని ఏబీవీపీ విద్యార్థులు పట్టుబట్టారు. దీనికి దినేశ్ గుప్తా ఒప్పుకోకపోవడంతో అతన్ని వెంబడిస్తూ దేశద్రోహి అంటూ స్లోగన్లు ఇవ్వడం ప్రారంభించారు. దీంతో చిర్రెత్తుకొచ్చిన దినేశ్ గుప్తా కాలేజీ క్యాంపస్‌లోనే విద్యార్థులు ఒక్కొక్కరి దగ్గరకు వెళ్లి కాళ్లు పట్టుకున్నారు. వెంటపడి మరీ కాళ్లు మొక్కే ప్రయత్నం చేశారు. దాంతో విద్యార్థులు అక్కడి నుంచి పారిపోయారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఏబీవీపీ ఉపాధ్యాయులను గౌరవిస్తుందని, రాజీవ్ గాంధీ ప్రభుత్వ కళాశాలలో చోటు చేసుకున్న ఘటన బాధాకరమని ఏబీవీపీ జాతీయ నేత అంకిత్ గార్గ్ వ్యాఖ్యానించారు. పరీక్షా ఫలితాల్లో జాప్యం కారణంగానే ఏబీవీపీ విద్యార్థులు నిరసన తెలిపారని, దినేశ్ గుప్తాను దేశ ద్రోహి అని ఎవరూ అనలేదన్నారు. ఆ సమయంలో ప్రొఫెసర్ కోపంగా ఉన్నందును క్యాంపస్‌లో రచ్చ చేయడానికే విద్యార్థుల కాళ్లు పట్టుకున్నారని తెలిపారు. 'నిరసన పేరుతో నా తరగతికి ఏబీవీపీ విద్యార్థులు అడ్డుతగిలారు. వాళ్లు నన్ను దేశ ద్రోహి అంటూ స్లోగన్లు ఇచ్చారు. నన్ను క్షమాణ చెప్పాలని కోరారు. సరే, అని వాళ్ల కాళ్ల మొక్కా. ఈ క్యాంపస్‌లో గత 32 ఏళ్లుగా ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నా. వారికన్నా నాకే దేశభక్తి ఎక్కువ. దేశభక్తిని ఒకరికి చూపించాల్సిన అవసరం నాకు లేదు. విద్యార్థులు బాగా చదువుకోవాలనే నేను కోరుతున్నా. చదువుకుంటేనే జీవితం బాగుంటుంది. వాళ్లపై చర్యలు తీసుకోవాలని నేను అనుకోవడం లేదు' అని దినేశ్ గుప్తా తెలిపారు. ఇది అంత పెద్ద సమస్య ఏమీ కాదని, ఈ సమస్య పరిష్కారం అయిపోయిందని ప్రిన్సిపల్ రవింద్ర సొహానీ అన్నారు. -
మంద్సౌర్ కేసు: దిగ్భ్రాంతికర అంశాలు
భోపాల్ : సంచలనం సృష్టించిన మంద్సౌర్ గ్యాంగ్‌రేప్ కేసులో పోలీసులు దిగ్భ్రాంతికర అంశాలు వెల్లడించారు. ఈ దారుణం ముందుగానే అనుకుని.. ప్లాన్ ప్రకారం జరగలేదని, అప్పటికప్పుడు దుష్టుల బుర్రలో పుట్టిన ఆలోచన అని పోలీసులు అధికారులు తెలిపారు. ఈ దారుణానికి ఒడిగట్టిన నిందితులు ఆసిఫ్(24), ఇర్ఫాన్(20) పోలీసుల అదుపులో ఉన్న సంగతి తెలిసిందే. జరిగిన దారుణం గురించి ఇచ్చిన నిందితుడు ఇర్ఫాన్ నుంచి పోలీసులు వివరాలు రాబట్టారు. ‘ఈ సంఘటన జరిగిన రోజున బాలిక పాఠశాల ఆవరణలో ఒంటరిగా నిల్చుని ఉంది. ఆ సమయంలో ఇర్ఫాన్ అక్కడి నుంచే వెళ్లాడు. అక్కడ ఒంటరిగా ఉన్న బాలికను చూశాడు. మరో పది నిమిషాల తర్వాత ఇర్ఫాన్ అక్కడికి వచ్చేటప్పటికి కూడా ఆ బాలిక ఇంకా అక్కడే ఉంది. చుట్టుపక్కల ఎవరూ లేరు. దాంతో ఇర్ఫాన్ ఆ బాలిక దగ్గరకు వెళ్లి మిఠాయిలు కొనిపిస్తానని నమ్మబలికి చిన్నారిని తనతో తీసుకెళ్లాడు. బాలికను తీసుకెళ్తున్న సమయంలో ఎవరైనా ఈ విషయం గురించి అడిగితే స్కూల్ అయిపోయినా బాలికను తీసుకెళ్లడానికి ఎవరూ రాలేదని.. అందుకే తాను బాలికను ఇంటికి తీసుకెళ్తున్నాను చెప్పాలని నిర్ణయించుకున్నాడు. అనంతరం బాలికను పాఠశాల వెనక ఉన్న పాడుబడిన లక్ష్మీదర్వాజ అనే బిల్డింగ్‌కు తీసుకెళ్లాడు. తర్వాత తన స్నేహితుడు ఆసిఫ్‌కు ఫోన్ చేశాడు. అనంతరం వారు దారుణంగా ఆ చిన్నారిని అత్యాచారం చేసి గొంతు కోశార’ని పోలీసులు తెలిపారు. అయితే ఆ బాలిక ఇచ్చిన స్టేట్మెంట్లో ఆ సమయంలో ముగ్గురు వ్యక్తులు ఉన్నారని తెలపగా, నిందితులు మాత్రం తాము ఇద్దరమే అని చెప్పారు. -
మాందసౌర్ ఘటన : మరో పిడుగులాంటి వార్త
భోపాల్ : మధ్యప్రదేశ్‌లోని మంద్‌సౌర్‌లో ఇటీవల ఎనిమిదేళ్ల బాలికను అపహరించి ఇద్దరు వ్యక్తులు అత్యంత కిరాతంగా అత్యాచారం చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఘటన జరిగిన మరునాడే ఇద్దరు నిందితులను ఆసీఫ్(24), ఇర్ఫాన్(20)లను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే నిందితుల ఆరోగ్య పరిస్థితికి సంబంధించి పోలీసులు చెప్పిన వివరాలు బాధిత బాలిక తల్లిదండ్రులను మరింత ఆందోళనకు గురి చేస్తున్నాయి. అత్యాచారానికి పాల్పడ్డ నిందితులకు ప్రాణాంతక ఎయిడ్స్ వ్యాధి ఉన్నట్లుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వారికి హెచ్ఐవీ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. కూతురి ఆరోగ్యం క్రమంగా మెరుగవుతోందని వైద్యులు చెప్పడంతో ఊపిరి పీల్చుకుంటున్న బాధితురాలి తల్లిదండ్రులు పిడుగులాంటి ఈ వార్తతో తమ కూతురి భవిష్యత్తు ఏమవుతుందోనని ఆందోళన చెందుతున్నారు. కాగా నిందితుడు ఇర్ఫాన్ తల్లి తన కుమారుడికి అండగా నిలిచారు. తన కుమారుడు అమాయకుడని, తను ఎలాంటి తప్పు చేసి ఉండడని ఆమె తెలిపారు. సీబీఐతో విచారణకు సిద్ధమని, విచారణలో తన కుమారుడు తప్పు చేసినట్లు రుజవైతే ఎలాంటి శిక్షకైన సిద్ధంగా ఉన్నామని ఆమె పేర్కొన్నారు. అయితే నిందితుడు ఇర్ఫాన్ మూడు రోజుల పాటు రిమాండ్‌లో ఉంచనున్నట్లు పోలీసులు తెలిపారు. -
‘వారిని ఉరి తీయండి’
భోపాల్ : మంద్సౌర్ అత్యాచార ఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. మంద్సౌర్, ఇండోర్, దార్ ప్రాంతాల్లో ధర్నా నిర్వహించిన నిరసన కారులు నిందితును వెంటనే ఉరి తీయాలి డిమాండ్ చేశారు. మధ్యప్రదేశ్‌లోని మంద్‌సౌర్‌లో ఇటీవల ఎనిమిదేళ్ల బాలికను ఇద్దరు వ్యక్తులు అపహరించి కిరాతంగా హత్యచారం చేసిన విషయం తెలిసిందే. బాలికను శనివారం పరామర్శించిన రాష్ట్ర మహిళ, శిశు సంక్షేమశాఖ మంత్రి అర్చన చిట్నిస్ బాధిత కుటుంబానికి ఐదు లక్షల ఆర్థిక సహాయం చేస్తున్నట్లు ప్రకటించారు. మంత్రి ప్రకటనపై బాలిక తండ్రి మండిపడ్డారు. తమకు ఏలాంటి ఆర్థిక సహాయం అవసరం లేదని, తన బిడ్డకు అన్యాయం చేసిన దుర్మర్గులను వెంటనే ఉరితీయాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై ప్రతిపక్ష కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపిస్తోంది. బాలికను మెరుగైన వైద్యంకోసం ఢిల్లీ తరలించాలని, నిందితులను శిక్షించాలని డిమాండ్ చేసింది. ఘటన జరిగిన మరునాడే ఇద్దరు నిందితులను ఆసీఫ్(24), ఇర్ఫాన్(20)లను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. దీనిపై ఇర్ఫాన్ తల్లి తన కుమారుడికి అండగా నిలిచారు. తన కుమారుడు అమాయకుడని, తను ఏలాంటి తప్పు చేసి ఉండడని ఆమె తెలిపారు. సీబీఐతో విచారణకు సిద్ధమని, విచారణలో తన కుమారుడు తప్పు చేసినట్లు రుజవైతే ఎలాంటి శిక్షకైన సిద్ధంగా ఉన్నామని ఆమె పేర్కొన్నారు. నిందితులు చిన్నపిల్లల్ని ఎత్తుకుని పోయే ముఠాతో సంబందాలు ఉన్నాయని, వారిపై అనుమానంతోనే అరెస్ట్ చేసినట్లు స్టేషన్ ఎస్ఐ జితేందర్ సింగ్ యాదవ్ తెలిపారు. I trust he is innocent. A CBI inquiry should be conducted in the case. If he is found guilty he should be severely punished: Mother of the second accused in rape of an eight-year-old in Mandsaur. #MadhyaPradesh pic.twitter.com/t1nyO3GCDM — ANI (@ANI) July 1, 2018 -
అతడి తల నరికి తెస్తే 5 లక్షలు : బీజేపీ నేత
భోపాల్ : మంద్సౌర్ గ్యాంగ్‌రేప్ కేసులో నిందితుడి తల నరికి తెస్తే ఐదు లక్షలు ఇస్తానంటూ భారతీయ జనతా పార్టీ(బీజేపీ) నేత సంజీవ్ మిశ్రా సంచలన వ్యాఖ్యలు చేశారు. రేప్ కేసులో నిందితుడికి కఠిన శిక్ష విధించాలని ఆయన డిమాండ్ చేశారు. కోర్టు లేదా ప్రభుత్వం ఆ పని చేయలేకపోతే.. అతని తల నరికి తెచ్చిన వారికి నేనే 5 లక్షలు ఇస్తా అని సంజీవ్ మిశ్రా అన్నారు. కాగా, సంజయ్ ఇలా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం కొత్తేమీ కాదు. మంద్‌సౌర్‌లో 8 ఏళ్ల బాలికపై జరిగిన రేప్‌పై పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమైన విషయం తెలిసిందే. ఈ కేసులో నిందితుడిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలి పెట్టబోమని మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ ఇప్పటికే స్పష్టం చేశారు. బాధిత చిన్నారి కుటుంబానికి రూ.5 లక్షలు ఇచ్చారు. అయితే ఆ డబ్బు తీసుకోవడానికి ఆయన నిరాకరించారు. తనకు డబ్బు అవసరం లేదని, నిందితున్ని ఉరి తీయాలని ఆ చిన్నారి తండ్రి డిమాండ్ చేశారు. -
మీకోసమే వచ్చారు.. కృతజ్ఞతలు తెలపండి!
ఇండోర్: అసలే కుమార్తెపై అఘాయిత్యంతో కుమిలిపోతున్న తల్లిదండ్రులతో బీజేపీ ఎమ్మెల్యే ఒకరు అమానవీయంగా ప్రవర్తించారు. ‘మిమ్మల్ని పరామర్శించడానికి వచ్చిన ఎంపీకి కృతజ్ఞతలు తెలపండి’ అంటూ తీవ్రమైన బాధలో ఉన్న కుటుంబసభ్యుల్ని ఆదేశించాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. మంద్‌సౌర్‌లో జూన్ 26న ఓ మైనర్ బాలిక(8)పై ఇద్దరు దుండగులు గ్యాంగ్‌రేప్‌కు పాల్పడ్డారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ బాధితురాలు ప్రస్తుతం ఇండోర్ ప్రభుత్వాసుపత్రిలో కోలుకుంటోంది. ఈ నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్యే సుదర్శన్ గుప్తా, మంద్సౌర్ ఎంపీ సుధీర్‌తో కలసి బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించేందుకు శనివారం ఆస్పత్రికి చేరుకున్నారు. ఈ సందర్భంగా అత్యుత్సాహం చూపిన ఎమ్మెల్యే సుదర్శన్.. ‘ఎంపీ సుధీర్‌కు కృతజ్ఞతలు తెలపండి. ఆయన మిమ్మల్ని కలుసుకునేందుకే ప్రత్యేకంగా ఆస్పత్రికి వచ్చారు’ అని చెప్పారు. దీంతో తెల్లబోయిన బాధితురాలి తల్లిదండ్రులు ఇద్దరికీ చేతులెత్తి దండం పెట్టారు. ఇంతలో మీడియాను గమనించిన సుదర్శన్.. ‘ఇంకేమైనా అవసరముంటే చెప్పండి’ అని వ్యాఖ్యానించారు. కాగా, ఎమ్మెల్యే వ్యాఖ్యలపై అన్నివైపుల నుంచి విమర్శలు వెల్లువెత్తడంతో ఆయన బాధితురాలి కుటుంబానికి క్షమాపణలు చెప్పారు. మరోవైపు మైనర్ బాలిక ఆరోగ్యం క్రమంగా మెరుగవుతోంది. -
మాందసౌర్ ఘటన; బీజేపీ నేతల అత్యుత్సాహం
భోపాల్ : ఎన్ని కఠిన చట్టాలు వచ్చిన మృగాళ్ల అకృత్యాలను మాత్రం అడ్డుకోలేక పోతున్నాయి. కొన్ని రోజుల క్రితమే ఒక ప్రముఖ అంతర్జాతీయ సంస్థ భారత్ మహిళలకు చాలా ప్రమాదకరమైన దేశంగా గుర్తించింది. ఒక వైపు ఈ విషయం గురించి ఆందోళనలు జరుగుతుంటే...మరో వైపు మృగాళ్లు మాత్రం వీటిని ఏ మాత్రం లెక్క చేయకుండా తమ అకృత్యాలను కొనసాగిస్తూనే ఉన్నారు. రెండు రోజుల క్రితమే మధ్యప్రదేశ్, మాందసౌర్‌లోని ఓ ఎనిమేదళ్ల చిన్నారిని ఇర్ఫాన్(20) అనే వ్యక్తి అపహరించి అత్యంత దారుణంగా అత్యచారానికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఇలాంటి దారుణాలను అరికట్టలేని నాయకులు, జరాగాల్సిన నష్టం జరిగాక, తీరిగ్గా పరామార్శల పేరుతో వచ్చి బాధితులను మరింత ఇబ్బంది పెడుతుంటారు. ఇలాంటి సంఘటనే ఒకటి ఇండోర్‌లో జరిగింది. మాందసౌర్‌లో గ్యాంగ్‌రేప్‌కు గురై, తీవ్ర గాయలతో బాధపడుతున్న బాలికను మధ్యప్రదేశ్, ఇండోర్‌లోని ఒక ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు. అయితే సదరు బాలికను సందర్శించడానికి బీజేపీ మంత్రి సుధీర్ గుప్తా ఆస్పత్రికి వచ్చారు. ఆయన రాకకు మురిసిపోయిన ఆ పార్టీ నాయకులు కొందరు మంత్రి గారేదో మహా ఘనకార్యం చేసినట్లు భావించారు. ఆ ఆనందంలో సుదర్శన్ గుప్తా అనే ఓ బీజేపీ నాయకుడు ‘మీ అమ్మాయిని కలవడానికే మంత్రిగారు ఇంత దూరం వచ్చారు. వెళ్లండి, వెళ్లి ఆయనకు ధన్యవాదాలు తెలపండి’ అంటూ బాధితురాలి కుటుంబ సభ్యులకు చెప్పాడు. దాంతో బాలిక తల్లిదండ్రులు మంత్రి గారి దగ్గరకు వెళ్లి చేతులు కట్టుకుని నిల్చుని ధన్యవాదాలు తెలిపారు. ఈ మొత్తం తతంగాన్నంతా ఎవరో వీడియో తీసారు. ఈ వీడియో కాస్తా లీక్ అవడంతో వీడియోలోని బీజేపీ నాయకున్ని తీవ్రంగా వియర్శిస్తున్నారు నెటిజన్లు. ఇదిలా ఉండగా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మాందసార్ ఘటనపై స్పందిస్తూ నిందుతులను ఉరి తీయాలని చెప్పడం తెలిసిందే. -
మేం అధికారంలోకి వస్తే.. పది రోజుల్లో రుణమాఫీ!
మంద్సౌర్ : కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మధ్యప్రదేశ్ రైతులకు ప్రత్యేక హామీ ఇచ్చారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే 10 రోజుల్లోనే రైతుల రుణాలు మాఫీ చేస్తామన్నారు. గతేడాది ఇదే రోజున మంద్‌సౌర్‌లో మద్దతు ధర కోసం ఆందోళన నిర్వహించిన రైతులపై పోలీసులు కాల్పుల జరుపగా ఆరుగురు రైతులు మరణించిన సంగతి తెలిసిందే. వారికి నివాళులు ఆర్పించేందుకు కాంగ్రెస్ మంద్సౌర్ జిల్లాలోని పిప్లియా మండిలో బుధవారం ర్యాలీ నిర్వహించింది. ఈ ర్యాలీలో పాల్గొన్న రాహుల్ కాల్పుల్లో మరణించిన రైతులకు నివాళులు అర్పించడంతో పాటు వారి కుటుంబాలను కలుసుకున్నారు. మధ్యప్రదేశ్‌లో గత 15 ఏళ్ల నుంచి విపక్షంలోనే కొనసాగుతున్న కాంగ్రెస్ ఈ ఏడాది చివరన జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా గెలుపొందాలని చూస్తోంది. అందులో భాగంగా రాహుల్ మధ్యప్రదేశ్‌పై ప్రత్యేక దృష్టి సారించారు. రైతుల స్మారక ర్యాలీలో పాల్గొన్న రాహుల్ మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మంద్సౌర్ కాల్పులపై విచారణ చేపడతామని తెలిపారు. దేశంలో ఏడాదికి సుమారు 1200 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడున్నారన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇక్కడి ప్రజలకు అవాస్తవాలు చెబుతున్నాడని విమర్శించారు. -
రాత్రికిరాత్రే 50 కార్లను చిత్తుచిత్తు చేశారు
మంద్సౌర్: మధ్యప్రదేశ్ రాష్ట్రం మంద్సౌర్ పట్టణం మరోసారి వార్తలోకి వచ్చింది. మంగళవారం అర్థరరాత్రి దాటిన తర్వాత గుర్తు తెలియని దుండగులు.. ఒక వర్గం వారి కార్ల అద్దాలను ధ్వంసం చేశారు. సీరియస్‌గా తీసుకున్న పోలీసులు సత్వరమే రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టారు. కొత్వాలీ ప్రాంతంలోని ఒకే వర్గానికి చెందిన వారి ఇళ్ల వద్ద పార్క్ చేసి ఉన్న దాదాపు 50 కార్లను ఆగంతకులు ధ్వంసం చేశారు. తెల్లవారు జామున 2.30 నుంచి 3 గంటల వరకు దుండగులు స్వైరవిహారం చేశారు. స్థానికుల సమాచారం మేరకు స్పందించిన పోలీసులు బైక్‌పై వెళ్తున్న అగంతకులను గుర్తించి వెంటాడినా వారు తప్పించుకుపోయారు. కాగా, ఈ ఘటనతో తీవ్రంగా ఆగ్రహించిన కార్ల యజమానులు జాతీయ రహదారిపై కొద్దిసేపు ధ్వంసమైన తమ కార్లతో ఆందోళనకు దిగారు. నిందితులను గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కాగా, పోలీసులు నిందితులను గర్తించే పనిలో పడ్డారు. వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ఫుటేజిని పరిశీలిస్తున్నారు. ఐదుగురు వ్యక్తులు ఈ ఘటనలో పాల్గొని ఉంటారని భావిస్తున్నారు. మత విద్వేషాలను రెచ్చగొట్టేందుకే కొన్ని సంఘ విద్రోహ శక్తులు ఈ చర్యకు పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. ఇటీవలే ఈ పట్టణంలో ఆందోళన జరుపుతున్న రైతులపై జరిపిన పోలీసు కాల్పుల్లో ఐదుగురు చనిపోయిన విషయం విదితమే. -
కార్యకర్తకు చెంపదెబ్బ!
భోపాల్: మధ్యప్రదేశ్ కాంగ్రెస్ నేత అజయ్ సింగ్ చిక్కుల్లో పడ్డారు. ఇటీవల రాష్ట్రంలో జరిగిన రైతు హత్యలపై నిరసన తెలిపే కార్యక్రమంలో పాల్గొన్న ఆయన సహనం కోల్పోయారు. సొంతపార్టీ కార్యకర్తపైనే చేయిచేసుకున్నారు. మంద్‌సౌర్‌లో రైతులపై కాల్పుల ఘటనపై సాగర్‌లో కాంగ్రెస్ నిర్వహించిన నిరసన కార్యక్రమంలో అజయ్ సింగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓ దశలో సహనం కోల్పోయిన ఆయన పార్టీ కార్యకర్తపై దురుసుగా ప్రవర్తించారు. ఈ దృశ్యాలు మీడియాలో ప్రసారం కావడంతో అజయ్ సింగ్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై వివరణ ఇచ్చిన అజయ్ సింగ్.. కలెక్టర్‌కు మెమొరాండం ఇచ్చేందుకు వెళ్తుండగా కొందరు కార్యకర్తలు ఆవేశంగా వ్యవహరించడంతో.. వారిని శాంతియుతంగా నిరసన చేపట్టాలని చెప్పానన్నారు. కార్యకర్తను పక్కకు నెట్టివేశానే తప్ప కొట్టలేదని చెప్పుకొచ్చారు. -
‘ఉగ్రవాదిని కాదు.. లాహోర్ నుంచి రాలేదు’
న్యూఢిల్లీ: ‘నేనేం ఉగ్రవాదిని కాదు.. లాహోర్ నుంచి రాలేదు’అని పటేల్ ఉద్యమకారుడు హార్దిక్ పటేల్ తనను అరెస్టు చేసిన పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు తనను అరెస్టుచేయాల్సిన అవసరం ఏమిటని, తాను కూడా ఈ భారతదేశ పౌరుడినే అని చెప్పిన ఆయన తనకు ఎక్కడైనా సంచరించే హక్కు ఉందని చెప్పారు. మధ్యప్రదేశ్‌లో రైతులపై కాల్పులు చోటుచేసుకున్న మాంద్సౌర్ ప్రాంతానికి హార్దిక్ వెళుతుండగా పోలీసులు అరెస్టు చేశారు. తమ వ్యవసాయ ఉత్పత్తులకు మంచి ధరలు కల్పించడంతోపాటు పంటరుణాలు ఇప్పించాలని, పాత రుణాలు మాఫీ చేయాలని ఉద్యమం చేస్తున్న రైతులపై కాల్పులు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఐదుగురు చనిపోయారు. దీంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తలు నెలకొని ఆంక్షలు ఉన్నాయి. అక్కడికి ఎవరినీ అనుమతించడం లేదు. మంగళవారం అక్కడి వెళుతున్న హార్దిక్‌ను అరెస్టు చేస్తున్న సందర్భంలో ఈ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నేనేం ఉగ్రవాదిని కాదు.. నేనేం లాహోర్ నుంచి ఇక్కడికి రాలేదు. నేను భారతీయుడ్ని. నాకు ఈ దేశంలో ఎక్కడైనా తిరిగే హక్కు ఉంది’ అంటూ ఆయన పోలీసులతో వాగ్వాదానికి దిగారు. -
హార్దిక్ పటేల్ అరెస్టు
న్యూఢిల్లీ: పటేల్ ఉద్యమకారుడు హార్దిక్ పటేల్ అరెస్టయ్యాడు. మంగళవారం ఉదయం మధ్యప్రదేశ్‌లోని నీముచ్ జిల్లాలో అతడిని పోలీసులు అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలించారు. మధ్యప్రదేశ్‌లో రైతులపై కాల్పులు చోటుచేసుకున్న మాంద్సౌర్ ప్రాంతానికి హార్దిక్ వెళుతుండగా పోలీసులు అరెస్టు చేశారు. తమ వ్యవసాయ ఉత్పత్తులకు మంచి ధరలు కల్పించడంతోపాటు పంటరుణాలు ఇప్పించాలని, పాత రుణాలు మాఫీ చేయాలని ఉద్యమం చేస్తున్న రైతులపై కాల్పులు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఐదుగురు చనిపోయారు. దీంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తలు నెలకొని ఆంక్షలు ఉన్నాయి. అక్కడికి ఎవరినీ అనుమతించడం లేదు. దీంతో ఆ రైతులకు సానుభూతిగా గుజరాత్లో పటేళ్ల తరుపున ఉద్యమం చేసిన హార్దిక్ పటేల్ వెళుతుండగా అతడిని అరెస్టు చేశారు. హార్దిక్ తన అరెస్టు విషయంలో ముందే మాట్లాడుతూ తన పని తాను చేసుకుపోతానని, పోలీసులు వారి పని వారు చేసుకుంటారని చెప్పారు. -
పోలీసుల అదుపులో మేథాపాట్కర్
మంద్సౌర్: మధ్యప్రదేశ్‌లోని మంద్సౌర్ మృతుల కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్తున్న సామాజిక కార్యకర్తలు మేథాపాట్కర్, స్వామి అగ్నివేశ్, స్వరాజ్ ఇండియా చీఫ్ యోగేంద్ర యాదవ్ తదితరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గిట్టుబాటు ధరలు కల్పించాలని, రుణ మాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేసిన రైతులపై పోలీసులు కాల్పులు జరపడంతో ఐదుగురు రైతులు మృతిచెందారు. మృతుల కుటుంబాలను కలిసేందుకు వస్తుండగా మంద్సౌర్ బయట ధోల్‌దార్ టోల్‌ప్లాజా వద్ద పోలీసులు వీరిని అడ్డుకున్నారు. శనివారం కర్ఫ్యూ ఎత్తివేసినందున ఇపుడిపుడే పరిస్థితులు కుదుటపడుతున్నాయని, ఇపుడు వీరి పర్యటన వల్ల శాంతికి విఘాతం కలిగే ప్రమాదముందని పోలీసులు పేర్కొన్నారు. నిషేధాజ్ఞలు ఉన్నందున అక్కడికి వెళ్లడానికి వీల్లేదని వీరిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో మాహౌ-నీముచ్ జాతీయ రహదారిపై వారు బైఠాయించారు. వీరితో పాటు మరో 30మందిని పోలీసులు బలవంతంగా అక్కడి నుంచి తరలించారు. -
‘మంద్సౌర్’ దిశానిర్దేశం
మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లలో ప్రారంభమై యావద్దేశానికి మార్గనిర్దేశం చేసిన రైతుల ఆందోళన స్థానికపరమైన సీజనల్ సమస్య కాదు. పంట నష్టం లేదా ప్రకృతి వైపరీత్యాలతో కూడిన ఒత్తిడి ఫలితమూ కాదు. ఈ నిరసన భారత వ్యవసాయ సంక్షోభంతో నేరుగా ముడిపడి ఉంది. మధ్యప్రదేశ్‌లోని మంద్‌సౌర్‌లో నిరసన తెలుపుతున్న రైతులపై పోలీసులు కాల్పులు జరిపిన ఘటన రైతాంగ ఉద్యమ చరిత్రలో నూతన దశకు ఆజ్యం పోసింది. జూన్ 6న జరిగిన పోలీసు కాల్పుల్లో కనీసం అయిదుమంది రైతులు చనిపోయారని ఇప్పుడు స్పష్టమవుతోంది. రైతుల ఆందోళన అంత త్వరగా సమసిపోదని కూడా స్పష్టమవుతోంది. అన్ని ఉద్యమాల్లోలాగే మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ జిల్లాలోని ఒక గ్రామంలో ఇది ప్రారంభమైంది. జూన్ 1 నుంచి తాము పండిస్తున్న ఉత్పత్తుల్ని–ఆహార ధాన్యాలు, కూరగాయలు– నగరాలకు పంపకుండా నిలిపివేయాలని ఆ ప్రాంత రైతులు నిర్ణయించారు. ఇది వెంటనే మహారాష్ట్రలోని పలు జిల్లాలకు విస్తరించింది. దాని ఫలితంగా జూన్ 1, 2 తేదీల్లో ఏపీఎమ్‌సీ (వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ సహకార సంస్థ) శాఖల్లో చాలావాటికి వ్యవసాయ ఉత్పత్తులు చేరలేదు. ప్రారంభంలో ఈ అంశాన్ని తేలిగ్గా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం దీంతో చర్చలకు సిద్ధం కావలసి వచ్చింది. ఆ ఆందోళన ఇప్పుడు మధ్యప్రదేశ్‌కు వ్యాపించింది. ఆ రాష్ట్ర సీఎం కూడా రైతు అనుకూల సంస్థలతో ఒప్పందం గురించి ప్రకటించారు. కానీ ఇది అమ్ముడుపోవడమే అంటూ ఈ ఒప్పందాన్ని చాలా రైతు సంఘాలు తిరస్కరిం చాయి. మహారాష్ట్రలో రాష్ట్ర వ్యాప్త బంద్ విజయవంతం కావడంతో ఇతర రాష్ట్రాల్లోని రైతు సంఘాలు కూడా శక్తి పుంజుకున్నాయి. ప్రస్తుత రైతాంగ ఆందోళన ఎంత అసాధారణమైనదంటే, ప్రకృతి వైపరీత్యాలు, పంటల నష్టం జరిగిన సంవత్సరంలో ఇది చోటుచేసుకోలేదు. 2014–15, 2015–16 సంవత్సరాల్లో వరుస కరువులు ఎదుర్కొన్న తర్వాత గత వ్యవసాయ సీజన్లో మహారాష్ట్రలో సాధారణ వర్షపాతం దన్నుతో పంటలు బాగా పండాయి. సాధారణంగా రైతు ఆందోళనలు పంట నష్టాలతో ఉధృతమవుతుంటాయి. ఈ సంవత్సరం మహా రాష్ట్ర రైతులు అధిక స్థాయిలో కాకున్నప్పటికీ సాధారణ స్థాయిలో పంట లను పండించారు. చాలా సంవత్సరాలుగా మధ్యప్రదేశ్ రాష్ట్రం అత్యధిక వ్యవసాయ ఉత్పాదకతకు గాను అవార్డు అందుకుంటోంది కూడా. మరి రైతాంగ ఉద్యమాలు ఉన్నట్లుండి ఇలా పెచ్చరిల్లడానికి కార ణం ఏమిటి? ప్రస్తుత ఆందోళనను రెండు పరిణామాలు రెచ్చగొట్టినట్లు కనబడుతోంది. ఒకవైపు, పంటలు బాగానే పండటంతో రైతులు పండిం చిన పంటలకు ధరలు బాగా పడిపోయాయి. రెండోది, ఉత్తరప్రదేశ్‌లో కొత్తగా ఏర్పడిన బీజేపీ ప్రభుత్వం రైతుల రుణాలపై మాఫీని ప్రకటించిన ఘటన ఇతర రాష్ట్రాల్లోని రైతులు చిరకాలంగా చేస్తూవస్తున్న డిమాండ్లను మళ్లీ వారి దృష్టికి తీసుకువచ్చింది. ప్రధానంగా కాయధాన్యాల విషయంలో ధరలు కుప్పగూలిపోయాయి. దేశంలో కాయధాన్యాల కొరత ఏర్పడటంతో కేంద్రప్రభుత్వం క్వింటాల్ కంది పప్పు కనీస మద్దతు ధరను రూ. 4,500ల నుంచి రూ. 5,000ల వరకు పెంచింది. రైతులు కూడా ఎంతో సంతోషించారు. కాయధాన్యాల సాగు, ఉత్పత్తి బాగా పుంజుకుంది. కానీ ప్రభుత్వం తన వాగ్దానాన్ని నిలుపుకోవడంలో విఫలమైంది. ప్రకటించిన ధర వద్ద ఉత్పత్తిని సేకరించడంలో రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు విఫలమయ్యాయి. క్వింటాల్‌కు రూ. 5 వేలు పొందడానికి బదులుగా రైతులు తమ పంటను రూ.3 వేలకే అమ్ముకోవలసివచ్చింది. మధ్యప్రదేశ్‌లో సోయా బీన్ పండించిన రైతులు, తెలంగాణలో మిర్చి రైతులు కూడా ఇదే విషాదాన్ని ఎదుర్కొన్నారు. ఇక దేశంలోని వివిధ ప్రాంతాల్లో టమోటా రైతులు తమ పంటను అత్యంత హీన స్థాయి ధరకు అమ్ముకోవడం కంటే రోడ్డుపై విసిరిపారేయడానికి నిర్ణయించుకుంటున్నట్లు వార్తలొస్తున్నాయి. అందుచేత పంట విఫలమైనప్పుడు మాత్రమే కాకుండా రుతుపవనాలు ఆశాజనకంగా ఉండి, పంటలు బాగా పండిన కాలంలో కూడా రైతులు కష్టాలను ఎదుర్కొంటున్నారని తేలుతోంది. ప్రస్తుత రైతాంగ ఆందోళనలకు ఇదే చోదక శక్తి. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లలో రైతుల ఆందోళనకు వెనుక వాస్తవ ప్రాతిపదిక ఇదే. అది స్థానికమైనదీ, సీజనల్ సమస్య కాదు. పంట సంబంధమైన లేదా ప్రకృతి వైపరీత్యాలతో కూడిన ఒత్తిడి పర్యవసానం కాదు. ఈ నిరసన భారత వ్యవసాయ సంక్షోభంతో నేరుగా ముడిపడి ఉంది. నేటి భారత వ్యవసాయ సంక్షోభం మూడు రూపాల్లో ఉంది. మొదటిది భారత వ్యవసాయంలో పర్యావరణ సంక్షోభం. హరిత విప్లవంతో కూడిన ఆధునిక వ్యవసాయ విధానాలు జనం భరించదగినవి కావు. వనరులు, ఎరువులు, పురుగుమందులు, నీరు వంటివాటిని భారీగా వినియోగించడంతో కూడిన ఈ తరహా వ్యవసాయం ఇప్పుడు దాని అంతిమ దశకు చేరుకుంది. రెండు, భారత వ్యవసాయంలో ఆర్థిక సంక్షోభం. మన వ్యవసాయ ఉత్పాదకత దేశ అవసరాలకు, భూమి, వనరుల లభ్యతకు అనుగుణంగా లేదు. దీంతో ముడిపడిన మూడో అంశం రైతు ఉనికి సంక్షోభం. వ్యవసాయం రైతును బతికించే స్థాయిలో లేదు. రైతుల ఆత్మహత్యలు ఈ సంక్షోభంతోనే ముడిపడి ఉన్నాయి. ప్రస్తుత రైతుల ఆందోళనలో గుర్తించవలసిన అంశమేదంటే ఈ మౌలిక సమస్యను పరిష్కరించడంపై అది దృష్టి పెట్టడమే. తక్షణ, స్థానికపరమైన ఉపశమనం కోసం రైతులు డిమాండ్ చేయడం లేదు. రైతుల పంటలకు కనీస మద్దతు ధరను ప్రకటిస్తామని ఎన్నికల్లో పాలకపార్టీ చేసిన వాగ్దానాన్ని వీరు గుర్తు చేస్తున్నారు. రైతులందరి రుణాల మాఫీని చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. దేశీయ రైతాంగ ఉద్యమాలు దీర్ఘకాలం నుంచి చేస్తూ వస్తున్న డిమాండ్లు ఇవి. కానీ ఏ రాజకీయ పార్టీ కూడా వీటి పరిష్కారానికి సంసిద్ధత చూపలేదు. ప్రస్తుతం పఢణవిస్ ప్రభుత్వం పాక్షికమైన, షరతులతో కూడిన రుణమాఫీ చేయడానికి అంగీకరించింది. కాని ఇది రైతులకు సంతృప్తి కలిగించేలా లేదు. కనీస మద్దతు ధరతోనే పంట దిగుబడులను సేకరిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు కానీ దీనికి ప్రాతిపదిక ఏది అనే అంశంపై స్పష్టత ఇవ్వలేదు. ఇక శివరాజ్ చౌహాన్ చేస్తున్న ప్రకటనలు కూడా దీనికి భిన్నంగా లేవు. పైగా ఈ రెండు రాష్ట్రాల్లోని బీజేపీ సీఎంలు కేంద్రం నుంచి మద్దతు పొందుతున్నట్లు లేదు. ఈ స్థితిలో దేశంలోని మిగతా ప్రాంతాలపై మంద్సౌర్ రైతాంగ ఉద్యమం చూపే ప్రభావం ఏమిటన్నది చెప్పటం కష్టం. ప్రస్తుత ఆందోళన ఎంతకాలం కొనసాగుతుందో కూడా మనకు తెలీదు. కాని రైతుల వాస్తవ సమస్యలు పరిష్కారం కావటం లేదని మాత్రమే మనకు తెలుసు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రైతులు మార్గదర్శనం చేశారు. ఇప్పుడు దేశంలోని మిగతా ప్రాంతాల్లోని రైతులు దాన్ని చేపట్టి ఈ పోరాటానికి తార్కిక ముగింపు ఇవ్వాల్సి ఉంది. రైతుల రాజకీయాల్లో కొత్త దశ కోసం మనం సిద్ధంగా ఉన్నాం. - యోగేంద్ర యాదవ్ వ్యాసకర్త స్వరాజ్ అభియాన్, జైకిసాన్ సంస్థల్లో సభ్యుడు మొబైల్ : 98688 88986 ‘Twitter : @_YogendraYadav -
సీఎం సంచలన నిర్ణయం
భోపాల్: రైతుల ఆందోళన నేపథ్యంలో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రేపటి నుంచి నిరవధిక నిరాహారదీక్షకు దిగుతానని ఆయన ప్రకటించారు. రాష్ట్రంలో శాంతి నెలకొనేవరకు తన దీక్ష కొనసాగుతుందని తెలిపారు. భోపాల్‌లోని దసరా మైదానంలో దీక్ష చేపట్టనున్నట్టు వెల్లడించారు. తమ డిమాండ్ల గురించి తనతో చర్చించాలని ప్రజలను ఆహ్వానించారు. ‘ప్రతి ఒక్కరు వచ్చి వారి సమస్యల గురించి నాతో చర్చించాలని కోరుతున్నాను. నేను నిరాహారదీక్ష చేపడతాను. అక్కడి నుంచే పాలన కొనసాగిస్తాన’ని చౌహాన్ చెప్పారు. మంద్‌సౌర్‌లో ఆందోళన చేస్తున్న రైతులపై పోలీసులు కాల్పులు జరపడంతో ఐదుగురు మృతి చెందడంతో రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ ఘటనపై ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు గట్టిగా నిలదీస్తున్నాయి. నష్టనివారణ చర్యల్లో భాగంగా సీఎం చౌహాన్ స్వయంగా రంగంలోకి దిగారు. రైతులకు అన్నివిధాలా మేలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. అయినా రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతుండడంతో శాంతి కోసం నిరాహారదీక్షకు దిగుతున్నట్టు ప్రకటించారు. -
రాహుల్‌పై హోంమంత్రి ఘాటు విమర్శలు
మాంద్సౌర్: ‘ఒక హెల్మెట్ కూడా ధరించకుండా కాలేజీ విద్యార్థిలాగా రాహుల్‌గాంధీ బైక్ డ్రైవింగ్ చేసుకుంటూ ఒక జాతీయ పార్టీ నేత వెళ్లడం తగదు’ అని మధ్యప్రదేశ్ హోమంత్రి భూపేంద్ర సింగ్ రాహుల్ గాంధీపై తీవ్ర విమర్శలు చేశారు. మధ్యప్రదేశ్‌లోని మాంద్సౌర్లో పోలీసుల కాల్పుల్లో చనిపోయి, గాయాలపాలయిన వారి కుటుంబాలను పరామర్శించేందుకు గురువారం కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మద్దతుదారులతో కలిసి వచ్చారు. అయితే, మాంద్‌సౌర్‌కు కిలోమీటర్ దూరం ఉండగానే ఆయనను అడ్డుకునేందుకు పోలీసులు రకరకాల ప్రయత్నాలు చేశారు. తొలుత కారులో వచ్చిన ఆయన బారీకేడ్స్‌ను దాటేసి ముందుకెళ్లే యత్నం చేశారు. అడ్డుకోవడంతో వెంటనే ఒక బైక్ తీసుకున్నారు. అక్కడ ఆపేయడంతో దిగి వెంటనే మరో బైక్ తీసుకున్న ఆయన మరింత వేగంగా ముందుకు కదిలారు. మళ్లీ అడ్డుకోవడంతో చివరకు కాలినడకన చేరేందుకు ప్రయత్నం చేయగా చివరకు పోలీసులు అదుపులోకి తీసుకొని తొలుత గెస్ట్‌హౌస్‌కి అటు నుంచి పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఈ నేపథ్యంలో బైక్ తీసుకుని వెళ్లే సమయంలో రాహుల్ హెల్మెట్ కూడా లేకుండా కాలేజీ కుర్రాడిలా వెళ్లారని, జాతీయ నేతకు అది సరికాదంటూ రాష్ట్ర హోంమంత్రి విమర్శలు చేశారు. దీంతో కాంగ్రెస్‌పార్టీ నేత సచిన్ పైలట్ మాట్లాడుతూ తాము రైతులకు సానుభూతిగా వెళ్లామని, అందరూ శాంతియుతంగా ఉండాలని, సామరస్యం పూర్వకంగా సమస్యను పరిష్కరించుకోవాలని చెప్పేందుకు వెళ్లామని, పోలీసులు మాత్రం చాలా అతి చేశారని మండిపడ్డారు. బాధిత కుటుంబాల వాళ్లు తమను కలిసేందుకు ప్రయత్నం చేస్తున్నా వారు అనుమతించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
రైతుల కడుపెందుకు మండింది?
న్యూఢిల్లీ: మొన్న తమిళనాడు, నిన్న మహారాష్ట్ర, నేడు మధ్యప్రదేశ్, రేపు రాజస్థాన్... రాష్ట్రాల రైతులు ఎందుకు రగిలిపోతున్నారు? ఆరుగాలం కష్టపడి పండించిన వ్యవసాయ ఉత్పత్తులను రోడ్లపై పారబోసి ఎందుకు నిరసన వ్యక్తం చేస్తున్నారు? వారి నిన్నటి ఆర్తనాదాలకు, వారి నేటి రణన్నినాదాలకు రాజకీయ రంగులు లేవు. వ్యవసాయ రంగం పట్ల తరతరాలుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు (పార్టీలతో సంబంధం లేకుండా) ప్రదర్శిస్తున్న నిర్లక్ష్య వైఖరే కారణమని వ్యవసాయ రంగంలో తలపండిన నిపుణులు ఎన్నో ఏళ్లుగా చెబుతూనే ఉన్నారు. సరైన వ్యవసాయ విధానం ఎలా ఉండాలో సూచిస్తూనే ఉన్నారు. వాటిని పాలకులు పట్టించుకోకపోవడం వల్లనే నేడు రైతుకు కడుపులో కాలింది. పాలు, కూరగాయలనే ఎందుకు పారబోస్తున్నారు? మహారాష్ట్రలోగానీ, మధ్యప్రదేశ్‌లోగానీ గోధుమలు, బియ్యం మినహాయించి పాలు, కూరగాయలను రైతులు నిరసనగా నేలపాలు చేయడం గమనార్హం. గోధుమలు, బియ్యానికి అంతో ఇంతో మద్దతు ధర ఉండడం, అవసరమైన సందర్భాల్లో ప్రభుత్వాలే జోక్యం చేసుకొని వాటిని కొనుగోలు చేయడమే కాకుండా వాటిని ఎక్కువ కాలం నిల్వ ఉంచుకునే అవకాశం ఉండడం, కూరగాయలకు, పప్పు దినుసలకు సరైన కనీస మద్దతు ధర లేకపోవడం, ఉన్నా ప్రభుత్వమే వాటిని నేరుగా కొనుగోలు చేయకపోవడం కూడా కారణం. కేంద్ర కనీస మద్దతు ధర జాబితాలో పేరుకు 25 రకాల వ్యవసాయోత్పత్తులు ఉన్నాయి. వాటిని ప్రభుత్వాలే నేరుగా కొనుగోలు చేయక పోవడం వల్ల రైతులు దలారుల దందాకు దగాపడుతున్నారు. బహిరంగ మార్కెట్లో రైతులు టమోటాలను యాభై పైసలకు కిలో చొప్పున అమ్మలేక వాటిని రోడ్లపై పారబోసిన సందర్భాలను మనం అనేక సార్లు చూశాం. ఆహార భద్రత ఏమయింది? ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు 2013లో అప్పటి కేంద్ర ప్రభుత్వం ‘జాతీయ ఆహార భద్రతా చట్టాన్ని’ తీసుకొచ్చింది. అయితే ఆ చట్టాన్ని ఇప్పటికీ అమలు చేయడం లేదు. వచ్చే ఏడాది నుంచి అమలు చేస్తామని నరేంద్ర మోదీ ప్రభుత్వం చెబుతోంది. నేడు మన రైతులు పప్పు, దినుసుల ఉత్పత్తికి ప్రాధాన్యత ఇవ్వక పోవడం వల్ల మన దేశం విదేశాల నుంచి వీటిని దిగుమతి చేసుకుంటోంది. ఎందుకు రైతులకు నష్టాలు ? భారత దేశంలో 58 శాతం మంది వ్యవసాయరంగంపై ఆధారపడి బతుకుతున్నప్పుడు వారికి ఎందుకు నష్టాలు, ఎందుకీ కష్టాలు? వ్యవసాయానికి ఖర్చు పెరగడం, ఉత్పత్తులకు ధరలు తగ్గడమని టూకీగా చెప్పవచ్చు. ఒక్క 2010 సంవత్సరం నుంచే పరిశీలిస్తే ఈ ఏడేళ్ల కాలంలో వ్యవసాయం ఖర్చు ఎంతో పెరిగింది. కేంద్రం మిశ్రమ ఎరువులకు సంబంధించి కొత్త విధానాన్ని తీసుకరావడంతో ముందుగా వాటి ధరలు పెరిగాయి. తర్వాత వాటి ప్రభావం యూరియాపై పడి దాని ధర కూడా పెరుగుతూ వచ్చింది. ఇక 2013 నుంచి ఎరువులతో పాటు విత్తనాలు, డీజిల్, కూలీల వేతనాలు పెరిగాయి. 4.6 శాతం వద్ధి రేటంట! 2016–17 సంవత్సరానికి వ్యవసాయ రంగంలో వద్ధిరేటు 4.9 శాతం సాధించామంటూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఘనంగా చెప్పుకుంది. వ్యవసాయోత్పత్తుల ఆధారంగా ప్రభుత్వాలు వద్ధి రేటను అంచనా వేస్తాయన్న విషయం ఎవరికైనా తెల్సిందే. ఆ ఉత్పత్తుల కోసం రైతులు ఎంత ఖర్చు పెట్టారు, వారికి ఎంత లాభం వచ్చిందన్న అంశాన్ని అసలు పరిగణలోకి తీసుకోరు. వారు నిజంగా లాభాలు గడించి ఉంటే దేశవ్యాప్తంగా వేలాది మంది రైతులు ఆత్మహత్యలు చేసుకోరు. కనీస మద్దతు ధరల్లో వైఫల్యం వ్యవసాయోత్పత్తులకు కనీస మద్దతు ధరను కచ్చితంగా అమలు చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫలమవుతున్నాయి. కనీస మద్దతు ధరను మార్కెట్ వర్గాలు కొనుగోలు చేయనప్పుడు ప్రభుత్వాలే రంగంలోకి దిగి కనీస మద్దతు ధరకు వాటిని కొనుగోలు చేయాలి. కానీ ప్రభుత్వాలు గోధమ, బియ్యాన్ని మాత్రమే కొనుగోలు చేసి వాటిని రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేస్తోంది. ఈ కనీస మద్దతు ధర వల్ల దేశంలో కేవలం 6 శాతం మంది రైతులు మాత్రమే లబ్ధి పొందుతున్నారని కేంద్ర ప్రభుత్వం లెక్కలే చెబుతున్నాయి. మరి మిగతా 94 శాతం మంది రైతుల సంగతి ఏమిటీ? వ్యవసాయోత్పత్తుల ఖర్చు 60 శాతం వ్యవసాయోత్పత్తులకు ఎంత ఖర్చవుతుందో స్థూలంగా చెప్పాలంటే 60 శాతం ఖర్చే ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు తగ్గుతున్నప్పటికీ రైతులకు ఆ లబ్ధి చేకూరడం లేదు. అదేమి చిత్రమోగానీ చమురు ఆధారిత ఎరువుల ధరలు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. 2014, 2015 సంవత్సరాల్లో దేశంలో ఏర్పడిన కరవు పరిస్థితులు కూడా రైతులకు కష్టాలు తెచ్చాయి. క్యాష్ పంటలను పండిస్తున్న రైతులు కూడా నష్టపోతున్నారు. మార్కెట్ వర్గాలు సిండికేట్ అవడం, కొంత మంది ప్రభుత్వాధికారులు వారిచ్చే లంచాలకు అలవాటు పడడం అందుకు కారణం. మరి రైతును ఆదుకునేదిలా? దేశవ్యాప్తంగా ఏయే ప్రాంతాల్లో ఏయే పంటలు, ఎంత విస్తీర్ణంలో పండించాలో తెలిపే ఓ సమగ్ర ప్రణాళికతో వ్యవసాయ క్యాలెండర్ రూపొందించాలి. అన్ని వ్యవసాయ పంటలకు కనీస మద్దతు ధర కల్పించాలి. అందుకోసం అవసరమైతే ప్రభుత్వాలే నేరుగా జోక్యం చేసుకొని వాటిని కొనుగోలు చేసి రేషన్ షాపుల ద్వారా వినియోగదారులకు విక్రయించాలి. రైతుల అందుబాటులోకి చాలినన్ని మార్కెట్లు, శీతల గిడ్డంగులను తీసుకరావాలి. 2013 నాటి జాతీయ ఆహార భద్రతా చట్టాన్ని కచ్చితంగా అమలు చేయాలి. రైతుల రుణాలను మాఫీ చేయడం మంచి విధానం కానప్పటికీ నేడు వ్యవసాయ రంగం కుదేలై ఉన్న సందర్భంలో అది కోలుకునే వరకు రుణాలను మాఫీ చేసి రైతుల ప్రాణాలను నిలబెట్టాలి. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సకాలంలో స్పందించి రుణాలను మాఫీ చేయడంతో అక్కడి రైతులు రోడ్డున పడలేదు. -
‘మరో ఫొటో కోసమే ఆ ఆరాటమంతా’
న్యూఢిల్లీ/మాందసౌర్: కాంగ్రెస్ పార్టీ మధ్యప్రదేశ్‌లోని రైతులు చేస్తున్న ఆందోళనలు మరింత రెచ్చగొడుతోందని, రాజకీయం చేస్తోందని కేంద్రమంత్రి, బీజేపీ సీనియర్ నేత వెంకయ్యనాయుడు అన్నారు. ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ చేస్తున్న హడావుడి అంతా కూడా ప్రచార తాపత్రయం, నలుగురికి కనిపించాలనే ఆర్భాటమేనని, మరో ఫొటోకోసమే ఆయన ఆవేశం అని విమర్శించారు. కొద్ది రోజులుగా ఆందోళన జరుగుతున్న మాందసౌర్ ప్రాంతంలో ఒక్కసారిగా ఆందోళనలు తీవ్ర స్థాయిగా మారి ఈ ఘటనలో 5గురు రైతులు ప్రాణాలుకోల్పోయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పరిస్థితులు మరింత చేజారాయి. దీంతో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తన పదవిలో నుంచి దిగిపోవాలని కాంగ్రెస్ డిమాండ్ చేసిన నేపథ్యంలో గురువారం మీడియాతో మాట్లాడిన వెంకయ్యనాయుడు తీవ్రంగా ఖండించారు. గతంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో చోటుచేసుకున్న ఓ సంఘటనను గుర్తు చేశారు. 1998 జనవరి 12న బీతుల్ జిల్లాలో నాడు ముఖ్యమంత్రిగా ఉన్న కాంగ్రెస్ పార్టీ నేత దిగ్విజయ్ సింగ్ హయాంలో పోలీసుల కాల్పుల్లో 24మంది రైతులు చనిపోయారనే విషయం గుర్తు చేశారు. ఆనాడు వారు దిగ్విజయ్ రాజీనామా కోరారా? అని ప్రశ్నించారు. నాడు కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు బాధితుల కుటుంబాలను పరామర్శించారా అని నిలదీశారు. కాంగ్రెస్ పార్టీ ఇకనైనా బాధ్యతగల ఓ రాజకీయ పార్టీగా నడుచుకొని ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను మరింత రెచ్చగొట్టకుండా, రాజకీయం చేయకుండా ఉండాలని హితవు పలికారు. -
ఔను.. తొలిసారి అంగీకరించిన హోంమంత్రి!
భోపాల్: పోలీసుల కాల్పుల్లో ఐదుగురు రైతులు చనిపోయిన ఘటనపై ఇన్నిరోజులు బుకాయిస్తూ వచ్చిన మధ్యప్రదేశ్ హోంమంత్రి భూపేంద్రసింగ్ ఎట్టకేలకు తొలిసారి నిజం అంగీకరించారు! పోలీసుల కాల్పుల వల్లే మంద్‌సౌర్‌లో ఐదుగురు రైతులు చనిపోయారంటూ తొలిసారి ఆయన మీడియా ముఖంగా అంగీకరించారు. ‘పోలీసుల కాల్పుల వల్ల ఐదుగురు రైతులు చనిపోయారు. దర్యాప్తులో ఈ విషయం వెల్లడైంది. నేను గతంలో కూడా ఇదే చెప్పాను. కొన్ని మీడియా చానెళ్లలో వచ్చింది కూడా’ అని ఆయన చెప్పుకొచ్చారు. పోలీసుల కాల్పుల వల్లే రైతులు చనిపోయారన్న వాదనను గతంలో భూపేంద్రసింగ్ తిరస్కరించారు. రైతుల ఆందోళనలోకి సంఘవిద్రోహ శక్తులు ప్రవేశించి.. ప్రజలు లక్ష్యంగా కాల్పులు జరిపారని, ఈ కాల్పుల్లోనే రైతులు చనిపోయారని ఆయన చెప్పుకొచ్చారు. మంద్‌సౌర్‌లో రైతులను పరామర్శించడానికి రాహుల్‌గాంధీ రావడాన్ని ఆయన తప్పుబట్టారు. ఆందోళన చేస్తున్న రైతుల డిమాండ్లన్నింటినీ ప్రభుత్వం అంగీకరించిందని, ఇంకా రాహుల్ ఇక్కడికి రావాల్సిన అవసరం ఏముందని ఆయన ప్రశ్నించారు.