జిల్లా కలెక్టర్, ఎస్పీపై బదిలీ వేటు
మంద్‌సౌర్: మంద్‌సౌర్ కాల్పుల ఘటన నేపథ్యంలో ఆ జిల్లా కలెక్టర్‌పై బదిలీ వేటు పడింది. మధ్యప్రదేశ్‌లోని మంద్‌సౌర్ జిల్లాలో మంగళవారం రైతులు నిర్వహించిన ఆందోళన హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే.. పిపాల్యా మండీ పోలీస్ పరిధిలోని పార్శ్వనాథ్ ప్రాంతంలో పోలీసులకు, నిరసనకారులకు మధ్య జరిగిన ఘర్షణలో ఐదుగురు రైతులు మృతి చెందారు. పోలీసులు జరిపిన కాల్పుల వల్లే రైతులు చనిపోయారని ఆరోపణలు వెల్లువెత్తడంతో ప్రభుత్వం... మంద్‌సౌర్ జిల్లా
కలెక్టర్ స్వతంత్ర కుమార్ సింగ్, ఎస్పీ సహా మరో ఉన్నతాధికారిని బదిలీ చేస్తూ మధ్యప్రదేశ్ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త జిల్లా కలెక్టర్‌గా ఓం ప్రకాశ్ శ్రీవాత్సవను నియమించింది. మరోవైపు ఐఏసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మంద్‌సౌర్‌లో నేడు పర్యటించనున్నారు. కాల్పుల్లో మృతి చెందిన రైతుల కుటుంబాలను ఆయన పరామర్శించనున్నారు.