
హైదరాబాద్ నుంచి దుబాయ్‌కి స్పైస్‌జెట్!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయ విమానయాన సంస్థ స్పైస్ జెట్.. ప్రతి రోజూ హైదరాబాద్, జైపూర్‌ల నుంచి దుబాయ్‌కు విమాన సర్వీసులను నడపనుంది. టికెట్ ధరలు హైదరాబాద్ నుంచి దుబాయ్‌కు ఒకవైపు ప్రయాణానికి రూ.7,999, జైపూర్ నుంచి రూ.6,499లుగా నిర్ణయించినట్లు సోమవారమిక్కడ ఓ ప్రకటనలో తెలిపింది. టికెట్ బుకింగ్‌లను ప్రారంభించామని ఫిబ్రవరి 16 నుంచి ఈ విమాన సర్వీసులు ప్రారంభమవుతాయని పేర్కొంది. జైపూర్-దుబాయ్ మధ్య తొలి డెరైక్ట్ ఫ్లయిట్‌ను ప్రారంభించిన తొలి ప్రైవేట్ ఎయిర్‌లైన్ స్పైస్‌జెట్టే.