భోపాల్ : మంద్‌సౌర్ అత్యాచార ఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. మంద్‌సౌర్, ఇండోర్, దార్ ప్రాంతాల్లో ధర్నా నిర్వహించిన నిరసన కారులు నిందితును వెంటనే ఉరి తీయాలి డిమాండ్ చేశారు. మధ్యప్రదేశ్‌లోని మంద్‌సౌర్‌లో ఇటీవల ఎనిమిదేళ్ల బాలికను ఇద్దరు వ్యక్తులు అపహరించి కిరాతంగా హత్యచారం చేసిన విషయం తెలిసిందే. బాలికను శనివారం పరామర్శించిన రాష్ట్ర మహిళ, శిశు సంక్షేమశాఖ మంత్రి అర్చన చిట్నిస్ బాధిత కుటుంబానికి ఐదు లక్షల ఆర్థిక సహాయం చేస్తున్నట్లు ప్రకటించారు. మంత్రి ప్రకటనపై బాలిక తండ్రి మండిపడ్డారు. తమకు ఏలాంటి ఆర్థిక సహాయం అవసరం లేదని, తన బిడ్డకు అన్యాయం చేసిన దుర్మర్గులను వెంటనే ఉరితీయాలని డిమాండ్ చేశారు.
ఈ ఘటనపై ప్రతిపక్ష కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపిస్తోంది. బాలికను మెరుగైన వైద్యంకోసం ఢిల్లీ తరలించాలని, నిందితులను శిక్షించాలని డిమాండ్ చేసింది. ఘటన జరిగిన మరునాడే ఇద్దరు నిందితులను ఆసీఫ్(24), ఇర్ఫాన్(20)లను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. దీనిపై ఇర్ఫాన్ తల్లి తన కుమారుడికి అండగా నిలిచారు. తన కుమారుడు అమాయకుడని, తను ఏలాంటి తప్పు చేసి ఉండడని ఆమె తెలిపారు. సీబీఐతో విచారణకు సిద్ధమని, విచారణలో తన కుమారుడు తప్పు చేసినట్లు రుజవైతే ఎలాంటి శిక్షకైన సిద్ధంగా ఉన్నామని ఆమె పేర్కొన్నారు. నిందితులు చిన్నపిల్లల్ని ఎత్తుకుని పోయే ముఠాతో సంబందాలు ఉన్నాయని, వారిపై అనుమానంతోనే అరెస్ట్ చేసినట్లు స్టేషన్ ఎస్‌ఐ జితేందర్ సింగ్ యాదవ్ తెలిపారు.
I trust he is innocent. A CBI inquiry should be conducted in the case. If he is found guilty he should be severely punished: Mother of the second accused in rape of an eight-year-old in Mandsaur. #MadhyaPradesh pic.twitter.com/t1nyO3GCDM
— ANI (@ANI) July 1, 2018
Comments
Please login to add a commentAdd a comment