
న్యూఢిల్లీ: దేశీ మూడో అతిపెద్ద విమానయాన సంస్థ ‘స్సైస్‌జెట్’ తాజాగా రిపబ్లిక్ డే సందర్భంగా పరిమితకాల ప్రమోషనల్ ఆఫర్‌ను ఆవిష్కరించింది. ‘గ్రేట్ రిపబ్లిక్ డే సేల్’ను ప్రకటించింది. ఇందులో భాగంగా ప్రయాణికులు దేశీ వన్‌వే ప్రయాణానికి రూ.769 ప్రారంభ ధరతో టికెట్లను బుక్ చేసుకోవచ్చు.
అదే విదేశీ వన్‌వే ప్రయాణానికి రూ.2,469 ప్రారంభ ధరతో టికెట్లను పొందొచ్చు. జనవరి 25 వరకు అందుబాటులో ఉండే ఈ ఆఫర్‌లో భాగంగా టికెట్లను బుక్ చేసుకున్నవారు ఈ ఏడాది డిసెంబర్ 12 వరకు ఎప్పుడైనా ప్రయాణించొచ్చు.
Comments
Please login to add a commentAdd a comment