భోపాల్: వరదలతో అందరూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతుంటే ఓ మహిళ మాత్రం చేతిలో ఫోన్ పట్టుకుని సెల్ఫీ దిగటానికి ప్రయత్నించింది. అయితే సరదా కోసం ఆమె చేసిన ప్రయత్నం విషాదాన్ని మిగిల్చింది. తల్లి సెల్ఫీ పిచ్చి ఆమెతోపాటు కూతురి ప్రాణాలు కూడా తీసింది. ఈ విచార ఘటన మధ్యప్రదేశ్‌లోని మంద్‌సౌర్‌లో జరిగింది. వివరాల్లోకి వెళితే.. ఓ ఫిజిక్స్ ప్రొఫెసర్, తన భార్యాకూతురితో కలిసి బుధవారం వారి ఇంటికి కొద్ది దూరంలోని వరద కాలువ దగ్గరికి వెళ్లారు. అక్కడ తల్లీకూతురు సెల్ఫీ దిగడానికి ప్రయత్నించారు. ఈ సమయంలో వారు నిలుచున్న కల్వర్టు కూలిపోవడంతో వారిద్దరూ ఆ ప్రవాహంలో పడి కొట్టుకుపోయారు. స్థానికులు వారిని కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఇక మధ్యప్రదేశ్‌లోని ప్రధాన నదులన్నీ ఉధృతంగా ప్రవహించటంతో పలు ప్రాంతాలు జలదిగ్భందంలో చిక్కుకున్నాయి. భారీ వర్షాల కారణంగా పలువురు మృతి చెందగా, మూడు వేల మంది నిరాశ్రయులయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment