హైదరాబాద్: ఔషధ రంగ దిగ్గజం అరబిందో ఫార్మా ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేస్తున్న బెంజైల్‌పెన్సిలిన్ తయారీ ప్లాంటు 2024 మార్చి నాటికి సిద్ధం కానుంది. ఈ ప్రాజెక్టుకు కంపెనీ రూ.2,000 కోట్లు వెచ్చిస్తోంది. ఇప్పటికే రూ.500 కోట్లు ఖర్చు అయింది. 15,000 టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యంతో ఇది రానుంది. ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల పథకం కింద ఈ ప్లాంటుకు ఆమోదం లభించింది.
పైలట్ ప్రాతిపదికన తయారీ 2023 అక్టోబర్ నుంచి మొదలవుతుందని అరబిందో ఫార్మా సీఎఫ్‌వో ఎస్.సుబ్రమణియన్ తెలిపారు. కాగా, ఈ ఆర్థిక సంవత్సరంలో యూఎస్‌ఏలో 20కిపైగా ఉత్పత్తులను విడుదల చేసే అవకాశం ఉందని అరబిందో అనుబంధ కంపెనీ యూగియా ఫార్మా స్పెషాలిటీస్ సీఈవో యుగంధర్ పువ్వాల తెలిపారు. తక్కువ పోటీ ఉన్న ఉత్పత్తులకు ఆమోదం లభించే చాన్స్ ఉందన్నారు.
చదవండి: ఆకాశమే హద్దురా.. అక్కడి ప్లాట్ ధరలకు రెక్కలు.. ఏకంగా 5 రెట్లు పెరగడంతో..
Comments
Please login to add a commentAdd a comment