రాజా రమేష్ విజృంభణ | ramesh Raja boom Aurobindo Team win | Sakshi
Sakshi News home page

రాజా రమేష్ విజృంభణ

Published Mon, Aug 26 2013 12:24 AM | Last Updated on Fri, Sep 1 2017 10:07 PM

రాజా రమేష్ విజృంభణ

రాజా రమేష్ విజృంభణ

జింఖానా, న్యూస్‌లైన్: అరబిందో జట్టు బౌలర్ రాజా రమేష్ 4 వికెట్లు తీసి ప్రత్యర్థి జట్టుకు చుక్కలు చూపించి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. సాషా స్పోర్ట్స్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్వహిస్తున్న కార్పొరేట్ ప్రీమియర్ లీగ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఎయిర్‌టెల్ జట్టు ప్రత్యర్థి జట్టు బౌలర్ల తాకిడికి 80 పరుగులకే కుప్పకూలింది. అనంతర ం ల క్ష్యఛేదనకు దిగిన అరబిందో జట్టు 86  పరుగులు చేసి విజయం సాధించింది. జట్టులో శేఖర్ (28) మినహా తక్కిన వారు రాణించలేకపోయారు.
 
 మరో మ్యాచ్‌లో సిటీ బ్యాంక్ జట్టు ఆటగాడు వికాస్ (43), ముఖేశ్ (36) చెలరేగి జట్టుకు విజయాన్ని చేకూర్చారు. మొదట బ్యాటింగ్‌కు దిగిన ఐవీవై కాంప్టెక్ జట్టు 157 పరుగులు చేయగా, తర్వాత బ్యాటింగ్‌కు దిగిన సిటీ బ్యాంక్ జట్టు 6 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసి విజయం సాధించింది.
 
 ఇతర మ్యాచ్‌ల స్కోర్లు
  డా. రెడ్డీస్: 120 (సుబ్బు 23; సురేష్ 3/22, శ్రీహరి 2/26, జగదీశ్ 2/29), హెచ్‌డీఎఫ్‌సీ: 71 (సంతోష్ 23, శ్రీకాంత్ 3/10, సంతోష్ 3/26);   స్యూ ఇన్‌ఫ్రా: 86 (జగదీశ్ 31, రామకృష్ణ 4/13, శ్రీకాంత్ 3/6), గ్లోబల్ డేటా: 88/3 (రాథోర్ 40 నాటౌట్, శ్రీకాంత్ 29 నాటౌట్);  మై హోమ్ జువెల్స్: 136/4 (అశ్విన్ 43 నాటౌట్, అంకుర్ 37, అమిత్ 29), హెచ్‌ఎస్‌బీసీ: 138 (వినీత్ 36 నాటౌట్ , అభీష్ట 26, చైతన్య 24; శంకర్ 2/18, అభినవ్ 2/25 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement