Aurobindo
-
అంతర్జాతీయ సంస్థతో అరబిందో జట్టు
న్యూఢిల్లీ: శ్వాసకోశ సంబంధ ఔషధాల అభివృద్ధి, విక్రయానికై ఒక అంతర్జాతీయ ఫార్మా దిగ్గజంతో యూఎస్‌లోని తమ అనుబంధ కంపెనీ లైసెన్సింగ్ ఒప్పందాన్ని కుదుర్చుకుందని అరబిందో ఫార్మా తెలిపింది. దీని ప్రకారం ఇరు సంస్థలు కలిసి ఉత్పత్తులను వాణిజ్యీకరిస్తాయి.భాగస్వా మ్య కంపెనీకి చెందిన ప్లాంట్లలో తయారీ ఉంటుందని, మార్కెటింగ్ ఇరు సంస్థలు చేపడతాయని అరబిందో తెలిపింది. ఔషధ అభివృద్ధికి అయ్యే వ్యయాన్ని ఇరు కంపెనీలు సమపాళ్లలో పంచుకుంటాయి. ఈ ఔషధ అభివృద్ధి కాలంలో అరబిందో గరిష్టంగా 90 మిలియన్ డాలర్ల మేర ఖర్చు చేయనుంది. ప్రపంచ తయారీ హక్కులను భాగస్వామ్య కంపెనీ కలిగి ఉంటుంది. -
16 నెలల్లో ఏపీలో అరబిందో ప్లాంటు
హైదరాబాద్: ఔషధ రంగ దిగ్గజం అరబిందో ఫార్మా ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేస్తున్న బెంజైల్పెన్సిలిన్ తయారీ ప్లాంటు 2024 మార్చి నాటికి సిద్ధం కానుంది. ఈ ప్రాజెక్టుకు కంపెనీ రూ.2,000 కోట్లు వెచ్చిస్తోంది. ఇప్పటికే రూ.500 కోట్లు ఖర్చు అయింది. 15,000 టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యంతో ఇది రానుంది. ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల పథకం కింద ఈ ప్లాంటుకు ఆమోదం లభించింది. పైలట్ ప్రాతిపదికన తయారీ 2023 అక్టోబర్ నుంచి మొదలవుతుందని అరబిందో ఫార్మా సీఎఫ్‌వో ఎస్.సుబ్రమణియన్ తెలిపారు. కాగా, ఈ ఆర్థిక సంవత్సరంలో యూఎస్ఏలో 20కిపైగా ఉత్పత్తులను విడుదల చేసే అవకాశం ఉందని అరబిందో అనుబంధ కంపెనీ యూగియా ఫార్మా స్పెషాలిటీస్ సీఈవో యుగంధర్ పువ్వాల తెలిపారు. తక్కువ పోటీ ఉన్న ఉత్పత్తులకు ఆమోదం లభించే చాన్స్ ఉందన్నారు. చదవండి: ఆకాశమే హద్దురా.. అక్కడి ప్లాట్ ధరలకు రెక్కలు.. ఏకంగా 5 రెట్లు పెరగడంతో.. -
అరబిందో ఫార్మా లాభం రూ. 576 కోట్లు!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఔషధ రంగ సంస్థ అరబిందో ఫార్మా గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో రూ. 576 కోట్ల నికర లాభం (కన్సాలిడేటెడ్) ప్రకటించింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం క్యూ4లో నమోదైన రూ. 801 కోట్లతో పోలిస్తే లాభం సుమారు 28 శాతం తగ్గింది. మరోవైపు, మొత్తం ఆదాయం రూ. 6,001 కోట్ల నుంచి రూ. 5,809 కోట్లకు పరిమితమైంది. వ్యయాలు రూ. 5,011 కోట్ల నుంచి రూ. 5,098 కోట్లకు పెరిగాయి. పరిశ్రమ పలు సవాళ్లు ఎదుర్కొంటున్నప్పటికీ నాలుగో త్రైమాసికంలో తాము మెరుగైన పనితీరే కనపర్చగలిగామని అరబిందో ఫార్మా వైస్ చైర్మన్, ఎండీ కే. నిత్యానంద రెడ్డి తెలిపారు. సంక్లిష్టమైన జనరిక్స్ విభాగంలో అమ్మకాలు మరింతగా పుంజుకుంటున్నాయని, బయోసిమిలర్స్ వంటి ఉత్పత్తుల అభివృద్ధిలో పురోగతి సాధిస్తున్నామని పేర్కొన్నారు. 2021–22 ఆర్థిక సంవత్సరానికి రూ. 1 ముఖ విలువ గల షేరు ఒక్కింటిపై రూ. 4.50 చొప్పున మధ్యంతర డివిడెండ్ ఇవ్వాలని కంపెనీ ప్రతిపాదించింది. -
అరబిందో కన్స్ట్రక్షన్ కంపెనీకి జీహెచ్ఎంసీ షాక్!
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ గత శుక్రవారం ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని అపోలో వైద్యులు పేర్కొన్నారు. కాగా కేబుల్ బ్రిడ్జ్ మీదుగా మాదాపూర్ వైపు వెళ్తుండగా సాయి తేజ్ ఐకియా సమీపంలో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు.రోడ్డుపై అరబిందో కన్స్ట్రక్షన్ కంపెనీకి సంబంధించి మట్టి, వ్యర్థాలు ఉండటం వల్లే తేజ్ బైక్ స్కిడ్ అయి పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే నిర్లక్ష్యంగా వ్యవహరించిన కన్స్ట్రక్షన్ కంపెనీపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు వెళ్లుతెత్తాయి. ఇందులో భాగంగానే ఖానమేట్ పరిధిలో భవన నిర్మాణం చేపడుతున్న అరబిందో కన్స్ట్రక్షన్ కంపెనీపై గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) రూ.లక్ష జరిమానా విధించింది . చదవండి: Sai Dharam Tej Accident: కన్స్ట్రక్షన్ కంపెనీ, మున్సిపాలిటీపై కూడా కేసు పెట్టాలి: ఆర్పీ సదరు కంపెనీకి లక్ష రూపాయల జరిమాన విధించిన జీహెచ్ఎంసీ ధృవీకరణ పత్రం సోషల్ మీడియా వైరల్‌గా మారింది.కాగా ఈ ప్రమాదంలో గాయపడిన సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఈ ఘటన ఆయన కాలర్ బోన్ ఫాక్చర్ కాగా ఆదివారం వైద్యులు దానికి శస్త్రచికిత్స నిర్వహించారు. అనంతరం అపోలో వైద్యులు సాయి ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్ విడుదల చేస్తూ.. ప్రస్తుతం అతడి అరోగ్యం నిలకడ ఉందని, త్వరలోనే కోలుకుంటారని తెలిపారు. #SaiDharamTej road accident: The actor sustained injuries and collarbone fracture in a road accident at cable bridge. Now, @GHMCOnline has imposed a fine of Rs 1 lakh on Aurobindo Construction for dumping construction material on the Madhapur-Khanamet road. @IamSaiDharamTej pic.twitter.com/ilE83IA5zo — dinesh akula (@dineshakula) September 14, 2021 -
కీలకంగా వ్యవహరిస్తున్న అరబిందో మెడికల్ ఎమర్జెన్సీ సర్వీస్
-
అరబిందో చేతికి కాకినాడ సెజ్
సాక్షి, అమరావతి: జీఎంఆర్ కాకినాడ సెజ్‌లో మెజార్టీ వాటాను అరబిందో గ్రూపు కొనుగోలు చేసింది. కాకినాడ సెజ్ (కేసెజ్) లిమిటెడ్‌లోని 51 శాతం వాటాను అరబిందో గ్రూపునకు చెందిన అరబిందో రియల్టీకి విక్రయిస్తున్నట్లు జీఎంఆర్ గ్రూపు శుక్రవారం ప్రకటించింది. కేసెజ్ అనుబంధ కంపెనీ కాకినాడ గేట్‌వే పోర్ట్ లిమిటెడ్‌కు చెందిన 100 శాతం వాటాను అరబిందో రియల్టీకి బదలాయిస్తున్నట్లు పేర్కొంది. ఈ మేరకు ఇరు సంస్థల మధ్య ఒప్పందం కుదిరినట్లు పేర్కొంది. ఈ 51 శాతం వాటాను అప్పులతో కలిపి రూ.2,610 కోట్లకు విక్రయిస్తున్నామని, ఇందులో మొదటి విడతగా రూ.1,600 కోట్లు చెల్లించే విధంగాను మిగిలిన మొత్తం రూ.1,010 కోట్లు రెండు మూడేళ్లలో చెల్లించే విధంగా ఒప్పం కుదుర్చుకుంది. ఇంకా ఈ విక్రయానికి రెగ్యులేటరీ సంస్థల అనుమతులు లభించాల్సి ఉంది. అప్పుల భారం తగ్గించుకోవడంలో భాగంగా వాటా విక్రయించినట్లు జీఎంఆర్ గ్రూపు పేర్కొంది. మార్చి 2020 నాటికి జీఎంఆర్ గ్రూపునకు మొత్తం నికర అప్పులు రూ.26,300 కోట్లుగా ఉన్నాయి. సుమారు 10,400 ఎకరాల్లో జీఎంఆర్ మల్టీ ప్రోడక్ట్ సెజ్‌ను అభివృద్ధి చేస్తోంది. ఇందులో 5,000 ఎకరాలు పోర్టు ఆథారిత సెజ్‌గా అనుమతులు తీసుకుంది. దీనికి తోడు కోన గ్రామం వద్ద వాణిజ్య అవసరాల కోసం ఓడ రేవును కూడా నిర్మిస్తోంది. ఫార్మా దిగ్గజం అరబిందో ఫార్మా 2019లో అరబిందో రియల్టీ పేరుతో రియల్ ఎస్టేట్ రంగంలోకి అడుగు పెట్టింది. ఇప్పటికే హైదరాబాద్‌లో పలు వాణిజ్య, నివాస సముదాయాలు నిర్మిస్తున్న అరబిందో రియల్టీ సంస్థ ఇప్పుడు కేసెజ్‌లో మెజార్టీ వాటాను దక్కించుకుంది. ఈ వార్తల నేపథ్యంలో శుక్రవారం ఎన్ఎస్ఈలో జీఎంఆర్ గ్రూపు షేరు క్రితం ముగింపు ధరతో పోలిస్తే 14.18 శాతం పెరిగి రూ.24.15 చేరుకొని చివరకు 11.11 శాతం వృద్ధితో రూ.23.50 వద్ద ముగిసింది. -
అరబిందో రియల్టీ చేతికి జీఎంఆర్ కాకినాడ సెజ్
ఆంధ్రప్రదేశ్, తూర్పుగోదావరిలో గల కాకినాడ సెజ్ లిమిటెడ్(కేఎస్ఈజెడ్)ను అరబిందో రియల్టీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు విక్రయిస్తున్నట్లు మౌలిక రంగ హైదరాబాద్ కంపెనీ జీఎంఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తాజాగా వెల్లడించింది. అనుబంధ సంస్థ జీఎంఆర్ సెజ్ అండ్ పోర్ట్ హోల్డింగ్ ద్వారా కేఎస్‌ఈజెడ్‌లో తమకుగల 51 శాతం వాటాను విక్రయించేందుకు ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు తెలియజేసింది. డీల్ విలువ రూ. 2,610 కోట్లుకాగా.. తొలి దశలో రూ. 1,600 కోట్లను అందుకోనున్నట్లు తెలియజేసింది. తదుపరి రెండు, మూడేళ్లలో రూ. 1,010 కోట్లు లభించనున్నట్లు వివరించింది. డీల్‌లో భాగంగా కేఎస్‌ఈజెడ్‌లో వాటాతోపాటు.. కాకినాడ గేట్‌వే పోర్ట్ లిమిటెడ్‌లో కేఎస్ఈజెడ్కు గల 100 శాతం వాటాను సైతం అరబిందో రియల్టీకి బదిలీ చేయనున్నట్లు వివరించింది. షేరు జూమ్ కేఎస్ఈజెడ్ విక్రయానికి అరబిందో రియల్టీతో డీల్ కుదుర్చుకున్నట్లు వెల్లడించిన నేపథ్యంలో జీఎంఆర్ ఇన్ఫ్రా కౌంటర్‌కు డిమాండ్ పుట్టింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ఎన్ఎస్ఈలో ప్రస్తుతం ఈ షేరు 10 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. రూ. 23.25 వద్ద ఫ్రీజయ్యింది. పోర్ట్ ఆధారిత మల్టీ ప్రొడక్ట్ ప్రత్యేక ఆర్థిక మండలిగా కేఎస్ఈజెడ్ కార్యకలాపాలు సాగిస్తోంది. -
కోవిడ్–19 వ్యాక్సిన్ అభివృద్ధిలో అరబిందో
హైదరాబాద్: ఔషధ తయారీ సంస్థ అరబిందో ఫార్మా పలు వైరస్‌లకు సంబంధించిన వ్యాక్సిన్ల అభివృద్ధిలో నిమగ్నమైంది. ఇందులో కోవిడ్–19 వ్యాక్సిన్ కూడా ఒకటని కంపెనీ తెలిపింది. ఈ మేరకు డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ ఫండింగ్‌కు తమ వ్యాక్సిన్ క్యాండిడేట్ ఎంపిక అయినట్టు వెల్లడించింది. గత ఆర్థిక సంవత్సరంలో సంస్థ అనుబంధ కంపెనీ ఆరో వ్యాక్సిన్స్ ద్వారా ప్రొఫెక్టస్ బయోసైన్సెస్ ఆర్అండ్డీ ఆస్తులను కొనుగోలు చేశామని, తద్వారా వ్యాక్సిన్ల విభాగంలో బలం పెంచుకున్నామని వివరించింది. కంపెనీ బృందం ఈ ఆర్అండ్డీని వినియోగించి వ్యాక్సిన్లకు రూపకల్పన చేస్తోందని తెలిపింది. నిమోనియా బారిన పడకుండా ఇచ్చే న్యూమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను సైతం కంపెనీ అభివృద్ధి చేస్తోంది. ఈ ఉత్పాదన మార్కెట్ విలువ ప్రపంచవ్యాప్తంగా 6.2 బిలియన్ డాలర్లు. ఫేజ్–1, ఫేజ్–2 పూర్తి అయిందని, ఫేజ్–3 క్లినికల్ స్టడీ ఈ ఏడాది డిసెంబరులో ప్రారంభించనున్నట్టు అరబిందో వెల్లడించింది. 2021–22లో ఈ వ్యాక్సిన్ విడుదల చేసే అవకాశం ఉందని తెలిపింది. ఓరల్స్ తయారీకై చైనాలో, ఇంజెక్టేబుల్స్, ప్యాచెస్, టాపికల్స్, ఇన్హేలర్స్ వంటి ఉత్పత్తుల తయారీకై భారత్‌తోపాటు యూఎస్‌లో కొత్తగా ప్లాంట్లను స్థాపిస్తోంది. నూతనంగా ఏర్పాటైన బయోసిమిలర్స్, వ్యాక్సిన్స్ తయారీ యూనిట్లు కార్యకలాపాలకు సిద్ధమయ్యాయి. (మా సత్తా ఏంటో తెలిసింది!) -
‘కాంటినెంటల్’ చేతులు మారుతుందా?
‘సాక్షి’ బిజినెస్ ప్రతినిధి: సింగపూర్, మలేసియాలకు చెందిన ‘పార్క్ వే పంటాయ్’ గ్రూపు నుంచి కాంటినెంటల్ ఆసుపత్రిని మళ్లీ తన చేతుల్లోకి తీసుకోవటానికి ప్రమోటరు డాక్టర్ గురునాథ్ రెడ్డి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. దీన్లో భాగంగా ఇటీవల అరబిందో ఫార్మా ప్రమోటర్లను కలిసి చర్చించడంతో అంతా డీల్ కుదిరిందనే అనుకున్నా... సాకారం కాలేదు. తాజాగా కొన్ని ఆర్థిక సంస్థల అండ తీసుకుని తానే మళ్లీ పార్క్ వే నుంచి వాటాను వెనక్కి తీసుకోవాలని గురునాథ్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. ఇది కుదరని పక్షంలో చైనాకు చెందిన ఒక హెల్త్‌కేర్ సంస్థ పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపిస్తున్నట్లు కూడా సమాచారం. ‘‘పార్క్‌వే గ్రూపునకు ప్రస్తుతం కాంటినెంటల్‌లో 52.3 శాతం వాటా ఉంది. తన అనుబంధ సంస్థ గ్లెనీగల్స్ డెవలప్మెంట్ పీటీఈ లిమిటెడ్ ద్వారా 2015లో దీన్ని 284 కోట్లకు కొనుగోలు చేసింది. అప్పట్లో డీల్ బాగానే అనిపించినా... వాటా దక్కిన మరు క్షణం నుంచీ అది నియంత్రణను పూర్తిగా తన చేతుల్లోకి తీసుకుంది. వైద్యుడైన డాక్టర్ గురునాథ్‌రెడ్డిని, ఆయన బృందాన్ని పూర్తిగా పక్కనబెట్టేసింది. అప్పటి నుంచీ ఆయన అసంతృప్తితోనే ఉన్నారు. మళ్లీ వాటాను చేజిక్కించుకోవటానికి రకరకాలుగా ప్రయత్నిస్తూనే ఉన్నారు. కాబట్టి పార్క్‌వేతో ఆయన కలిసి ముందుకెళ్లే పరిస్థితి లేదు. ఏదో ఒకరోజు పార్క్ వే నిష్క్రమణ తప్పకపోవచ్చు’’ అని ఈ వ్యవహారాన్ని మొదటి నుంచీ పరిశీలిస్తున్న వ్యక్తులు ‘సాక్షి’తో చెప్పారు. నిజానికి అరబిందో ఫార్మా ప్రమోటర్లు రూ.600 కోట్లు పెట్టుబడి పెట్టి వ్యక్తిగత హోదాలో కాంటినెంటల్ ఆసుపత్రిలో మెజారిటీ వాటా తీసుకుంటున్నారని, నిర్వహణను గురునాథ్ రెడ్డికే వదిలేస్తారని కూడా వార్తలొచ్చాయి. ఇవన్నీ అవాస్తవాలని సంబంధిత వర్గాలు తేల్చేశాయి. హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో ఉన్న కాంటినెంటల్ ఆసుపత్రి ప్రస్తుతం 300 పడకలతో నడుస్తోంది. 2.95 ఎకరాల్లో విస్తరించిన దీని సామర్థ్యాన్ని 750 పడకలకు విస్తరించే అవకాశం ఉంది. 2015లో మెజారిటీ వాటాను కొన్నాక... సీఈఓగా గురునాథ్ రెడ్డిని తొలగించి ఆయన స్థానంలో గ్రూప్ సీఈఓ టాన్ సీ లెంగ్‌ను నియమించింది పార్క్‌వే. అంతేకాకుండా 2017లో అదనపు పెట్టుబడి ద్వారా వాటాను డైల్యూట్ చేసి మరో 1.3 శాతాన్ని కేటాయించుకుంది. దీంతో గురున్ రెడ్డి వాటా 47.7 శాతానికి పరిమితమయింది. ఆ తరవాత కూడా ఇలాంటి ప్రయత్నాలు చేయటంతో ఆయన ఎన్సీఎల్టీని కూడా ఆశ్రయించారు. నిజానికి ఐహెచ్‌హెచ్ హెల్త్‌కేర్‌కు చెందిన పార్క్‌వే దేశంలో పలు ఆసుపత్రుల్లో దూకుడుగా పెట్టుబడులు పెట్టినా... ఏ ఒక్కటీ కలిసి రాలేదనే చెప్పాలి. గ్లోబల్ హాస్పిటల్స్. కోల్‌కతాలోని అపోలోతో పాటు కాంటినెంటల్‌లో పెట్టుబడులు పెట్టగా... కోల్‌కతా అపోలో నుంచి ఎగ్జిట్ అయిపోవాల్సి వచ్చింది. ఇక గ్లోబల్ వ్యవహారం కూడా అంత సజావుగా ఏమీ లేదు. ఇపుడు కాంటినెంటల్ పరిస్థితీ అదే తీరుగా ఉంది. -
అరబిందో విస్తరణకు గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్: అరబిందో ఫార్మా విస్తరణ ప్రణాళికకు పర్యావరణ, అడవులు, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ నుంచి అనుమతి లభించింది. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాలో రూ.250 కోట్ల మూలధన వ్యయంతో ఏర్పాటుచేయనున్న ఉత్పత్తి కేంద్రానికి సోమవారం గ్రీన్ సిగ్నల్ లభించినట్లు సంస్థ ప్రకటించింది. ఈ కేంద్రంలో ప్రస్తుతం 583.31 టీపీఎం (ఒక నెల్లో ఉత్పత్తి అయ్యే మొత్తం టన్నులు) భారీ ఔషధాలు, ఇంటర్మీడియట్ ఉత్పత్తి సామర్థ్యం ఉండగా.. విస్తరణ అనంతరం ఇది 1,518.3 టీపీఎంకు చేరుతుందని వివరించింది. ఈ యూనిట్లో 8.85 మెగావాట్ల క్యాపిటివ్ పవర్ ప్లాంటును సైతం నెలకొల్పనుంది. పర్యావరణ కాలుష్య నియంత్రణ చర్యల కోసం రూ.32.77 కోట్లుగా అంచనావేసింది. ప్రాజెక్ట్ ద్వారా 600 మందికి ప్రత్యక్షంగానూ, 120 మందికి పరోక్షంగానూ ఉపాధి లభించనున్నట్లు వెల్లడించింది. -
స్పెషాలిటీ ఉత్పత్తులపై అరబిందో ఫోకస్
హైదరాబాద్: ఔషధ రంగ సంస్థ అరబిందో ఫార్మా విభిన్న ప్రత్యేక ఉత్పత్తుల అభివృద్ధిలో నిమగ్నమైంది. ఆంకాలజీ, హార్మోన్స్, బయాలాజిక్స్, టాపికల్స్, నాసల్స్, పెప్టైడ్స్, ఇన్హేలర్స్, వ్యాక్సిన్స్ వంటి 147 ప్రొడక్టులు అభివృద్ధి దశలో ఉన్నట్టు కంపెనీ వెల్లడించింది. వీటి మార్కెట్ పరిమాణం రూ.8.27 లక్షల కోట్లు అని ఇన్వెస్టర్ ప్రెజెంటేషన్‌లో తెలిపింది. కొత్త ఉత్పత్తుల ద్వారా ఆదాయం 2019–20 తొలి త్రైమాసికం నుంచి ప్రారంభం అవుతుంది. మూడేళ్లలో ఈ ప్రొడక్టులను యూఎస్ఎఫ్డీఏ వద్ద అరబిందో ఫైల్ చేయనుంది. -
చైనాలో అరబిందో తయారీ ప్లాంట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఔషధ తయారీ సంస్థ అరబిందో ఫార్మా అనుబంధ కంపెనీ అయిన నెదర్లాండ్స్‌లోని హెలిక్స్ హెల్త్‌కేర్, చైనాకు చెందిన షాన్డాంగ్ లువోక్సిన్ ఫార్మాస్యూటికల్ గ్రూప్ ఓ ఒప్పందం చేసుకున్నాయి. దీనిలో భాగంగా జాయింట్ వెంచర్ సంస్థను పెట్టి... దీనిద్వారా చైనాలో తయారీ కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. ఒప్పందం ప్రకారం జేవీ కంపెనీలో హెలిక్స్‌కు 30 శాతం వాటా ఉంటుంది. జేవీ ద్వారా ఇరు సంస్థలూ నెబ్యులైజర్ ఇన్‌హేలర్స్‌తో పాటు ఇతర ఉత్పత్తులను తయారు చేస్తాయి. కాంట్రాక్ట్ మాన్యుఫాక్చరింగ్‌లోకి సైతం ప్రవేశిస్తాయి. ఈ ఉత్పత్తులను చైనాతోపాటు యూఎస్, యూరప్ మార్కెట్లలో విక్రయిస్తారు. జేవీ వర్కింగ్ క్యాపిటల్‌తో కలిపి ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.360 కోట్లు. ఈ మొత్తం పెట్టుబడిలో 30 శాతాన్ని హెలిక్స్, మిగిలిన మొత్తాన్ని లువోక్సిన్ దశలవారీగా పెడతాయి. 2021లో తయారీ ప్రారంభం అవుతుంది. ఈ వార్తల నేపథ్యంలో మంగళవారం బీఎస్ఈలో అరబిందో షేరు ధర క్రితం ముగింపుతో పోలిస్తే 0.44 శాతం అధికమై రూ.736.35 వద్ద స్థిరపడింది. -
అరబిందో చేతికి సాండోజ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హైదరాబాద్‌కు చెందిన ఫార్మా దిగ్గజం అరబిందో చేతికి అమెరికాకు చెందిన సాండోజ్ డెర్మటాలజీ చిక్కింది. నోవార్టిస్ ఏజీ జనరిక్ వ్యాపార విభాగమే ఈ సాండోజ్. డీల్ విలువ 1 బిలియన్ డాలర్ (రూ.7,200 కోట్లు). దీనికి అమెరికా ఫెడరల్ ట్రేడ్ కమిషన్ అనుమతి ఇవ్వాల్సి ఉందని.. 2019 కి ఈ డీల్ ముగిసే అవకాశముందని అరబిందో ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో సాండోజ్ వ్యాపారం 0.6 బిలియన్ డాలర్లుగా ఉంది. ఈ కొనుగోలులో సాండోజ్‌కు చెందిన ఉత్తర కరోలినాలోని విల్సన్ తయారీ కేంద్రం, న్యూయార్క్‌లోని హిక్స్‌విల్లీ, మెల్విల్లీ తయారీ కేంద్రాలు అరబిందో వశమవుతాయని కంపెనీ ఒక ప్రకటనతో తెలిపింది. దీంతో పాటూ హిక్స్‌విల్లీ, మిల్‌విల్లీ, విల్సన్, ప్రిన్స్టన్, న్యూజెర్సీల్లోని సుమారు 750 మంది ఉద్యోగుల, ఫీల్డ్ రిప్రజెంట్స్ కూడా అరబిందోకు బదిలీ అవుతారు. ప్రస్తుతం సాండోజ్‌కు చెందిన సుమారు 300 ఉత్పత్తులతో పాటూ అభివృద్ధి చేస్తున్న పలు ప్రాజెక్ట్‌లు కూడా అరబిందోకు విక్రయిస్తున్నట్లు సాండోజ్ ఒక ప్రకటనలో తెలిపింది. యూఎస్‌లో ఎంట్రీ కోసమే.. అమెరికాలో వ్యాపార వృద్ధి, విస్తరణలో భాగంగానే ఈ కొనుగోలు జరిగిందని అరబిందో ఫార్మా ఎండీ ఎన్ గోవిందరాజన్ పత్రికా సమావేశంలో చెప్పారు. దీంతో అమెరికాలో జనరిక్ డెర్మటాలజీ మార్కెట్లో విస్తరణకు, మా ఉత్పత్తుల ప్రవేశానికి తలుపులు తెరిచినట్లయిందని చెప్పారు. ‘‘అత్యంత సమర్థవంతమైన ఉత్పాదన, నిర్వహణ, లాభదాయకమైన మార్కెట్ వంటివి ప్రధాన లక్ష్యంగా చేసుకొనే సాండోజ్‌తో పాటూ గతంలో జరిపిన ఇతర కంపెనీల కొనుగోళ్లు జరిగాయని’’ గోవిందరాజన్ వివరించారు. 2వ అతిపెద్ద కంపెనీగా.. సాండోజ్‌కు జనరిక్ బ్రాండ్ డెర్మటాలజీ విభాగంతో పాటూ అభివృద్ధి కేంద్రం కూడా ఉంది. కొనుగోళ్ల లావాదేవీలతో పరిశీలిస్తే అమెరికాలో డెర్మటాలజీ విభాగంలో అరబిందో 2వ అతిపెద్ద కంపెనీగా అవతరించింది. వాస్తవానికి సాండోజ్ విభాగంలో డెర్మటాలజీ కంటే ఓరల్ సాలిడ్స్ (టాబ్లెట్స్ మరియు క్యాçప్సూల్స్) వ్యాపార విభాగం పెద్దది. కానీ, అరబిందో ప్రధాన లక్ష్యం తక్కువ ధర, నిర్వహణ ద్వారా డెర్మటాలజీ విభాగాన్ని లాభంలోకి తీసుకురావాలనేది. గురువారం బీఎస్ఈలో అరబిందో షేరు క్రితం ముగింపుతో పోలిస్తే 9.12 శాతం పెరిగి రూ.759.55 వద్ద స్థిరపడింది. -
ఫార్మా స్టాక్స్ ర్యాలీ: లాభాల్లో మార్కెట్లు
ముంబై : దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం సరికొత్త రికార్డు స్థాయిల్లో ముగిశాయి. సెన్సెక్స్ 50.12 పాయింట్ల లాభంలో 31,159.40వద్ద, నిఫ్టీ 19.65 పాయింట్ల లాభంలో 9624.55గా క్లోజ్ అయ్యాయి. వరుసగా తొమ్మిది రోజుల పాటు నష్టాల్లో కొనసాగిన ఫార్మా స్టాక్స్ లో కొనుగోలు మద్దతు లభించింది. దీంతో అరబిందో ఫార్మా స్టాక్ భారీగా 13 శాతం మేర దూసుకెళ్లింది. హెల్త్ కేర్ ఇండెక్స్ కూడా 2 శాతం పైననే లాభపడింది. ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ షేర్లు కనీసం 2 శాతం మేర లాభపడ్డాయి. నిన్నటి మార్కెట్లో ర్యాలీ సాగించిన ఎఫ్ఎంసీజీ షేర్లలో ప్రాఫిట్ బుకింగ్ చోటుచేసుకుంది. నేటి ట్రేడింగ్ లో అదానీ పోర్ట్స్, అరబిందో ఫార్మా, ఎన్టీపీసీ టాప్ గెయినర్లుగా లాభాలు పండించగా.. బీహెచ్ఈఎల్, ఐటీసీ, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, బీపీసీఎల్ ఎక్కువగా నష్టపోయాయి. అటు డాలర్ తో రూపాయి మారకం విలువ 18 పైసలు బలహీనపడి 64.63 వద్ద నమోదైంది. బంగారం ధరలు ఎంసీఎక్స్ మార్కెట్లో 40 రూపాయల నష్టంలో 28,860గా రికార్డయ్యాయి. -
అరబిందో చేతికి జనరిస్ ఫార్మా
రూ.969 కోట్లతో కొనుగోలుకు ఒప్పందం న్యూఢిల్లీ: పోర్చుగల్ కేంద్రంగా పనిచేస్తున్న జనరిక్ ఔషధ కంపెనీ ‘జనరిస్ ఫార్మాస్యూటికా’ను అరబిందో ఫార్మా సొంతం చేసుకుంది. 135 మిలియన్ యూరోలు చెల్లించి దీన్ని సొంతం చేసుకోవటానికి ఒప్పందం చేసుకుంది. ఇది మన కరెన్సీలో దాదాపు రూ.969 కోట్లు. ప్రస్తుతం ఈ సంస్థ మాగ్నమ్ క్యాపిటల్ పార్ట్నర్స్ చేతిలో ఉంది. తన అనుబంధ సంస్థ ఏజైల్ ఫార్మా నెదర్లాండ్స్ ద్వారా ఈ కొనుగోలు ఒప్పందం చేసుకున్నట్లు అరబిందో యూరోపియన్ ఆపరేషన్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ వి.మురళీధరన్ చెప్పారు. ఈ రెండు సంస్థలకూ సంబంధించి పలు ఔషధాల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని, దీంతో వచ్చే అయిదేళ్లలో మరిన్ని పేటెంట్లు వస్తాయని ఆయన తెలియజేశారు. యూరోపియన్ మార్కెట్లో తమ స్థానాన్ని పటిష్ఠం చేసుకోవటానికి కట్టుబడి ఉన్నామని, తాజా కొనుగోలు కూడా దీన్నే సూచిస్తుందని చెప్పారాయన. ఈ ఒప్పందానికి పోర్చుగీసు నియంత్రణ సంస్థల నుంచి అనుమతులు రావాల్సి ఉంది. ఒప్పందంతో పోర్చుగల్‌లోని అమడొరాలో ఉన్న 1.2 బిలియన్ ట్యాబ్లెట్స్ను ఉత్పత్తి చేసే ప్లాంటు అరబిందో సొంతమవుతుంది. -
టాప్ ఫార్మా సంస్థల్లో...8 హైదరాబాదీ కంపెనీలు
♦ పేరొందిన కంపెనీల్లో డాక్టర్ రెడ్డీస్‌కు 4వ స్థానం ♦ అరబిందో, నాట్కో, సువెన్, దివీస్కూ చోటు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశంలోనే అత్యధికంగా పేరొందిన ఫార్మా బ్రాండ్ల జాబితాలో హైదరాబాద్‌కి చెందిన 8 సంస్థలు చోటు దక్కించుకున్నాయి. ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ 4వ స్థానంలో నిలిచింది. ‘భారత్‌లో పరపతి గల ఫార్మా బ్రాండ్స్ 2016’ పేరిట టీఆర్ఏ రీసెర్చ్, బ్లూబైట్స్ సంయుక్తంగా ఈ నివేదికను రూపొం దించింది. ఈ జాబితాలో అరబిందో ఫార్మా 11వ స్థానం, నాట్కో ఫార్మా 21వ స్థానం దక్కించుకున్నాయి. అటు సువెన్ లైఫ్ సెన్సైస్ (40వ ర్యాంకు), దివీస్ లేబొరేటరీస్ (44), జెనోటెక్ లేబొరేటరీస్ (48), ఇండియన్ ఇమ్యునోలాజికల్స్ (49), బయోలాజికల్-ఇ 52వ ర్యాంకుల్లో నిలిచాయి. ఈ జాబితాలో ముంబైకి చెందిన లుపిన్ అగ్రస్థానంలోను, సన్ ఫార్మా రెండు, సిప్లా మూడవ స్థానంలో నిలిచాయి. 41 దేశీ సంస్థలు, 17 అంతర్జాతీయ సంస్థలు.. వెరసి మొత్తం 58 బ్రాండ్స్‌ను అధ్యయనం చేసి ఈ నివేదికను రూపొందించారు. ఇండియాస్ మోస్ట్ రెప్యూటెడ్ బ్రాండ్స్ సిరీస్‌లో ఇది రెండోది. మీడియాలోనూ, వినియోగదారుల్లోనూ ఆయా బ్రాండ్స్‌పై ఉన్న అభిప్రాయాన్ని విశ్లేషించి, తదనుగుణంగా ర్యాం కులు ఇవ్వడం జరిగిందని ఇండియాస్ మోస్ట్ రెప్యూటెడ్ బ్రాండ్స్ ప్రతినిధి పూజా కౌరా తెలిపారు. వేగవంతమైన వృద్ధిపరంగా 2020 నాటికి టాప్ 3 ఫార్మా మార్కెట్లలో ఒకటిగా ఉండనుందని ఆమె పేర్కొన్నారు. ఫార్మా రంగంపై గతేడాది జూలై 15- ఈ ఏడాది జూలై 16 మధ్యలో వచ్చిన 24,414 వార్తల విశ్లేషణ ఆధారంగా ఈ అధ్యయనం నిర్వహించారు. భారత్‌లో పేరొందిన విదేశీ బ్రాండ్స్ విషయానికొస్తే జీఎస్కే అగ్రస్థానంలోనూ, ఫైజర్, అబాట్ తదుపరి స్థానాల్లోనూ నిలిచాయి. -
‘అరబిందో’ నిత్యానందరెడ్డికి మినహాయింపు
హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు సాక్షి, హైదరాబాద్: జగన్ కంపెనీల్లో పెట్టుబడుల వ్యవహారంలో సీబీఐ ప్రత్యేక కోర్టులో జరుగుతున్న విచారణకు వ్యక్తిగత హాజరు నుంచి అరబిందో ఎండీ కె.నిత్యానందరెడ్డికి హైకోర్టు మినహాయింపునిచ్చింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ రాజా ఇలంగో శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. జడ్చర్ల సెజ్‌లో భూకేటాయింపులకు సంబంధించి అరబిందో కంపెనీలు, ఆ సంస్థ ఎండీ నిత్యానందరెడ్డిపై సీబీఐ కేసు నమోదు చేయడం తెలిసిందే. దీనిపై ప్రత్యేక న్యాయస్థానంలో విచారణ జరుగుతోంది. ప్రతీ శుక్రవారం జరిగే విచారణకు ఆయన వ్యక్తిగతంగా హాజరవ్వాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతూ అరబిందో కంపెనీలు, నిత్యానందరెడ్డి పిటిషన్ వేశారు. దీనిపై శుక్రవారం విచారణ సందర్భంగా న్యాయవాది టి.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్ వ్యాపార కార్యకలాపాల నిమిత్తం దేశవిదేశాలు తిరిగాల్సి వస్తోందని, ప్రతీ శుక్రవారం విచారణకు హాజరవ్వాల్సి ఉన్న నేపథ్యంలో కీలక సమావేశాల్ని అర్ధాంతరంగా ముగించుకోవాల్సి వస్తోందని తెలిపారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి జస్టిస్ రాజా ఇలంగో.. వ్యక్తిగత హాజరు నుంచి నిత్యానందరెడ్డికి మినహాయింపునిచ్చారు. కోటేశ్వరరావు, రాజగోపాల్‌లకు కూడా... ఇందూటెక్ జోన్‌కు సంబంధించి సీబీఐ నమోదు చేసిన కేసులో నిందితునిగా ఉన్న ఆడిటర్ సి.వి.కోటేశ్వరరావుకూ సీబీఐ ప్రత్యేక కోర్టులో జరుగుతున్న విచారణకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు లభించింది. సీబీఐ తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలన్న కోటేశ్వరరావు పిటిషన్‌పై శుక్రవారం వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ రాజా ఇలంగో.. వ్యక్తిగత హాజరు నుంచి ఆయనకు మినహాయింపునిస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. మరోవైపు జగన్ కంపెనీల్లో పెట్టుబడుల వ్యవహారంలో దాల్మియా సిమెంట్స్‌కు చేసిన భూకేటాయింపులపై సీబీఐ నమోదు చేసిన కేసులో నిందితునిగా ఉన్న అప్పటి గనులశాఖ అధికారి వి.డి.రాజగోపాల్‌కు సైతం సీబీఐ కోర్టులో జరుగుతున్న విచారణకు సంబంధించి వ్యక్తిగత హాజరు నుంచి న్యాయమూర్తి మినహాయింపునిచ్చారు. -
శరత్ చంద్రారెడ్డికి ఊరట
♦ వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు.. హైకోర్టు ఉత్తర్వులు ♦ ‘హెటిరో’ డెరైక్టర్ శ్రీనివాసరెడ్డికి కూడా దక్కిన ఊరట సాక్షి, హైదరాబాద్: జగన్ కంపెనీల్లో పెట్టుబడుల వ్యవహారంలో ‘ట్రైడెంట్ లైఫ్ సెస్సైస్’ ఎండీ శరత్‌చంద్రారెడ్డికి హైకోర్టు ఊరటనిచ్చింది. సీబీఐ కోర్టులో జరుగుతున్న విచారణకు వ్యక్తిగత హాజరు నుంచి ఆయనకు మినహాయింపునిచ్చింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ రాజా ఇలంగో బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. హెటిరో, అరబిందో, ట్రైడెంట్‌కు సంబంధించి సీబీఐ కేసు నమోదు చేసింది. అందులో శరత్‌చంద్రారెడ్డిని నిందితుడిగా చేరుస్తూ చార్జిషీట్ దాఖలు చేసింది. ఈ కేసుపై సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం విచారణ జరుపుతోంది. ఈ విచారణకు వ్యక్తిగత హాజరు నుంచి తనకు మినహాయింపు ఇవ్వాలని కోరుతూ శరత్‌చంద్రారెడ్డి, ట్రైడెంట్ లైఫ్ సెస్సైస్లు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిని జస్టిస్ రాజా ఇలంగో బుధవారం విచారించారు. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది టి.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపించారు. శరత్‌చంద్రారెడ్డి.. అరబిందో, ట్రైడెంట్, యాక్సిస్ క్లినికల్స్లతోపాటు మొత్తం 9 కంపెనీల్లో డెరైక్టర్‌గా ఉన్నారన్నారు. ఈ కంపెనీలకు పలు దేశాల్లో అనుబంధ కంపెనీలున్నాయని, అక్కడికి అధికారిక కార్యక్రమాల నిమిత్తం తరచూ వెళ్లాల్సి వస్తోందని తెలిపారు. ఈ పరిస్థితుల్లో ప్రతి శుక్రవారం కోర్టు ముందు హాజరు కావడం ఇబ్బందిగా ఉందని కోర్టుకు నివేదించారు. 2012 మే 28 నుంచి ఇప్పటివరకు సీబీఐ కోర్టులో కేసు విచారణ 85 సార్లు వాయిదా పడిందని తెలిపారు. విచారణ ఇప్పట్లో పూర్తయ్యే అవకాశాలు కనిపించడం లేదన్నారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి.. వ్యక్తిగత హాజరు నుంచి శరత్‌చంద్రారెడ్డికి మినహాయింపునిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. హెటిరోపై విచారణ ప్రక్రియ నిలిపివేత జగన్ కంపెనీల్లో పెట్టుబడుల వ్యవహారానికి సంబంధించి హెటిరో కంపెనీ, ఆ సంస్థ డెరైక్టర్ శ్రీనివాసరెడ్డిలపై సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో జరుగుతున్న విచారణ ప్రక్రియను హైకోర్టు నిలిపేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ రాజా ఇలంగో మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. సీబీఐ తమపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ హెటిరో శ్రీనివాసరెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని జస్టిస్ రాజా ఇలంగో విచారించారు. పెట్టుబడుల నిర్ణయాన్ని కంపెనీ డెరైక్టర్‌గా తీసుకున్నారే తప్ప వ్యక్తిగతంగా కాదని శ్రీనివాసరెడ్డి తరఫు సీనియర్ న్యాయవాది టి.నిరంజన్‌రెడ్డి తెలిపారు. వాదనలు విన్న న్యాయమూర్తి వ్యక్తిగత హాజరు నుంచి శ్రీనివాసరెడ్డికి మినహాయింపునివ్వడంతోపాటు ఆయనకు సంబంధించి సీబీఐ కోర్టులో జరుగుతున్న విచారణ ప్రక్రియను కూడా నిలిపేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐని ఆదేశిస్తూ విచారణను జూన్ 14కు వాయిదా వేశారు. -
బి.పి.ఆచార్యపై విచారణ నిలిపివేత
♦ వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ♦ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన హైకోర్టు సాక్షి, హైదరాబాద్: జగన్ కంపెనీల్లో పెట్టుబడుల వ్యవహారంలో అరబిందో, హెటిరో, ట్రైడెంట్ లైఫ్ సెస్సైస్‌కు భూముల కేటాయింపునకు సంబంధించి సీబీఐ నమోదు చేసిన కేసులో నిందితుడిగా ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారి బి.పి.ఆచార్యకు హైకోర్టులో ఊరట లభించింది. ఆయనపై సీబీఐ ప్రత్యేక కోర్టులో జరుగుతున్న విచారణ ప్రక్రియను హైకోర్టు నిలిపివేసింది. వ్యక్తిగత హాజరు నుంచి కూడా మినహాయింపునిచ్చింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ రాజా ఇలంగో బుధవారం మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. సీబీఐ కేసు ను కొట్టేయడంతో పాటు విచారణ ప్రక్రియను నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ ఆచార్య హైకోర్టులో పిటిషన్ వేశారు. దీన్ని జస్టిస్ ఇలంగో విచారించారు. ఆచార్య తరఫు న్యాయవాది టి.ప్రద్యుమ్నకుమార్‌రెడ్డి వాదనలు వినిపించారు. జడ్చర్ల సెజ్‌లో హెటిరో, అరబిందో, ట్రైడెంట్‌లకు భూ కేటాయింపుల్లో అక్రమాలు జరిగాయని సీబీఐ ఆరోపిం చిందన్నారు. ఇందుకు అప్పట్లో ఏపీఐఐసీ ఎండీ హోదాలో ఉన్న పిటిషనర్‌ను బాధ్యులుగా చేసిందన్నారు.సీబీఐ ఆరోపణల్లో వాస్తవం లేదని ప్రద్యుమ్న తెలిపారు. భూ కేటాయింపులు, బదలాయింపులు నిబంధనల ప్రకారమే జరిగాయన్నారు. ఈ వ్యవహారంలో పిటిషనర్ వ్యక్తిగతంగా లబ్ది పొందినట్లు, దురుద్దేశాలతో వ్యవహరించినట్లు సీబీఐ ఎక్కడా చెప్పలేదన్నారు. అందువల్ల ఈ కేసును కొట్టేయడంతోపాటు విచారణ ప్రక్రియను నిలిపేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తి సీబీఐ కోర్టులో ఆచార్యపై జరుగుతున్న విచారణ ప్రక్రియపై స్టే విధించారు. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపునిచ్చారు. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐ ఆదేశిస్తూ తదుపరి విచారణను జూన్ 14కు వాయిదా వేశారు. మధ్యంతర ఉత్తర్వుల పొడిగింపు జగన్ కంపెనీల్లో పెట్టుబడుల వ్యవహారంలో నిందితులుగా ఉన్న పెన్నా పత్రాప్‌రెడ్డి, పి.ఆర్. ఎనర్జీ హోల్డింగ్స్‌పై సీబీఐ కోర్టులో జరుగుతున్న విచారణ ప్రక్రియను నిలిపేస్తూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు పొడిగించింది. ఆ ఉత్తర్వుల గడువు ముగిసిందని, కేసులో పూర్తిస్థాయి వాదనలు వినిపించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని పిటిషనర్లు విన్నవించారు. దీంతో న్యాయస్థానం గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను పొడిగిస్తూ విచారణను జూన్‌కు వాయిదా వేసింది. వ్యక్తిగత హాజరు నుంచి వీర్వాణికి మినహాయింపు ఇందూ-గృహ నిర్మాణ మండలి భూ కేటాయింపుల కేసులో నిందితుడిగా ఉన్న ఎంబసీ రియల్టర్ జితేంద్ర వీర్వాణికి వ్యక్తిగత హాజరు నుంచి హైకోర్టు మినహాయింపునిచ్చింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ రాజా ఇలంగో బుధవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. తనపై సీబీఐ నమోదు చేసిన కేసును కొట్టేయాలంటూ వీర్వాణి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై వాదనలు విన్న న్యాయమూర్తి... వీర్వాణికి వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపునిస్తూ ఉత్తర్వులిచ్చారు. -
అరబిందో నిధుల సేకరణకు ఆమోదం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అరబిందో ఫార్మా రూ. 3,970 కోట్ల (60 కోట్ల డాలర్లు) నిధుల సేకరణకు వాటాదారుల నుంచి అనుమతి లభించింది. గత నెలలో జరిగిన బోర్డు సమావేశంలో వివిధ మార్గాల్లో 60 కోట్ల డాలర్లు సేకరించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. కాగా ఎసిడిటీ నివారణకు వినియోగించే ఫామోటిడిన్ ట్యాబ్లెట్లను అమెరికాలో విక్రయించడానికి అరబిందో ఫార్మాకి యూఎస్ఎఫ్డీఏ తుది అనుమతులను జారీ చేసింది. దీంతో ఇప్పటి వరకు అరబిందో ఫార్మాకి 226 ఏఎన్‌డీఏ అనుమతులు లభించాయి. -
రాజా రమేష్ విజృంభణ
జింఖానా, న్యూస్‌లైన్: అరబిందో జట్టు బౌలర్ రాజా రమేష్ 4 వికెట్లు తీసి ప్రత్యర్థి జట్టుకు చుక్కలు చూపించి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. సాషా స్పోర్ట్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ నిర్వహిస్తున్న కార్పొరేట్ ప్రీమియర్ లీగ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఎయిర్టెల్ జట్టు ప్రత్యర్థి జట్టు బౌలర్ల తాకిడికి 80 పరుగులకే కుప్పకూలింది. అనంతర ం ల క్ష్యఛేదనకు దిగిన అరబిందో జట్టు 86 పరుగులు చేసి విజయం సాధించింది. జట్టులో శేఖర్ (28) మినహా తక్కిన వారు రాణించలేకపోయారు. మరో మ్యాచ్‌లో సిటీ బ్యాంక్ జట్టు ఆటగాడు వికాస్ (43), ముఖేశ్ (36) చెలరేగి జట్టుకు విజయాన్ని చేకూర్చారు. మొదట బ్యాటింగ్‌కు దిగిన ఐవీవై కాంప్టెక్ జట్టు 157 పరుగులు చేయగా, తర్వాత బ్యాటింగ్‌కు దిగిన సిటీ బ్యాంక్ జట్టు 6 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసి విజయం సాధించింది. ఇతర మ్యాచ్‌ల స్కోర్లు డా. రెడ్డీస్: 120 (సుబ్బు 23; సురేష్ 3/22, శ్రీహరి 2/26, జగదీశ్ 2/29), హెచ్డీఎఫ్సీ: 71 (సంతోష్ 23, శ్రీకాంత్ 3/10, సంతోష్ 3/26); స్యూ ఇన్ఫ్రా: 86 (జగదీశ్ 31, రామకృష్ణ 4/13, శ్రీకాంత్ 3/6), గ్లోబల్ డేటా: 88/3 (రాథోర్ 40 నాటౌట్, శ్రీకాంత్ 29 నాటౌట్); మై హోమ్ జువెల్స్: 136/4 (అశ్విన్ 43 నాటౌట్, అంకుర్ 37, అమిత్ 29), హెచ్ఎస్బీసీ: 138 (వినీత్ 36 నాటౌట్ , అభీష్ట 26, చైతన్య 24; శంకర్ 2/18, అభినవ్ 2/25