Hanging Punishment
-
లైవ్‌స్ట్రీమ్‌లో భార్య దారుణ హత్య.. భర్తకు ఉరి!
బీజింగ్: ఆన్లైన్ పోర్టలోలో ప్రత్యక్ష ప్రసారం వీక్షిస్తున్న మాజీ భార్యను హతమార్చిన వ్యక్తికి ఉరిశిక్ష అమలు చేశారు. చైనాలో ఈ ఘటన జరిగింది. సిచువాన్ ప్రావిన్స్‌లో నివసించే టాంగ్ లూ తన భార్య లామూను వేధించేవాడు. దీంతో 2020లో విడాకులు తీసుకుంది. మళ్లీ పెళ్లాడాలని వేధించాడు. 2020 సెప్టెంబర్‌లో ఆమె ఇంటికొచ్చాడు. అప్పటికే ఆమె టిక్‌టాక్ లాంటి ఆన్లైన్ పోర్టల్ డౌయిన్‌లో లైవ్ కార్యక్రమాలు చూస్తోంది. తనను పట్టించుకోవడం లేదని ఆగ్రహించి, ఆమెపై పెట్రోల్ పోసి, నిప్పటించాడు. తీవ్రంగా గాయపడిన లామూ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కొన్ని వారాల తర్వాత మరణించింది. ఈ సంఘటన చైనాలో తీవ్ర సంచలనం సృష్టించింది. నేరం రుజువు కావడంతో న్యాయస్థానం 2021 అక్టోబర్‌లో అతడికి మరణ శిక్ష విధించింది. ఇటీవలే అధికారులు ఉరిశిక్ష అమలు చేశారు. ఇదీ చదవండి: మృత్యువులోనూ వీడని స్నేహం -
9 హత్యల కేసు; కోర్టుకు నిందితుడు
వరంగల్ లీగల్ : వరంగల్ రూరల్ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంటలో తొమ్మిది మందిని సజీవంగా బావిలో వేసి హత్య చేసిన కేసులో నిందితుడు సంజయ్‌కుమార్‌యాదవ్‌ను ఆరు రోజుల పోలీసు కస్టడీ ముగిసింది. ఈ మేరకు గీసుకొండ పోలీసులు గురువారం ఆయనను వరంగల్‌లోని కోర్టులో హాజరుపర్చగా కోర్టు అదేశాలతో వరంగల్ సెంట్రల్ జైలుకు తరలించారు. తొమ్మిది హత్యల కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వరంగల్ కమిషనరేట్ పోలీసులు అతి తక్కువ సమయంలో నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చారు. (9 హత్యల కేసు: వాటిని అమ్మిందెవరు?) 14 రోజుల జ్యూడిషియల్ రిమాండ్‌కు కోర్టు ఆదేశించిన నేపథ్యంలో కేసు పూర్వాపరాలు, నిందితుని నుండి అదనపు సమాచారం కోసం ఆయనను కస్టడీలోకి తీసుకున్నారు. ఈ కస్టడీలో భాగంగా ఆరు రోజుల పాటు సీన్ రీకన్‌స్ట్రక్టషన్ తరహాలో ఘటనా స్థలం, నిందితుడు అద్దెకు ఉన్న ఇళ్లు తదితర ప్రాంతాల్లో పరిశోధన జరిపిన పోలీసులు సంజయ్‌ను గురువారం కోర్టులో హాజరుపరిచారు. కాగా, నిందితుడిపై నమోదైన కేసులో పొందుపర్చిన వివిధ సెక్షన్ల క్రింద నేరం రుజువైతే రెండేళ్ల కఠిన కారాగారశిక్ష మొదలు యావజ్జీవ కారాగార శిక్ష.. చివరకు ఉరిశిక్ష సైతం పడే అవకాశం ఉందని సీనియర్ న్యాయవాదులు వ్యాఖ్యానిస్తున్నారు. నిందితుడి వయస్సు తక్కువే అయినందున శిక్షా కాలంలో ప్రవర్తన మార్పు తదితర అంశాలు పరిగణలోకి తీసుకున్నప్పటికీ యావజ్జీవ కారాగార శిక్ష తప్పకుండా పడే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. (సంజయ్‌కుమార్‌పై సీన్ రీ కన్స్ట్రక్షన్) -
'నిర్భయకేసు దోషులకు త్వరలో మరణశిక్ష'
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపి, మహిళల రక్షణకు కొత్త చట్టాలు చేసేలా పాలకులను కదిలించిన నిర్భయ కేసులో దోషులకు వచ్చే నెలలో ఉరి శిక్ష అమలు కానుంది. ఇప్పటి వరకూ వారు పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్లు ఏవీ ఆమోదానికి నోచుకోలేదు. నిర్భయ కేసులో మరణశిక్ష పడి, ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్న వినయ్‌శర్మ రాష్ట్రపతి క్షమాభిక్ష కోసం పిటిషన్ దాఖలు చేశారు. రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ దోషి క్షమాభిక్ష పిటిషన్‌ను తిరస్కరించిన వెంటనే కోర్టు దోషులను ఉరి తీయాలని బ్లాక్ వారెంట్ జారీ చేసే అవకాశముంది. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని తీహార్ జైలులో ఉరి తీసే తలారీ లేకపోవడంపై జైలు అధికారులు తలలుపట్టుకుంటున్నారు. ఉరి తీసే తలారీ ఉద్యోగాన్ని భర్తీ చేయడం కానీ.. తాత్కాలికంగా ఎక్కడైనా పని చేస్తున్న వారిని తీహార్ జైలుకు బదిలీ చేసి.. శిక్షను అమలు పరచలా అని అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. నిర్భయ కేసులో శర్మ, ముకేశ్, పవన్, అక్షయ్, రామ్ సింగ్, ఓ మైనర్ బాలుడు నిందితులు కాగా, మైనర్ బాలుడు విడుదలయ్యాడు. రామ్ సింగ్ జైల్లోనే ఉరేసుకుని చనిపోయిన సంగతి తెలిసిందే. మిగిలిన నలుగురినీ ఉరితీయాల్సి ఉంది. ఇటీవల శర్మ మెర్సీ పిటిషన్ పెట్టుకోగా, దాన్ని తిరస్కరించాలని ఢిల్లీ సర్కారు సిఫార్సు చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ కు జాతీయ మహిళా కమిషన్ లేఖ రాసింది. నిర్భయ ఘటనలో దోషులకు క్షమాభిక్ష పెట్టవద్దని లేఖ లో విజ్ఞప్తి చేశారు. రాష్ట్రపతి క్షమాభిక్షను తిరస్కరిస్తే నిర్భయ కేసులో దోషులైన వినయ్ శర్మతోపాటు ముకేష్, పవన్, అక్షయ్ లకు మరణశిక్షను అమలు చేయనున్నారు. ఢిల్లీలో 2012 డిసెంబరు 16వ తేదీన కదులుతున్న బస్సులో ఒక పారా మెడికల్ విద్యార్థినిపై ఆరుగురు వ్యక్తులు పాశవికంగా సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఆమెను బస్సు నుంచి రోడ్డు పక్కన పడేశారు. తరువాత ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె అదే సంవత్సరం డిసెంబర్ 20న కన్నుమూసింది. ఈ కేసులో బాధితురాలి వివరాలను గోప్యంగా ఉంచడం కోసం ఆమె పేరును నిర్భయగా నిర్ణయించారు. అంతే కాకుండా ఆ పేరుపై మహిళల సంరక్షణ కోసం ఒక ప్రత్యేక చట్టాన్ని ప్రభుత్వం తెచ్చింది. -
గలీజు గాళ్లను ఊళ్లోనే..
నారాయణపేట/ మక్తల్: మహిళలు, ఆడపిల్లలపై జరుగుతున్న అఘాయిత్యాలను అరికట్టేందుకు నిర్భయ, ఫోక్సో చట్టాలు వచ్చినప్పటికీ వాటి అమలులో జాప్యం జరుగుతుందంటూ ప్రజా, విద్యార్థి సంఘాలు, మహిళలు, విద్యార్థులు, జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఔటర్ రింగ్‌రోడ్డు ప్రధాన హైవే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గరలో హైవే పెట్రోలింగ్ తిరిగే ప్రాంతంలో ప్రియాంకను నలుగురు మృగాళ్లు ఇంత దారుణంగా హతమార్చడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. ప్రియాంక హత్య ఘటనలో ప్రజల తీర్పుతో నిందితులను శిక్షిస్తూ వారి ఊళ్లోనే జనం కళ్లముందు ఉరితీయాలని, కాల్చేయాలని, ఎన్కౌంటర్ చేయాలంటూ డిమాండ్ చేశారు. రహదారిపై రాస్తారోకో ప్రియాంకరెడ్డిని హత్య చేసిన నిందితులను కఠి నంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ శనివారం ప్రధాన నిందితుడైన మహ్మద్ పాషా అలియాస్ ఆరిఫ్ స్వగ్రామమైన మక్తల్ మండలం జక్లేర్‌లో ప్రధాన రహదారిపై, మరికల్, మక్తల్ పట్టణా ల్లో ప్రజా, విద్యార్థి సంఘాలు, మహిళల ఆధ్వర్యంలో రాస్తారోకో చేపట్టారు. ఈ హత్యకు పా ల్పడిన ఆ నలుగురు పెద్దగా ఏమీ చదువుకోలేదని, లారీ డ్రైవర్‌గా, క్లీనర్‌గా పనిచేస్తూ జు లాయిగా తిరుగుతూ ఇలాంటి దారుణానికి పా ల్పడిన వారిని వదలొద్దంటూ నినదించారు. ఎ వరైతే తప్పు చేస్తారో ఆ శిక్షను సొంత గ్రామస్తుల కళ్లముందు పడేలా చేస్తే భయం పుట్టుకొస్తుందని పలువురు డిమాండ్ చేశారు. గ్రామాలకు చెడ్డపేరు జులాయిగాళ్లు చేసిన పాడుపనులకు గ్రామాలకు చెడ్డపేరు రావడంతో జీర్ణించుకోలేకపోతున్నామని గుడిగండ్ల, జక్లేర్ గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరైనా పిల్లను ఇవ్వాలన్నా.. పిల్లను తీసుకుపోవాలన్నా ఆ ఊరా అనే మచ్చపడిందని వాపోయారు. చట్టాలను గ్రామాల్లో అమలు చేయడంతో మహ్మద్‌పాషా చేసిన పనికి పడే శిక్షపడుతుందని భయం జనంలో ఉంటుందన్నారు. గలీజు గాళ్లయ్యారు.. మహ్మద్‌పాషా మోటార్ ఫీల్డ్‌కు వెళ్లిన తర్వాతనే గలీజు పనులకు అలవాటుపడ్డాడంటూ గ్రామస్తులు ఆరోపించారు. అప్పుడప్పుడు గ్రామంలో సైతం మద్యం మత్తులో చెడుగా ప్రవర్తించేవాడన్నారు. పక్కనే ఉన్న గుడిగండ్లకు చెందిన నవీన్‌కుమార్, శివ, చెన్నకేశవులతో దోస్తాన్ చేశాడని, నలుగురు మోటార్ ఫీల్డ్కి వెళ్లడం, కలిసి తిరగడం, ఏది చేసినా కలిసి చేయడం అలవాటుగా మార్చుకున్నారన్నారు. -
ఉరి రద్దు.. తుది శ్వాస వరకూ జైలు
సాక్షి, హైదరాబాద్: వరంగల్ జిల్లా హన్మకొండలో తొమ్మిది నెలల బాలికపై అత్యాచారం, ఆపై హత్య చేసిన ముద్దాయికి కింది కోర్టు విధించిన ఉరి శిక్షను యావజ్జీవ శిక్షగా తగ్గిస్తూ హైకోర్టు తీర్పు చెప్పింది. ముద్దాయి ప్రాణం ఉన్నంత వరకూ జైలు శిక్ష అనుభవించాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ ఎ.అభిషేక్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం తీర్పు చెప్పింది. 9 నెలల చిన్నారిపై అత్యాచారం చేసిన ముద్దాయి పాలేపాక ప్రవీణ్ అలియాస్ పవన్‌కు కింది కోర్టు ఉరి శిక్ష విధించింది. ఈ తీర్పును ఖరారు చేయాలని కింది కోర్టు హైకోర్టును కోరింది. దీంతోపాటు ముద్దాయి ప్రవీణ్ కూడా హైకోర్టులో క్రిమినల్ అప్పీల్ దాఖలు చేశాడు. వీటిని విచారించిన ధర్మాసనం క్రిమినల్ అప్పీల్‌ను పాక్షికంగా అనుమతిస్తూ 39 పేజీల తీర్పును ఈ నెల 12న వెలువరించింది. పిల్లల సంరక్షణ ప్రత్యేక కోర్టు విధించిన ఉరి శిక్షను యావజ్జీవ శిక్షగా తగ్గించింది. తీర్పు సారాంశం ఇదీ.. ఉరి అమల్లో ఉన్న అమెరికాతోపాటు ఉరి అమల్లో లేని పలు దేశాల్లోని నేరాల శాతానికి తేడా పెద్దగా లేదని, ఉరి శిక్ష అమలు చేయడం ద్వారా భయాన్ని కలిగించి నేరాలు తగ్గించాలనే ప్రయత్నాలు సరికా దని హైకోర్టు అభిప్రాయపడింది. ‘రాజ్యాంగంలోని 21వ అధికరణం ప్రకారం వ్యక్తిగత స్వేచ్ఛను పరిమితం చేయడంకంటే జీవితాన్ని లేకుండా చేయడం సబబుకాదు. ఉరి శిక్ష విధానంపై భిన్నాభిప్రాయాలున్నాయి. దీనిపై సుప్రీంకోర్టు కూడా స్పష్టమైన మార్గదర్శకాలిచ్చింది. ఉరికి మినహా యింపు ఉందని, యావజ్జీవ శిక్షలు విధించవచ్చునని తెలిపింది. చాలా అరుదైన కేసుల్లో మాత్రమే ఉరి శిక్ష విధించాలని బచ్చన్సింగ్ కేసులో చాలా స్పష్టంగా చెప్పింది. హన్మకొండ ఘటనలో 9 నెలల చిన్నారి అత్యాచారం, హత్యకు గురికావడం తీవ్ర ఆందోళన కలిగించే అంశమే. అయితే అందుకు బాధ్యుడైన నిందితుడు సమాజంలో బతికి ఉంటే ప్రమాదం తీవ్రంగా ఉంటుందని చెప్పడానికి లేదు. ముద్దాయి గత చరిత్ర చూస్తే గొలుసు దొంగతనాలు చేసిన నేర చరిత్ర మాత్రమే ఉంది. పాతికేళ్ల యువకుడు, అట్టడుగు వర్గాలవాడు. చోరీ కేసు మాత్రమే అతనిపై ఉంది. పథకం ప్రకారం బాలికను హత్య చేసే కుట్రతో వచ్చినట్లుగా ఆధారాలు లేవు. అత్యంత అరుదైన కేసుల్లో మాత్రమే ఉరి శిక్ష విధించాలి. ప్రవీణ్‌లో మార్పు లేదని, పశ్చాత్తాపం లేదని కింది కోర్టు తీర్పులో పేర్కొనడాన్ని ఆమోదించలేకపోతున్నాం. అందుకే కింది కోర్టు విధించిన ఉరి శిక్షను, తుదిశ్వాస విడిచే వరకూ జైలు జీవితాన్నే కొనసాగేలా తీర్పు చెబుతున్నాం’అని ధర్మాసనం తీర్పులో పేర్కొంది. క్రిమినల్ అప్పీల్ పాక్షికంగా ఆమోదం సీసీ కెమెరాల ఫుటేజీ సేకరించిన వేళల్లో తేడాలు ఉన్నాయి. ఇతర వివరాలు కూడా తేడాలుగా నమోదు చేశారు. ఎఫ్ఎస్ఎల్ రిపోర్టులో వీర్యం అవశేషాలు ఉన్నట్లుంది. అయితే వేరే చోట ఈ విషయం అస్పష్టంగా ఉంది. ఎఫ్ఎస్ఎల్ నివేదిక విషయంలోనూ ప్రాసిక్యూషన్ వైఫల్యం చెందింది. డీఎన్ఏ రిపోర్టు ఆధారంగా తీర్పు చెప్పడానికి వీల్లేదు. నేరస్తుడి పరిస్థితి, నేరం జరిగినప్పటి పరిస్థితుల ఆధారంగా శిక్ష విధించాలనే మార్గదర్శకాలకు విరుద్ధంగా కింది కోర్టు తీర్పు చెప్పింది.. అని క్రిమినల్ అప్పీల్ వాదనలను హైకోర్టు పాక్షికంగా ఆమోదించింది. అప్పుడు ఏం జరిగిందంటే.. ఈ ఏడాది జూన్ 17న కె.జంగయ్య, అతని భార్య రచన తమ 9 నెలల బిడ్డను తీసుకుని కుమారపల్లి లోని అత్తవారింటికి వెళ్లారు. భార్య, బిడ్డను వదిలి జంగయ్య ఆ తర్వాత రోజు హైదరాబాద్ వచ్చేశాడు. ఆరోజు రాత్రి రచన తన బిడ్డతోపాటు, ఆమె తండ్రి, సోదరులతో కలిసి నిద్రిస్తున్న సమయంలో రాత్రి 1.30 గంటలకు ప్రవీణ్ బిడ్డను ఎత్తుకుపోయాడు. నిద్ర మేల్కొన్న రచన, కుటుం బసభ్యులు బిడ్డ కనబడకపోయేసరికి చుట్టుపక్కల వెతకడం ప్రారంభించారు. ఒక వ్యక్తి (ప్రవీణ్) ఒడిలో బిడ్డ ఉండటం చూశానని భరత్‌కుమార్ చెప్పాడు. ఆ తర్వాత ప్రవీణ్‌ను పట్టుకునేందుకు ప్రయత్నించినప్పుడు బిడ్డ కింద పడిపోయింది. తల్లిదండ్రులు బిడ్డను ఆస్పత్రికి తీసుకువెళితే చని పోయినట్లుగా వైద్యులు నిర్ధారించారు. ఈ కేసులో ప్రత్యేక సెషన్స్ కోర్టు ఈ ఏడాది ఆగస్టు 8వ తేదీన ముద్దాయికి ఉరి శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. -
మనోహరన్‌కు రెండు ఉరి, యావజ్జీవ శిక్షలు
సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడును కుదిపేసిన చిన్నారిపై హత్యాచారం, చిన్నారి తమ్ముడి దారుణ హత్య కేసులో సుప్రీంకోర్టు గురువారం సంచలనాత్మకమైన తీర్పు చెప్పింది. నిందితుడు మనోహరన్‌కు మద్రాసు హైకోర్టు విధించిన రెండు ఉరిశిక్షలు, రెండు యావజ్జీవశిక్షలను ఖరారు చేస్తూ తీర్పు చెప్పింది. వివరాలు.కోయంబత్తూరు రంగేగౌడర్వీధికి చెందిన రంజిత్ వస్త్రవ్యాపారి. ఇతని ముస్కరన్ (10) అనే కుమార్తె, రితిక్ (7) అనే కుమారుడు ఉన్నారు. వీరిద్దరూ ఐదు, మూడవ తరగతి చదువుతున్నారు. 2010 అక్టోబర్ 29న అద్దెవ్యానులో వ్యాన్‌డ్రైవర్ మోహన్‌రాజ్ అలియాస్ మోహనకృష్ణన్ తన స్నేహితులైన మనోహరన్ సహకారంతో కిడ్నాప్‌చేసి పొల్లాచ్చి కొండప్రాంతానికి తీసుకెళ్లారు. చిన్నారి ముస్కరన్పై మోహన్‌రాజ్ అత్యాచారం చేశాడు. ఆ తరువాత స్నేహితులిద్దరూ కలిసి ఆ ఇద్దరు చిన్నారులను అక్కడి బీఏబీ వాగులోకి తోసివేసి హత్యచేశారు. ఈ జంట హత్యకేసులపై కోవై పోలీసులు కేసు నమోదు చేసి మోహన్‌రాజ్, మనోహరన్లను అరెస్ట్ చేశారు. కేసు విచారణలో భాగంగా నిందితులిద్దరినీ అదే ఏడాది నవంబర్ 9న వ్యాన్‌లో తీసుకెళుతుండగా పెత్తనూరు సమీపంలో ఒక పోలీసుల చేతుల్లోని తుపాకీలను లాక్కుని పోలీసులపై కాల్పులు జరిపి పారిపోయేందుకు ప్రయత్నించారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఎదురుకాల్పులు జరపగా మోహన్‌రాజ్ హతమయ్యాడు. మనోహరన్ జరిపిన తుపాకీ కాల్పుల్లో ఎస్ఐలు ముత్తుమాలై, జ్యోతి తీవ్రంగా గాయపడ్డారు. ఈ కేసులో మనోహరన్‌కు రెండు ఉరిశిక్షలు విధిస్తూ కోవై మహిళాకోర్టు 2012 అక్టోబరు 28న తీర్పు చెప్పింది. ఈ తీర్పును మద్రాసు హైకోర్టు 2014 మార్చి 24న నిర్ధారించింది. ఈ తీర్పుపై మనోహరన్ తరఫు న్యాయవాది సుప్రీంకోర్టులో అప్పీలు చేయగా ఉరిశిక్షపై అదే ఏడాది స్టే ఇచ్చింది. ఈ స్టేపై తమిళనాడు పోలీసులు సుప్రీంకోర్టులో అప్పీలు చేశారు. ఈ అప్పీలు పిటిషన్‌పై విచారణలు పూర్తిచేసిన సుప్రీంకోర్టు తీర్పు చెప్పకుండా గత నెల 11న వాయిదావేసింది. ఇదిలా ఉండగా, ఈ కేసు గురువారం మరలా విచారణకు రాగా నిందితుడు మనోహరన్‌కు మద్రాసు హైకోర్టు విధించిన రెండు ఉరిశిక్షలు, మూడు యావజ్జీవ శిక్షలను ఖరారు చేస్తూ తీర్పు చెప్పింది. నిందితుడు తనకు పడిన ఉరిశిక్షపై రాష్ట్రపతికి కారుణ్య విజ్ఞప్తి లేఖను సమర్పించుకోవచ్చు. ఆ వినతిని రాష్ట్రపతి నిరాకరించిన పక్షంలో ఉరిశిక్ష అమల్లోకి వస్తుంది. -
సీఐఏ గూఢచారికి ఇరాన్ ఉరిశిక్ష
టెహ్రాన్: అమెరికాకు ఇరాన్ రహస్య సమాచారాన్ని చేరవేస్తున్న జలాల్ హాజీ జవెర్ అనే రక్షణశాఖ కాంట్రాక్టర్‌ను ఉరితీసినట్లు ఇరాన్ సైన్యం తెలిపింది. అమెరికా నిఘా సంస్థ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ(సీఐఏ) కోసం ఇతను పనిచేసేవాడని వెల్లడించింది. పక్కా సాక్ష్యాధారాలతో జలాల్‌ను పట్టుకున్నామనీ, అతని ఇంట్లో ఇరాన్ రక్షణశాఖకు సంబంధించి కీలక పత్రాలు, నిఘాపరికరాలను స్వాధీనం చేసుకున్నామని పేర్కొంది. జలాల్‌ను ఇరాన్ మిలటరీ కోర్టు దోషిగా తేల్చి ందనీ, ఆయనకు కరాజ్ నగరంలోని రాజయ్ షాహ్ర్ జైలులో మరణశిక్షను అమలుచేశామని చెప్పింది. జలాల్‌తో కలిసి గూఢచర్యానికి పాల్పడ్డ నేరానికి ఆయన మాజీ భార్యకు 15 ఏళ్ల జైలుశిక్ష పడిందన్నారు. అమెరికా–ఇరాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో తాజా ఘటన ఎటుదారితీస్తుందో అని ప్రపంచదేశాల్లో ఆందోళన నెలకొంది. -
‘వారిని ఉరి తీయండి’
భోపాల్ : మంద్సౌర్ అత్యాచార ఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. మంద్సౌర్, ఇండోర్, దార్ ప్రాంతాల్లో ధర్నా నిర్వహించిన నిరసన కారులు నిందితును వెంటనే ఉరి తీయాలి డిమాండ్ చేశారు. మధ్యప్రదేశ్‌లోని మంద్‌సౌర్‌లో ఇటీవల ఎనిమిదేళ్ల బాలికను ఇద్దరు వ్యక్తులు అపహరించి కిరాతంగా హత్యచారం చేసిన విషయం తెలిసిందే. బాలికను శనివారం పరామర్శించిన రాష్ట్ర మహిళ, శిశు సంక్షేమశాఖ మంత్రి అర్చన చిట్నిస్ బాధిత కుటుంబానికి ఐదు లక్షల ఆర్థిక సహాయం చేస్తున్నట్లు ప్రకటించారు. మంత్రి ప్రకటనపై బాలిక తండ్రి మండిపడ్డారు. తమకు ఏలాంటి ఆర్థిక సహాయం అవసరం లేదని, తన బిడ్డకు అన్యాయం చేసిన దుర్మర్గులను వెంటనే ఉరితీయాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై ప్రతిపక్ష కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపిస్తోంది. బాలికను మెరుగైన వైద్యంకోసం ఢిల్లీ తరలించాలని, నిందితులను శిక్షించాలని డిమాండ్ చేసింది. ఘటన జరిగిన మరునాడే ఇద్దరు నిందితులను ఆసీఫ్(24), ఇర్ఫాన్(20)లను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. దీనిపై ఇర్ఫాన్ తల్లి తన కుమారుడికి అండగా నిలిచారు. తన కుమారుడు అమాయకుడని, తను ఏలాంటి తప్పు చేసి ఉండడని ఆమె తెలిపారు. సీబీఐతో విచారణకు సిద్ధమని, విచారణలో తన కుమారుడు తప్పు చేసినట్లు రుజవైతే ఎలాంటి శిక్షకైన సిద్ధంగా ఉన్నామని ఆమె పేర్కొన్నారు. నిందితులు చిన్నపిల్లల్ని ఎత్తుకుని పోయే ముఠాతో సంబందాలు ఉన్నాయని, వారిపై అనుమానంతోనే అరెస్ట్ చేసినట్లు స్టేషన్ ఎస్ఐ జితేందర్ సింగ్ యాదవ్ తెలిపారు. I trust he is innocent. A CBI inquiry should be conducted in the case. If he is found guilty he should be severely punished: Mother of the second accused in rape of an eight-year-old in Mandsaur. #MadhyaPradesh pic.twitter.com/t1nyO3GCDM — ANI (@ANI) July 1, 2018 -
యావజ్జీవంగా దర్మపురి కేసు
* ఉరి రద్దు! * ముగ్గురు నిందితులకు శిక్ష తగ్గింపు * విద్యార్థినుల కుటుంబాల ఆవేదన సాక్షి, చెన్నై : ధర్మపురిలో బస్సు దగ్ధం, ముగ్గురు విద్యార్థినుల సజీవ దహనం కేసులో ముగ్గురికి విధించిన ఉరి శిక్ష రద్దు అయింది. యావజ్జీవంగా శిక్షను మారుస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడంతో ఆ విద్యార్థినుల కుటుంబాలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. అవినీతి కేసులో అన్నాడీఎం కే అధినేత్రి జె జయలలితకు 2000 సంవత్సరంలో ఏడాది జైలు శిక్ష పడ్డ విషయం తెలిసిందే. ఈ తీర్పుతో అన్నాడీఎంకే వర్గాల్లో ఆక్రోశం రగిలింది. రాష్ట్ర వ్యాప్తంగా నిరసన జ్వాల బయలు దేరాయి. ఈ సమయంలో ధర్మపురి సమీపంలో అన్నాడీఎంకే వర్గాల వీరంగం రాష్ట్రాన్నే కుదిపి వేసింది. తమ అమ్మకు జైలు శిక్ష పడ్డ వీరావేశంతో అన్నాడీఎంకే వర్గాలు కోయంబత్తూరుకు చెందిన వ్యవసాయ కళాశాల బస్సుకు నిప్పు పెట్టారు. ఎంతో ఆనందంగా విహార యాత్రను ముగించుకుని తిరుగు పయనంలో ఉన్న విద్యార్థినుల్ని మంటలు చుట్టుముట్టడంతో బయట పడేందుకు తీవ్రంగా శ్రమించారు. కొందరు గాయాలతో బయట పడగా, కోకిల వాణి, గాయత్రి, హేమలత సజీవ దహనమయ్యారు. ఈ ఘటనతో రాష్ట్రంలో పెను కలకలం బయలు దేరింది. ఈకేసులో ముఫ్పై మంది వరకు అరెస్టు అయ్యారు. వీరిలో అన్నాడీఎంకేకు చెందిన ధర్మపురి నాయకులు నెడుంజెలియ న్, రవీంద్రన్, మునియప్పన్లకు ఉరి శిక్ష విధిస్తూ సేలం కోర్టు 2007లో తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును మద్రాసు హైకోర్టు ధ్రువీకరించింది. తదుపరి సుప్రీం కోర్టు సైతం తీర్పును ధ్రువీకరించడంతో సేలం కేంద్ర కారాగారంలో శిక్షను ఈ ముగ్గురు అనుభవిస్తున్నారు. తమకు క్షమాభిక్ష పెట్టాలని రాష్ర్టపతికి చేసుకున్న వి న్నపం పెండింగ్‌లో ఉంది. ఈ పరిస్థితుల్లో రాజీవ్ హ త్య కేసు నిందితుల ఉరి శిక్ష యావజ్జీవంగా మారడం తో ఈ ముగ్గురు మళ్లీ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఉరి రద్దు..యావజ్జీవం: తమకు విధించిన ఉరి శిక్ష తీర్పును పునస్సమీక్షించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను సుప్రీంకోర్టు న్యాయమూర్తులు రంజన్ గోగయ్, అరుణ్ మిశ్రలతో కూడిన బెంచ్ విచారిస్తూ వస్తున్నది. విచారణ గత వారం రోజులుగా వేగం పెరిగింది. పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాది నాగేశ్వరరావు హాజరై వాదనల్ని విన్పించారు. ఈ ముగ్గురు పథకం ప్రకారం బస్సుకు నిప్పు పెట్టి, ముగ్గురు విద్యార్థినుల మృతి కారణం కాలేదని, ఆవేశంతో జరిగిన తప్పు మాత్రమేనంటూ వాదనల్ని విన్పించారు. అలాగే, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో నిందితులకు విధించిన ఉరి శిక్ష యావజ్జీవంగా మారి ఉన్న విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. వాదనల అనంతరం ఆవేశ పూరితంగా చేసిన ఘటన కావడంతో ఉరిశిక్షను రద్దు చేస్తున్నట్టు బెంచ్ ప్రకటించింది. ఉరి శిక్షను యావజ్జీవంగా మారుస్తూ తీర్పు వెలువడడంతో కోకిల వాణి, గాయత్రి, హేమలత కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ బిడ్డల మృతికి కారణమైన వాళ్లను ఇప్పటికే ఉరి తీసి ఉండాలని, అప్పుడే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయని ఆందోళన వ్యక్తం చేశారు.