కరోనా మహమ్మారి దెబ్బకి డీలా పడ్డ రంగాల్లో ప్రధానంగా ఏవియేషన్ రంగం కూడా ఒకటి. ప్రపంచవ్యాప్తంగా ఏడాదిన్నర పాటు వైరస్ కారణంగా ప్రజలు ఇళ్లకే పరిమితం కావడం విమానయాన సంస్థలకు తీరని నష్టాలు తీసుకొచ్చాయి. కోవిడ్ తగ్గుముఖం పట్టాక ఊపిరి పీల్చుకోవచ్చని భావించిన సంస్థలకు.. ఆపై ఇంధన ధరలు పెరగడం వంటి పరిణామాలతో ఆర్థికంగా మరిన్ని కష్టాలు చవిచూడాల్సి వచ్చింది.
ఈ క్రమంలో ఖర్చులను తగ్గించుకునేందుకు విమానయాన సంస్థలు ప్రయత్నాలు మొదలుపెట్టాయి. ఈ వరుసలో ముందు స్పైస్ జెట్ సంస్థ నిలిచింది. అకస్మాత్తుగా తన కంపెనీలోని 80 మంది పైలట్లను 3 నెలల సెలవుపై పంపించింది. ఈ సమయానికి వారికి సాలరీ కూడా ఇవ్వరంటూ ఒక ప్రకటనలో తెలియజేసింది.
దీనిపై ఓ పైలెట్ స్పందిస్తూ.. స్పైస్‌జెట్ ఆర్థిక సంక్షోభం గురించి మాకు తెలుసు, కానీ సంస్థ 3 నెలల పాటు పైలట్లని ఇంటికి పంపాలని తీసుకున్న ఆకస్మిక నిర్ణయం మాలో చాలా మందిని దిగ్భ్రాంతికి గురిచేసింది. అయితే మూడు నెలల తర్వాత కూడా కంపెనీ ఆర్థిక పరిస్థితిపై స్పష్టత వస్తుందని అనుకోవడంలేదు. ఇది ప్రస్తుతం తాత్కాలిక చర్య అని కంపెనీ చెబుతున్నప్పటికీ, తిరిగి పైలట్లను విధుల్లోకి తీసుకోవడం కష్టమేనన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment