
శంషాబాద్‌లో విమానానికి తప్పిన ముప్పు
శంషాబాద్: శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరిన స్పైస్ జెట్ విమానానికి పెను ప్రమాదం తప్పింది. ఆదివారం ఉదయం స్పైస్‌జెట్ విమానం తిరుపతి బయలుదేరింది. విమానంలో సాంకేతిక లోపం తలెత్తినట్లు గుర్తించిన పెలైట్ విమానం టేకాఫ్ అయిన కొద్ది సేపటికే తిరిగి సురక్షితంగా కిందకు దించాడు.
దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రయాణికుల కోసం ప్రత్యామ్నాయ ఏర్పట్లు చేసిన విమానాశ్రయ అధికారులు స్పైస్‌జెట్‌లో తలెత్తిన లోపాలను సరిచేస్తున్నారు.