స్పైస్‌జెట్‌కు లభించని ఊరట
తక్షణ ఆర్థిక సాయం ఆర్ధించిన సంస్థ
హామీ ఇవ్వని పౌర విమానయాన శాఖ
న్యూఢిల్లీ: చౌక ధరల విమానయాన సంస్థ, సమస్యల్లో కూరుకుపోయిన సన్‌గ్రూప్‌కు చెందిన స్పైస్‌జెట్‌కు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఊరట లభించలేదు. తక్షణం తమను ఆర్థికంగా ఆదుకోవాలంటూ స్పైస్‌జెట్ అధికారులు సోమవారం ప్రభుత్వాన్ని కోరారు. స్పైస్‌జెట్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సంజీవ్ కపూర్, సన్ గ్రూప్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ ఎస్.ఎల్. నారాయణన్ తదితర కంపెనీ ఉన్నతాధికారులు పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి మహేశ్ శర్మను కలిసి తక్షణం తమను ఆదుకోవాలని విజ్నప్తి చేశారు. అయితే వారికి ఎలాంటి హామీ లభించలేదు. ఇలాంటి విషయాలకు సంబంధించిన నిర్ణయాలు పై స్థాయిలో తీసుకుంటారని శర్మ పేర్కొన్నారు.
స్పైస్‌జెట్ అంశాన్ని ప్రధాన మంత్రి కార్యాలయానికి, పెట్రోలియం, ఆర్థిక మంత్రి త్వ శాఖలకు నివేదించామని తెలిపారు. స్పైస్‌జెట్ రుణ భారం రూ.2,000 కోట్ల వరకూ ఉంటుందని అంచనా. ఈ సంస్థ సాఫీగా కార్యకలాపాలు నిర్వహించాలంటే తక్షణం రూ.1,400 కోట్లు అవసరం. దేశీయ విమాన సర్వీసుల మార్కెట్లో 17 శాతం వాటా ఉన్న ఈ కంపెనీ మొత్తం 1,861 సర్వీసులను రద్దు చేసింది. సెప్టెంబర్ క్వార్టర్‌కు రూ.310 కోట్ల నష్టాన్ని పొందింది. అంతకు ముందటి క్వార్టర్ నష్టాల(రూ.559 కోట్లు)తో పోల్చితే ఇది తక్కువే. ఈ సంస్థకు నష్టాలు రావడం ఇది వరుసగా ఐదో క్వార్టర్.