చెదిరిన ప్రేమ‘స్వప్నం’
► మోసగించిన భర్త
► అత్తింటి ఎదుట బాధితురాలి న్యాయపోరాటం
► ముఖం చాటేసిన మెట్టింటివారు
► తీవ్రఅస్వస్థతో ఆస్పత్రిపాలు
► ఆరోగ్య పరిస్థితి విషమం
► విదేశాలకు పయనమైన ప్రబుద్ధుడు..!
సిరిసిల్ల టౌన్ : ప్రేమించి పెళ్లి చేసుకుని ఏడాది పాటు కాపురం చేసిన ప్రబుద్ధుడు చెప్పుడు మాటలు విని భార్యను వదిలి ఎటో వెళ్లిపోయాడు. తనకు న్యాయం చేయూలని బాధితురాలు బుధవారం స్థానిక మెట్టింటి ఎదుట న్యాయం పోరాటం చేసింది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. స్థానిక సంజీవయ్యనగర్‌కు చెందిన నీరటి స్వప్నకు గతంలోనే వివాహంకాగా భర్త వదిలివేశారు. అదేప్రాంతానికి చెందిన పెరుమాండ్ల కార్తీక్ ఆమెను ప్రేమించాడు. ఏడాది క్రితం ఇంట్లో ఎవరికీ చెప్పకుండా ఎటూ వెళ్లి పెళ్లి చేసుకున్నారు. తర్వాత హైదరాబాద్ సమీపంలోని షాద్‌నగర్‌లో కాపురం పెట్టారు. అక్కడే ఓ ప్రైవేటు ఫార్మసి కంపెనీలో కార్తీక్ ఉద్యోగం చేసేవాడు. కొద్దిరోజులుగా కార్తీక్ తండ్రి శ్రీనివాస్ షాద్‌నగర్‌కు వెళ్లి తన కుమారుడు.. కోడలు వద్ద ఉంటూ వస్తున్నాడు. ప్రస్తుతం స్వప్న నాలుగు నెలల గర్భవతి. అక్కడే ఓప్రైవేటు ఆస్పత్రిలో చూపించగా..రూ.15వేలు ఖర్చుఅయ్యాయి.
దీంతో కార్తీక్ తండ్రి శ్రీనివాస్ సలహామేరకు భార్యాభర్తలు శుక్రవారం సిరిసిల్ల ఏరియాస్పత్రికి వచ్చారు. అక్కడే చికిత్స కోసం స్వప్నను చేర్పించిన కార్తీక్.. అదేరాత్రి నుంచి కనిపించకుండా పోయాడు. స్వప్నను ఇంటికి తీసుకెళ్లేందుకు ఎవరూ రాకపోవడంతో ఆస్పత్రి సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు ఆమెను కార్తీక్ ఇంటికి తీసుకెళ్లారు. ఆమెను చూసిన కార్తీక్ తండ్రి శ్రీనివాస్ స్వప్నను దుర్భషలాడుతూ..ఇంట్లోంచి వెళ్లగొట్టి తాళం వేసుకుపోయాడు.
చేసేది లేక ఆమె అత్తింటి ఎదుట బైఠారుుంచింది. తనకు న్యాయం చేయూలని డిమాండ్ చేసింది. అలసిపోరుు కళ్లు తిరిగి పడిపోయింది. వెంటనే స్థానికులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఒంట్లో సత్తువ తగ్గిన ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యుల సలహామేరకు కరీంనగర్‌లోని మరో ఆస్పత్రికి తరలించారు. కాగా కార్తీక్ ఇతర దేశం వెళ్లడానికి వీసా పొందాడని, రెండురోజుల్లోనే ప్రయాణానికి సిద్ధమైనట్లు తెలిసింది. స్వప్న తన న్యాయం కావాలని వేడుకుంటోంది.