SpiceJet offers domestic tickets for RS 1122 as part of its winter sale- Sakshi
Sakshi News home page

విమాన ప్రయాణికులకు స్పైస్ జెట్ బంపర్ ఆఫర్..!

Published Tue, Dec 28 2021 2:56 PM | Last Updated on Tue, Dec 28 2021 3:48 PM

SpiceJet offers domestic tickets for RS 1122 as part of its winter sale - Sakshi

ప్రముఖ విమానయాన సంస్థ స్పైస్ జెట్ తాజాగా ప్రయాణికులకు మంచి అదిరిపోయే ఆఫర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. స్పైస్ జెట్ "వావ్ వింటర్ సేల్" పేరుతో ఒక ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది. ఈ ఆఫర్ కింద డిసెంబర్ 27 నుంచి 31 మధ్య కాలంలో రూ.1,122 ప్రారంభ ధరతో టికెట్లు బుక్ చేసుకోవచ్చు. 

"వావ్ వింటర్ సేల్' ఆఫర్‌ కింద చెన్నై-బెంగళూరు, బెంగళూరు-చెన్నై, చెన్నై-హైదరాబాద్, జమ్మూ-శ్రీనగర్ మధ్య ప్రయాణం చేసే ప్రయాణికులకు మాత్రమే రూ.1,122 (అన్నీ కలుపుకొని) ధరకు వన్ వే ఛార్జీలను అందిస్తున్నట్లు స్పైస్ జెట్ తన పోర్టల్ ప్రకటనలో తెలిపింది. ఈ ఆఫర్ కింద విమాన టికెట్లను బుక్ చేసే ప్రయాణీకులు తమ ప్రయాణ ప్రణాళికలో ఏమైనా మార్పు వస్తే ప్రయాణ తేదీకి 2 రోజుల ముందు వరకు వారి విమాన తేదీని కూడా మార్చుకోవచ్చు. అలాగే, టికెట్ బుక్ చేసుకున్న ప్రయాణికులు జనవరి 15 - ఏప్రిల్ 15 మధ్య కాలంలో ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఈ టికెట్లను స్పైస్ జెట్ వెబ్ సైట్, ఆన్ లైన్ ట్రావెల్ పోర్టల్స్, స్పైస్ జెట్ మొబైల్ యాప్, ట్రావెల్ ఏజెంట్ల ద్వారా బుక్ చేసుకోవచ్చు.

(చదవండి: భారత్‌కు రానున్న అమెరికన్‌ దిగ్గజ కంపెనీ..!)


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement