మధురపూడి-హైదరాబాద్‌ల నడుమ మరో సర్వీసు | Another service between Madhurapudi Hyderabad | Sakshi
Sakshi News home page

మధురపూడి-హైదరాబాద్‌ల నడుమ మరో సర్వీసు

Published Sat, Aug 9 2014 1:54 AM | Last Updated on Tue, Oct 2 2018 7:37 PM

మధురపూడి-హైదరాబాద్‌ల నడుమ మరో సర్వీసు - Sakshi

మధురపూడి-హైదరాబాద్‌ల నడుమ మరో సర్వీసు

మధురపూడి: మధురపూడిలోని రాజమండ్రి విమానాశ్రయం - హైదరాబాద్ నడుమ మరో విమాన సర్వీసు ప్రారంభం కానుంది. ఇప్పటికే ఈ రెండు విమానాశ్రయాల మధ్య ఒక సర్వీసును నడుపుతున్న స్పైస్ జెట్ సంస్థ వచ్చే నెల ఒకటి నుంచి మరో సర్వీసును నడపనుంది. కొత్త సర్వీసు హైదరాబాద్ నుంచి మధ్యాహ్నం 3 గంటలకు మధురపూడి చేరుకుని, తిరిగి 3.25 గంటలకు బయలుదేరుతుందని స్పైస్‌జెట్ స్థానిక మేనేజర్ అనిల్ నారాయణ శుక్రవారం తెలిపారు.

టిక్కెట్ రూ. 2,200 నుంచి ప్రారంభమవుతుందన్నారు. హైదరాబాద్ నుంచి ఇతర దేశాలకు వెళ్లే సర్వీసులకు కనెక్టింగ్‌గా ఉండే ఈ సర్వీసు ప్రయాణికులకు ఎంతో ఉపయోగకరమన్నారు. ఇప్పటివరకూ మధురపూడి -హైదరాబాద్ మధ్య మూడు సర్వీసులు నడుస్తున్నాయి.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement