Pharmacy Company
-
భారీ షాక్: డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్‌పై అమెరికాలో దావా
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రెవ్లిమిడ్ ఔషధానికి సంబంధించి డాక్టర్ రెడ్డీస్ ల్యాబోరేటరీస్ (డీఆర్ఎల్)తో పాటు సెల్జీన్, బ్రిస్టల్ మయర్స్ స్క్విబ్ తదితర దేశీ జనరిక్ ఔషధ కంపెనీలపై అమెరికాలో యాంటీ–ట్రస్ట్ దావా దాఖలైంది. రెవ్లిమిడ్ పేటెంట్ వివాద పరిష్కార విషయంలో ఆయా సంస్థలు వ్యవహరించిన తీరును తప్పుబడుతూ నవంబర్ 18న ఈ దావా దాఖలైనట్లు డీఆర్ఎల్ వెల్లడించింది. తమపై ఆరోపణల్లో ఎలాంటి పస లేదని, లిటిగేషన్‌ను దీటుగా ఎదుర్కొంటామని డీఆర్ఎల్ స్పష్టం చేసింది. చదవండి: మరో టెక్ దిగ్గజం సంచలన నిర్ణయం: ఉద్యోగులకు ఇక గడ్డుకాలమేనా? -
16 నెలల్లో ఏపీలో అరబిందో ప్లాంటు
హైదరాబాద్: ఔషధ రంగ దిగ్గజం అరబిందో ఫార్మా ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేస్తున్న బెంజైల్పెన్సిలిన్ తయారీ ప్లాంటు 2024 మార్చి నాటికి సిద్ధం కానుంది. ఈ ప్రాజెక్టుకు కంపెనీ రూ.2,000 కోట్లు వెచ్చిస్తోంది. ఇప్పటికే రూ.500 కోట్లు ఖర్చు అయింది. 15,000 టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యంతో ఇది రానుంది. ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల పథకం కింద ఈ ప్లాంటుకు ఆమోదం లభించింది. పైలట్ ప్రాతిపదికన తయారీ 2023 అక్టోబర్ నుంచి మొదలవుతుందని అరబిందో ఫార్మా సీఎఫ్‌వో ఎస్.సుబ్రమణియన్ తెలిపారు. కాగా, ఈ ఆర్థిక సంవత్సరంలో యూఎస్ఏలో 20కిపైగా ఉత్పత్తులను విడుదల చేసే అవకాశం ఉందని అరబిందో అనుబంధ కంపెనీ యూగియా ఫార్మా స్పెషాలిటీస్ సీఈవో యుగంధర్ పువ్వాల తెలిపారు. తక్కువ పోటీ ఉన్న ఉత్పత్తులకు ఆమోదం లభించే చాన్స్ ఉందన్నారు. చదవండి: ఆకాశమే హద్దురా.. అక్కడి ప్లాట్ ధరలకు రెక్కలు.. ఏకంగా 5 రెట్లు పెరగడంతో.. -
చెదిరిన ప్రేమ‘స్వప్నం’
► మోసగించిన భర్త ► అత్తింటి ఎదుట బాధితురాలి న్యాయపోరాటం ► ముఖం చాటేసిన మెట్టింటివారు ► తీవ్రఅస్వస్థతో ఆస్పత్రిపాలు ► ఆరోగ్య పరిస్థితి విషమం ► విదేశాలకు పయనమైన ప్రబుద్ధుడు..! సిరిసిల్ల టౌన్ : ప్రేమించి పెళ్లి చేసుకుని ఏడాది పాటు కాపురం చేసిన ప్రబుద్ధుడు చెప్పుడు మాటలు విని భార్యను వదిలి ఎటో వెళ్లిపోయాడు. తనకు న్యాయం చేయూలని బాధితురాలు బుధవారం స్థానిక మెట్టింటి ఎదుట న్యాయం పోరాటం చేసింది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. స్థానిక సంజీవయ్యనగర్‌కు చెందిన నీరటి స్వప్నకు గతంలోనే వివాహంకాగా భర్త వదిలివేశారు. అదేప్రాంతానికి చెందిన పెరుమాండ్ల కార్తీక్ ఆమెను ప్రేమించాడు. ఏడాది క్రితం ఇంట్లో ఎవరికీ చెప్పకుండా ఎటూ వెళ్లి పెళ్లి చేసుకున్నారు. తర్వాత హైదరాబాద్ సమీపంలోని షాద్‌నగర్‌లో కాపురం పెట్టారు. అక్కడే ఓ ప్రైవేటు ఫార్మసి కంపెనీలో కార్తీక్ ఉద్యోగం చేసేవాడు. కొద్దిరోజులుగా కార్తీక్ తండ్రి శ్రీనివాస్ షాద్‌నగర్‌కు వెళ్లి తన కుమారుడు.. కోడలు వద్ద ఉంటూ వస్తున్నాడు. ప్రస్తుతం స్వప్న నాలుగు నెలల గర్భవతి. అక్కడే ఓప్రైవేటు ఆస్పత్రిలో చూపించగా..రూ.15వేలు ఖర్చుఅయ్యాయి. దీంతో కార్తీక్ తండ్రి శ్రీనివాస్ సలహామేరకు భార్యాభర్తలు శుక్రవారం సిరిసిల్ల ఏరియాస్పత్రికి వచ్చారు. అక్కడే చికిత్స కోసం స్వప్నను చేర్పించిన కార్తీక్.. అదేరాత్రి నుంచి కనిపించకుండా పోయాడు. స్వప్నను ఇంటికి తీసుకెళ్లేందుకు ఎవరూ రాకపోవడంతో ఆస్పత్రి సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు ఆమెను కార్తీక్ ఇంటికి తీసుకెళ్లారు. ఆమెను చూసిన కార్తీక్ తండ్రి శ్రీనివాస్ స్వప్నను దుర్భషలాడుతూ..ఇంట్లోంచి వెళ్లగొట్టి తాళం వేసుకుపోయాడు. చేసేది లేక ఆమె అత్తింటి ఎదుట బైఠారుుంచింది. తనకు న్యాయం చేయూలని డిమాండ్ చేసింది. అలసిపోరుు కళ్లు తిరిగి పడిపోయింది. వెంటనే స్థానికులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఒంట్లో సత్తువ తగ్గిన ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యుల సలహామేరకు కరీంనగర్‌లోని మరో ఆస్పత్రికి తరలించారు. కాగా కార్తీక్ ఇతర దేశం వెళ్లడానికి వీసా పొందాడని, రెండురోజుల్లోనే ప్రయాణానికి సిద్ధమైనట్లు తెలిసింది. స్వప్న తన న్యాయం కావాలని వేడుకుంటోంది. -
‘మూషిక్’వాహనం
భలే బుర్ర మూషిక వాహనాన్ని అధిరోహించి వినాయకుడు ముల్లోకాలూ తిరిగినట్లు పురాణాల్లో చదువుకున్నాం. వినాయకుడు అధిరోహించిన మూషికం సజీవ వాహనం. దానికి కడుపు నిండా ఆహారం తప్ప ఇంధనం అక్కర్లేదు. కానీ మన వాహనాలు అలా కాదు కదా! ఇంధనానికి కొరత తీవ్రమవుతున్న ఈ రోజుల్లో తక్కువ ఇంధనంతో అత్యధిక దూరం ప్రయాణించే వాహనాలను చాలా కంపెనీలు రూపొందిస్తున్నాయి. వాటి రూప కల్పనకు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నాయి. అయితే, పెద్దగా ఖర్చు లేకుండానే ఈ ‘మూషిక్’ వాహనాన్ని సృష్టించాడు మైసూరుకు చెందిన సంతోష్. ఫొటోలోని ‘మూషిక్’ వాహనంపై కనిపిస్తున్న యువకుడు ఇతగాడే. తొలుత సంతోష్ ఒక ఫార్మసీ కంపెనీలో పనిచేసేవాడు. ఇతగాడు సృష్టించిన ‘మూషిక్’... ఒక అధునాతన బైక్. దీని తయారీకి సంతోష్ పెద్దగా కష్టపడిందేమీ లేదు. పాతబడ్డ మోటార్ సైకిళ్ల విడి భాగాలను తనకు కావలసిన రీతిలో అమర్చాడు. పెట్రోల్ ట్యాంకు లాంటివేమీ లేకుండా, బ్యాటరీతో నడిచేలా తీర్చిదిద్దాడు. అయితే, దీనిని నడపడానికి మాత్రం ఎవరైనా సరే, ఈ ఫొటోలో ఉన్న భంగిమలో మార్చుకోవాల్సిందే! ఎందుకంటే, దీని హ్యాండిల్ ముందుచక్రం ఇరుసును అతుక్కుని ఉంటుంది మరి. ఈ అధునాతన ‘మూషిక్’ వాహనాన్ని రూపొందించిన సంతోష్‌కు ఇంజినీరింగ్‌లో ఎలాంటి డిగ్రీ లేదు. అయినా, ఈ వాహనం ఇతగాడి పేరును లిమ్కాబుక్‌లోకి ఎక్కించింది. సంతోష్ ఇలాంటివే మరికొన్ని విలక్షణమైన బైక్‌లను రూపొందించాడు. తన తండ్రికి మోటార్ సైకిళ్లంటే తగని ఇష్ట మని, తనకు కూడా చిన్న వయసు నుంచే బైక్‌లపై ఇష్టం పెరిగిందని, తన తండ్రి స్ఫూర్తితోనే కొత్త కొత్త బైక్‌లను రూపొం దిస్తున్నానని చెబుతున్నాడు సంతోష్.