Fund-Raising
-
సాయుధ బలగాల సంక్షేమానికి తోడ్పడండి
పుణె: సాయుధ బలగాల సంక్షేమానికి ప్రజలు తోడ్పడాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. శనివారం పుణేలోని రాజ్‌భవన్‌లో జరిగిన ఆర్ముడ్ ఫోర్సెస్ ఫ్లాగ్ డే కార్యక్రమంలో ప్రధాని పాల్గొన్నారు. అక్కడే ఆయన 2016లో నగ్రోటా ఉగ్రదాడిలో నేలకొరిగిన మేజర్ కునాల్ గోసావి భార్య, కుమార్తెలతో మాట్లాడారు. అనంతరం ఫ్లాగ్ డే కార్యక్రమానికి సంబంధించిన 57 నిమిషాల వీడియోను ప్రధాని ట్విట్టర్లో విడుదల చేశారు. ‘ఆర్ముడ్ ఫోర్సెస్ ఫ్లాగ్ డే సందర్భంగా అత్యుత్తమ ధైర్య సాహసాలు చూపుతున్న సాయుధ బలగాలకు, వారి కుటుంబాలకు నా సెల్యూట్. మన బలగాల సంక్షేమానికి మీరు కూడా సాయం అందించాల్సిందిగా కోరుతున్నా’ అని పేర్కొన్నారు. అనంతరం పోలీస్ డైరెక్టర్ జనరళ్లు, ఇన్స్పెక్టర్ జనరళ్ల జాతీయ సదస్సులో ప్రధాని మోదీ మాట్లాడారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చిలో జరిగిన ఈ సదస్సుకు హోం మంత్రి అమిత్ షా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కూడా హాజరయ్యారు. శుక్రవారం ప్రారంభమైన ఈ సదస్సు ఆదివారంతో ముగియనుంది. -
జూనియర్ అంబానీ మ్యాజిక్: జాక్‌పాట్
సాక్షి ముంబై: అనిల్ అంబానీ పెద్ద కుమారుడు, రిలయన్స్ క్యాపిటల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ డైరెక్టర్ అన్మోల్ అంబానీ (26) ఫస్ట్ డీల్లోనే అదరహో అనిపించుకున్నారు. 25 రెట్ల లాభాలతో ఫస్ట్ ఫండ్ రైజింగ్ డీల్లోనే జాక్‌పాట్ కొట్టేశారు. రిలయన్స్ గ్రూపు అధికార ప్రతినిధి ఈ లావాదేవీని ధృవీకరించారు. కోడ్‌మాస్టర్స్ సంస్థలోని వాటాను యూరోప్, యూకేకు చెందిన 30కి పైగా సంస్థాగత ఇన్వెస్టర్లు కొనుగోలు చేశారని సంస్థ వెల్లడించింది. ఇందుకు గాను సుమారు రూ.5 వేల కోట్ల వరకూ బిడ్లు దాఖలైనట్టు తెలిపారు. బ్రిటీష్ గేమింగ్ డెవలప్మెంట్ సంస్థ కోడ్‌మాస్టర్స్‌లో రిలయన్స్ 60 శాతం వాటాను రూ.1700 కోట్లకు విక్రయించారు. ఏకంగా 25 రెట్లకు పైగా లాభానికి ఈ వాటాను అమ్మారు. దీంతో ముఖ్యంగా రుణ సంక్షోభంలో కూరుకుపోయి ఇబ్బందులుపడుతున్న అనిల్ అంబానీ పుత్రుడి విజయంతో సంతోషంగా ఉన్నారు. ఎఫ్ 1 సిరీస్ వీడియో గేమ్స్‌ను తయారీ దిగ్గజ సంస్థ కోడ్‌మాస్టర్స్‌లో 2009లో మెజార్టీ వాటాను అడాగ్ గ్రూప్ సంస్థ సుమారు రూ.100 కోట్లకు కొనుగోలు చేసింది. తాజాగా ఈ వాటాను కేవలం 60శాతం వాటాను 17వందల కోట్ల రూపాయలకు విక్రయించడం వ్యాపార వర్గాల్లో విశేషంగా నిలిచింది. కాగా ఈ డీల్ తరువాత కోడ్‌మాస్టర్స్ లో రూ.850 కోట్లు విలువైన 30 శాతం వరకూ వాటా అడాగ్ గ్రూప్ రిలయన్స్ సొంతం. 1986లో కోడ్ మాస్టర్స్ ఏర్పాటైంది. సుమారు 500మంది ఉద్యోగులతో ఇంగ్లాండ్‌లో మూడు, మలేషియాలో ఒక కార్యాలయంతో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. 2016 నాటికి, 31 మిలియన్ పౌండ్లుగా ఉన్న కోడ్‌మాస్టర్స్ ఆదాయం2018 ఆర్థిక సంవత్సరం నాటికి 64 మిలియన్ పౌండ్లతో రెట్టింపు వృద్ధిని నమోదు చేసింది. అలాగే కోడ్‌మాస్టర్స్ తో పాటు హాలీవుడ్ ఫిలిం స్టూడియో డ్రీమ్ వర్క్స్‌లో కూడా రిలయన్స్ గ్రూప్ పెట్టుబడులు పెట్టింది. -
పవన్‌కల్యాణ్ పేరుతో మోసం
పోలీసుస్టేషన్లలో బాధితుల ఫిర్యాదు తిరుపతి క్రైం : ప్రముఖ సినీనటుడు పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ అభిమాని అంటూ నగరంలో ఓ వ్యక్తి చందాలు వసూలు చేస్తున్నాడని అలిపిరి, ఎమ్మార్‌పల్లి పోలీస్స్టేషన్లలో మంగళవారం పవన్‌కల్యాణ్ అభిమానులు నాని, మనోజ్ ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. కొన్ని రోజులుగా నగరంలో పవన్ కల్యాణ్ అభిమాని అని చెబుతూ నానికి, మనోజ్‌కు వారి స్నేహితులకు పసుపులేటి సురేష్ పరిచయమయ్యాడు. పవన్‌కల్యాణ్‌తో ఫొటోలు తీయిస్తామని, పవన్‌కల్యాణ్ తనతో సన్నిహితంగా ఉంటాడని నమ్మబలికాడు. మార్చి 14న జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నగరంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తామని, ఇందుకోసం నగదు ఇవ్వాలని కోరాడు. ఆ మేరకు ఫిర్యాదుదారులు, వారి స్నేహితులు రూ. 27 వేలు నగదు ఇచ్చారు. తరువాత ఎటువంటి కార్యక్రమాలు చేయకపోవడంతో సురేష్‌పై అనుమానం వచ్చింది. ఫోన్ చేయగా స్విచ్ఆఫ్ అని వచ్చింది. దీంతో ఇంటి ఆచూకీ తెలుసుకుని వెళ్లగా ఇల్లు తాళం వేసి ఉంది. మోసపోయామని తెలుసుకుని మరో అభిమానికి ఇలా జరగకూడదని ఎమ్మార్‌పల్లి ఎస్ఐ ఇమ్రాన్బాషాకు, అలిపిరి ఎస్ఐ మల్లికార్జునరెడ్డికి ఫిర్యాదు చేశారు. -
అరబిందో నిధుల సేకరణకు ఆమోదం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అరబిందో ఫార్మా రూ. 3,970 కోట్ల (60 కోట్ల డాలర్లు) నిధుల సేకరణకు వాటాదారుల నుంచి అనుమతి లభించింది. గత నెలలో జరిగిన బోర్డు సమావేశంలో వివిధ మార్గాల్లో 60 కోట్ల డాలర్లు సేకరించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. కాగా ఎసిడిటీ నివారణకు వినియోగించే ఫామోటిడిన్ ట్యాబ్లెట్లను అమెరికాలో విక్రయించడానికి అరబిందో ఫార్మాకి యూఎస్ఎఫ్డీఏ తుది అనుమతులను జారీ చేసింది. దీంతో ఇప్పటి వరకు అరబిందో ఫార్మాకి 226 ఏఎన్‌డీఏ అనుమతులు లభించాయి. -
చందాలకు వచ్చి.. పోలీసులకు చిక్కి
ముగ్గురు మాజీ నక్సల్స్ అరెస్ట్ ఎయిర్‌గన్, టాయ్‌పిస్టల్ స్వాధీనం ములుగు : జనశక్తి పేరిట వ్యాపారుల వద్ద చందాలు వసూలు చేసేందుకు వచ్చిన ముగ్గురు మాజీ నక్సలైట్లు పోలీసులకు చిక్కారు. సులభంగా డబ్బు సంపాదించాలని పథకం రచించి కటకటాలపాలయ్యూరు. ములుగు డీఎస్పీ బానోతు రాజమహేంద్రనాయక్ కథనం ప్రకారం.. వెంకటాపూర్ మండలంలోని పెద్దాపూర్‌కు చెందిన బొడగాని సారంగం, ములుగు మండలం రాయినిగూడెంకు చెందిన యాట కుమారస్వామి, కరీంనగర్ జిల్లా మహముత్తారం గ్రామానికి చెందిన పల్లెర్ల తిరుపతి గతంలో నక్సల్స్ దళాల్లో పనిచేసి లొంగిపోయారు. ముగ్గురు భూపాలపల్లి మండలం నేరేడుపల్లికి చెందిన మీనవేని ఓదేలుతో కలిసి రెండు నెలల క్రితం కరీంనగర్ జిల్లా మహాముత్తారం మండలం నర్సింగాపూర్ గ్రామానికి చెందిన అత్తని రాజు ఆధ్వర్యంలో సమావేశమయ్యారు. జనశక్తి పేరుతో చందాలు వసూలు చేయాలని నిర్ణయించుకుని, ఆయుధాల కోసం ప్రయత్నిం చారు. తన వద్ద ఎయిర్‌గన్ ఉందని యాట కుమారస్వామి చెప్పగా.. సారంగం మరో టాయ్‌పిస్టల్‌ను సమకూర్చాడు. రెండింటిని సారంగం వెంకటాపురం మండలం పెద్దాపూర్ గ్రామానికి చెందిన దుంపాల నర్సయ్య ఇంటి వెనుక గోతి తీసి పాతిపెట్టారు. ప్రణాళిక ప్రకారం వాల్‌పోస్టర్లను ప్రింట్ చేయించారు. ఈ క్రమంలోనే పోలీసులకు సమాచారం అందడంతో నర్సయ్య ఇంటి వెనక దాచిపెట్టిన డమ్మీ పిస్టల్, ఎరుుర్‌గన్‌ను పోలీసులు శుక్రవారం స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టారు. ఈ క్రమంలో శనివారం ఉదయం వెంకటాపురం పోలీసులు, సివిల్ ఫోర్స్ సిబ్బంది తాళ్లపాడు జంక్షన్లో తనిఖీలు నిర్వహిస్తుండగా ముగ్గురు వ్యక్తులు ఆటోలో అనుమానాస్పదంగా కనిపించారు. వారిని సోదా చేయగా జనశక్తి పార్టీకి చెందిన మూడు వాల్‌పోస్టర్లు లభించాయి. వారు నేరాన్ని అంగీకరించడంతో అరెస్ట్ చేశారు. 176/2014,యూ/ఎస్ 25(1),(బీ) ఇండియన్ ఆర్మ్స్ చట్టాల కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. కాగా మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారని, వారిని కూడా త్వరలో అదుపులోకి తీసుకుంటామని డీఎస్పీ వెల్లడించారు. సమావేశంలో ములుగు సీఐ శ్రీధర్‌రావు, ఏటూర్‌నాగారం సీఐ కిషోర్‌కుమార్, వెంకటాపురం ఎస్సై ఎండీ హన్నన్, గణపురం ఎస్సై భూక్య రవికుమార్, సిబ్బంది ఉన్నారు.