అరబిందో నిధుల సేకరణకు ఆమోదం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అరబిందో ఫార్మా రూ. 3,970 కోట్ల (60 కోట్ల డాలర్లు) నిధుల సేకరణకు వాటాదారుల నుంచి అనుమతి లభించింది. గత నెలలో జరిగిన బోర్డు సమావేశంలో వివిధ మార్గాల్లో 60 కోట్ల డాలర్లు సేకరించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. కాగా ఎసిడిటీ నివారణకు వినియోగించే ఫామోటిడిన్ ట్యాబ్లెట్లను అమెరికాలో విక్రయించడానికి అరబిందో ఫార్మాకి యూఎస్‌ఎఫ్‌డీఏ తుది అనుమతులను జారీ చేసింది. దీంతో ఇప్పటి వరకు అరబిందో ఫార్మాకి 226 ఏఎన్‌డీఏ అనుమతులు లభించాయి.