టెహ్రాన్: అమెరికాకు ఇరాన్ రహస్య సమాచారాన్ని చేరవేస్తున్న జలాల్ హాజీ జవెర్ అనే రక్షణశాఖ కాంట్రాక్టర్‌ను ఉరితీసినట్లు ఇరాన్ సైన్యం తెలిపింది. అమెరికా నిఘా సంస్థ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ(సీఐఏ) కోసం ఇతను పనిచేసేవాడని వెల్లడించింది. పక్కా సాక్ష్యాధారాలతో జలాల్‌ను పట్టుకున్నామనీ, అతని ఇంట్లో ఇరాన్ రక్షణశాఖకు సంబంధించి కీలక పత్రాలు, నిఘాపరికరాలను స్వాధీనం చేసుకున్నామని పేర్కొంది. జలాల్‌ను ఇరాన్ మిలటరీ కోర్టు దోషిగా తేల్చి ందనీ, ఆయనకు కరాజ్ నగరంలోని రాజయ్ షాహ్ర్ జైలులో మరణశిక్షను అమలుచేశామని చెప్పింది. జలాల్‌తో కలిసి గూఢచర్యానికి పాల్పడ్డ నేరానికి ఆయన మాజీ భార్యకు 15 ఏళ్ల జైలుశిక్ష పడిందన్నారు. అమెరికా–ఇరాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో తాజా ఘటన ఎటుదారితీస్తుందో అని ప్రపంచదేశాల్లో ఆందోళన నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment