న్యూఢిల్లీ: శ్వాసకోశ సంబంధ ఔషధాల అభివృద్ధి, విక్రయానికై ఒక అంతర్జాతీయ ఫార్మా దిగ్గజంతో యూఎస్‌లోని తమ అనుబంధ కంపెనీ లైసెన్సింగ్ ఒప్పందాన్ని కుదుర్చుకుందని అరబిందో ఫార్మా తెలిపింది. దీని ప్రకారం ఇరు సంస్థలు కలిసి ఉత్పత్తులను వాణిజ్యీకరిస్తాయి.
భాగస్వా మ్య కంపెనీకి చెందిన ప్లాంట్లలో తయారీ ఉంటుందని, మార్కెటింగ్ ఇరు సంస్థలు చేపడతాయని అరబిందో తెలిపింది. ఔషధ అభివృద్ధికి అయ్యే వ్యయాన్ని ఇరు కంపెనీలు సమపాళ్లలో పంచుకుంటాయి. ఈ ఔషధ అభివృద్ధి కాలంలో అరబిందో గరిష్టంగా 90 మిలియన్ డాలర్ల మేర ఖర్చు చేయనుంది. ప్రపంచ తయారీ హక్కులను భాగస్వామ్య కంపెనీ కలిగి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment