సీఎం సంచలన నిర్ణయం | Amid Farmer Protests In Madhya Pradesh, Chief Minister Shivraj Singh Chouhan To Fast | Sakshi
Sakshi News home page

సీఎం సంచలన నిర్ణయం

Published Fri, Jun 9 2017 8:21 PM | Last Updated on Mon, Oct 8 2018 3:17 PM

సీఎం సంచలన నిర్ణయం - Sakshi

సీఎం సంచలన నిర్ణయం

భోపాల్‌: రైతుల ఆందోళన నేపథ్యంలో మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రేపటి నుంచి నిరవధిక నిరాహారదీక్షకు దిగుతానని ఆయన ప్రకటించారు. రాష్ట్రంలో శాంతి నెలకొనేవరకు తన దీక్ష కొనసాగుతుందని తెలిపారు. భోపాల్‌లోని దసరా మైదానంలో దీక్ష చేపట్టనున్నట్టు వెల్లడించారు. తమ డిమాండ్ల గురించి తనతో చర్చించాలని ప్రజలను ఆహ్వానించారు. ‘ప్రతి ఒక్కరు వచ్చి వారి సమస్యల గురించి నాతో చర్చించాలని కోరుతున్నాను. నేను నిరాహారదీక్ష చేపడతాను. అక్కడి నుంచే పాలన కొనసాగిస్తాన’ని చౌహాన్‌ చెప్పారు.

మంద్‌సౌర్‌లో ఆందోళన చేస్తున్న రైతులపై పోలీసులు కాల్పులు జరపడంతో ఐదుగురు మృతి చెందడంతో రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ ఘటనపై ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు గట్టిగా నిలదీస్తున్నాయి. నష్టనివారణ చర్యల్లో భాగంగా సీఎం చౌహాన్‌ స్వయంగా రంగంలోకి దిగారు. రైతులకు అన్నివిధాలా మేలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. అయినా రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతుండడంతో శాంతి కోసం నిరాహారదీక్షకు దిగుతున్నట్టు ప్రకటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement