
విజయవాడ-చెన్నై-బ్యాంకాక్ స్పైస్‌జెట్ కనెక్టడ్ ఫ్లైట్
న్యూఢిల్లీ: ప్రముఖ విమానయాన సంస్థ స్పైస్‌జెట్ మరిన్ని ప్రాంతాలకు సర్వీసులకు విస్తరిస్తోంది. బ్యాంకాక్ వెళ్లే ప్రయాణికుల కోసం విజయవాడతో సహా మరో ఆరు దక్షిణాది పట్టణాల నుంచి చె న్నైకి కనెక్టడ్ సర్వీసులను ఏర్పాటు చేసింది. స్పైస్‌జెట్ డిసెంబర్ 10 నుంచి చెన్నై-బ్యాంకాక్ డెరైక్ట్ సర్వీసులను (వారంలో ఆరు రోజులు) ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. పరిమిత సీట్లకు టికెట్ ధరను రూ.9,999గా (రిటర్న్ టికెట్‌తో సహా) నిర్ణయించింది.
బ్యాంకాక్ వెళ్లే ప్రయాణికుల కోసం విజయవాడ, కోజీకోడ్, ట్యుటికోరిన్, బెంగళూరు, మదురై, కోయంబత్తూరు, కొచ్చి ప్రాంతాల నుంచి చెన్నైకి, మళ్లీ చెన్నై నుంచి అదే ప్రాంతాలకు తిరిగి విమాన సర్వీసులను కంపెనీ నడుపుతోంది. సీట్ల బుకింగ్‌ను ప్రారంభించినట్లు స్పైస్‌జెట్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ శిల్పా భాటియా తెలిపారు. స్పైస్‌జెట్ ఈ నెల 15 నుంచి అమృత్‌సర్ (పంజాబ్), కోజికోడ్ (కేరళ) నుంచి దుబాయ్‌కు సర్వీసులను ప్రారంభించనుంది.