
స్పైస్ జెట్ సిబ్బంది ఆందోళన
బోనస్ సమస్య పరిష్కరించాలంటూ.. శంషాబాద్ ఎయిర్ పోర్టులో స్పైస్ జెట్ సిబ్బంది శుక్రవారం ఉదయం ఆందోళనకు దిగారు. యాజమాన్యానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. ఎన్నో నెలలుగా పెండింగ్ లో ఉన్న సమస్యలను పరిష్కారించాలంటూ డిమాండ్ చేశారు. దీంతో ఈ ఉదయం దేశంలోని వివిధ ప్రాంతాలకు బయలు దేరాల్సిన 6 స్పైస్ జెట్ విమానాలు ఆలస్యంగా బయలు దేరాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. గంటల తరబడి ప్రయాణికులు ఎయిర్ పోర్టులో వేచి చూడాల్సి వచ్చింది. విమాన సర్వీసు తీరుపై ప్రయాణీకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.