బాధితురాలి కుటుంబ సభ్యులతో బీజేపీ ఎంపీ సుధీర్ గుప్తా
భోపాల్ : ఎన్ని కఠిన చట్టాలు వచ్చిన మృగాళ్ల అకృత్యాలను మాత్రం అడ్డుకోలేక పోతున్నాయి. కొన్ని రోజుల క్రితమే ఒక ప్రముఖ అంతర్జాతీయ సంస్థ భారత్ మహిళలకు చాలా ప్రమాదకరమైన దేశంగా గుర్తించింది. ఒక వైపు ఈ విషయం గురించి ఆందోళనలు జరుగుతుంటే...మరో వైపు మృగాళ్లు మాత్రం వీటిని ఏ మాత్రం లెక్క చేయకుండా తమ అకృత్యాలను కొనసాగిస్తూనే ఉన్నారు. రెండు రోజుల క్రితమే మధ్యప్రదేశ్, మాందసౌర్‌లోని ఓ ఎనిమేదళ్ల చిన్నారిని ఇర్ఫాన్(20) అనే వ్యక్తి అపహరించి అత్యంత దారుణంగా అత్యచారానికి పాల్పడిన సంగతి తెలిసిందే.
ఇలాంటి దారుణాలను అరికట్టలేని నాయకులు, జరాగాల్సిన నష్టం జరిగాక, తీరిగ్గా పరామార్శల పేరుతో వచ్చి బాధితులను మరింత ఇబ్బంది పెడుతుంటారు. ఇలాంటి సంఘటనే ఒకటి ఇండోర్‌లో జరిగింది. మాందసౌర్‌లో గ్యాంగ్‌రేప్‌కు గురై, తీవ్ర గాయలతో బాధపడుతున్న బాలికను మధ్యప్రదేశ్, ఇండోర్‌లోని ఒక ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు. అయితే సదరు బాలికను సందర్శించడానికి బీజేపీ మంత్రి సుధీర్ గుప్తా ఆస్పత్రికి వచ్చారు. ఆయన రాకకు మురిసిపోయిన ఆ పార్టీ నాయకులు కొందరు మంత్రి గారేదో మహా ఘనకార్యం చేసినట్లు భావించారు.
ఆ ఆనందంలో సుదర్శన్ గుప్తా అనే ఓ బీజేపీ నాయకుడు ‘మీ అమ్మాయిని కలవడానికే మంత్రిగారు ఇంత దూరం వచ్చారు. వెళ్లండి, వెళ్లి ఆయనకు ధన్యవాదాలు తెలపండి’ అంటూ బాధితురాలి కుటుంబ సభ్యులకు చెప్పాడు. దాంతో బాలిక తల్లిదండ్రులు మంత్రి గారి దగ్గరకు వెళ్లి చేతులు కట్టుకుని నిల్చుని ధన్యవాదాలు తెలిపారు. ఈ మొత్తం తతంగాన్నంతా ఎవరో వీడియో తీసారు. ఈ వీడియో కాస్తా లీక్ అవడంతో వీడియోలోని బీజేపీ నాయకున్ని తీవ్రంగా వియర్శిస్తున్నారు నెటిజన్లు. ఇదిలా ఉండగా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మాందసార్ ఘటనపై స్పందిస్తూ నిందుతులను ఉరి తీయాలని చెప్పడం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment