సాక్షి, ముంబై: ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుని చివరకు మూసివేత దిశగా పయనిస్తున్న జెట్ ఎయిర్‌వేస్ స్టాక్‌మార్కెట్‌లో వరుసగా నష్టపోతోంది. తాత్కాలికంగా కార్యకాలాపాలను మూసివేస్తున్నట్టు యాజమాన్యం బుధవారం వెల్లడించడంతో గురువారం నాటి మార్కెట్‌లో ఏకంగా 30శాతం నష‍్టపోయింది. అయితే నలుగురుబిడ్డర్లు వాటాల కొనుగోలుకు ఆసక్తిగా ఉన్నారన్నఅంచనాలతో ప్రస్తుతం 26 శాతం నష్టంతో 179 వద్ద ట్రేడ్ అవుతోంది.
కాగా మరోవైపు జెట్ ఎయిర్‌వేస సంక్షోభం నేపథ్యంలో ఇతర కంపెనీల సేవలకు డిమాండ్ పెరుగుతోంది. ప్రధానంగా జెట్ ఎయిర్‌వేస్ వివాదం నేపథ్యంలో మరో దేశీయ విమానాయాన సంస్థ స్పైస్‌జెట్ కొత్తగా విమాన సర్వీసులను పరిచయం చేస్తూ ఉండటంతో ఈ కౌంటర్లో భారీగా కొనుగోళ్లు నెలకొన్నాయి. 22 బోయింగ్ 737 ఎన్‌జీ విమానాలను ఇటీవల ప్రకటించింది. తాజాగా మరో 6 విమానాలను సర్వీసుల్లో దింపుతున్నట్టు వెల్లడించింది. దీంతో వరుసగా లాభపడుతూ ప్రస్తుతం 6 శాతం ఎగిసింది. అలాగే ఇండిగో ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ కౌంటర్‌లో కొనుగోళ్ల ధోరణి నెలకొంది ఒక శాతానికిపైగా లాభాలతో కొనసాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment