ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, న్యూఢిల్లీ: చైనాలో మరణ మృదంగం మోగిస్తున్న కోవిడ్-19 (కరోనా వైరస్) ఢిల్లీ విమానాశ్రయంలో కలకలం రేపింది. గురువారం (ఫిబ్రవరి 13, 2020 న) బ్యాంకాక్ నుంచి ఢిల్లీకి వచ్చిన (స్పైస్ జెట్ ఫ్లైట్ ఎస్‌జీ -88) ప్రయాణికుడికి ఈ వైరస్ సోకినట్టుగా అనుమానిస్తున్నట్లు స్పైస్ జెట్ ప్రతినిధి తెలిపారు. దీంతో అతడిని అదుపులోకి తీసుకున్న విమానాశ్రయ ఆరోగ్య సంస్థ (ఎపిహెచ్ఓ) అధికారులు వైద్య పరీక్షల నిమిత్తం తరలించారు.
కాగా కోవిడ్ వైరస్ సోకి చైనాలో ఇప్పటికే 1300 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ప్రధానంగా హుబీ ప్రావిన్స్‌లో ఒకే రోజులో దాదాపు 15 వేల కొత్త కేసులు, 242 కొత్త మరణాలు నమోదయ్యాయని అధికారులు ప్రకటించారు, ఇటు భారత్‌లో ఇప్పటి వరకు మూడు కోవిడ్-19 కేసులు నమోదైన సంగతి తెలిసిందే. మూడు కేరళ రాష్ట్రంలోనే నమోదు కావడం గమనార్హం. అలాగే దేశవ్యాప్తంగా వైరస్ అనుమానితుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment