
భోపాల్ : మధ్యప్రదేశ్‌లోని మంద్‌సౌర్‌లో ఇటీవల ఎనిమిదేళ్ల బాలికను అపహరించి ఇద్దరు వ్యక్తులు అత్యంత కిరాతంగా అత్యాచారం చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఘటన జరిగిన మరునాడే ఇద్దరు నిందితులను ఆసీఫ్(24), ఇర్ఫాన్(20)లను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే నిందితుల ఆరోగ్య పరిస్థితికి సంబంధించి పోలీసులు చెప్పిన వివరాలు బాధిత బాలిక తల్లిదండ్రులను మరింత ఆందోళనకు గురి చేస్తున్నాయి. అత్యాచారానికి పాల్పడ్డ నిందితులకు ప్రాణాంతక ఎయిడ్స్ వ్యాధి ఉన్నట్లుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వారికి హెచ్‌ఐవీ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. కూతురి ఆరోగ్యం క్రమంగా మెరుగవుతోందని వైద్యులు చెప్పడంతో ఊపిరి పీల్చుకుంటున్న బాధితురాలి తల్లిదండ్రులు పిడుగులాంటి ఈ వార్తతో తమ కూతురి భవిష్యత్తు ఏమవుతుందోనని ఆందోళన చెందుతున్నారు.
కాగా నిందితుడు ఇర్ఫాన్ తల్లి తన కుమారుడికి అండగా నిలిచారు. తన కుమారుడు అమాయకుడని, తను ఎలాంటి తప్పు చేసి ఉండడని ఆమె తెలిపారు. సీబీఐతో విచారణకు సిద్ధమని, విచారణలో తన కుమారుడు తప్పు చేసినట్లు రుజవైతే ఎలాంటి శిక్షకైన సిద్ధంగా ఉన్నామని ఆమె పేర్కొన్నారు. అయితే నిందితుడు ఇర్ఫాన్ మూడు రోజుల పాటు రిమాండ్‌లో ఉంచనున్నట్లు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment