మంధనాకు సల్మాన్ జోరు
ఇటీవల భారీ నష్టాలతో కుదైలైన టెక్స్ టైల్ కంపెనీని బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ ఆదుకున్నాడు. సల్మాన్ కు చెందిన 'బీయింగ్ హ్యూమన్' ఫౌండేషన్ తో ఒప్పందం ఖరారు కావడంతో వరుసగా ఏడో రోజూ కూడా మంధనా ఇండస్ట్రీస్ కంపెనీ అప్పర్ సర్క్యూట్ ను తాకింది. బలమైన కొనుగోళ్లతో ఇవాల్టి బుల్ మార్కెట్ లోఈ షేర్లు 5 శాతం లాభపడ్డాయి. బీయింగ్ హ్యూమన్ బ్రాండ్ కింద వస్త్ర ఉత్పత్తులను విక్రయించేందుకు గత వారం ఒప్పందం కుదరినట్టు సంస్థ ప్రకటించింది. తమ అమ్మకాలు సాగించేందుకు మంధర రీటైల్ వెంచర్స్ ప్రయివేట్ లిమిటెడ్ (ఎంఆర్ వీఎల్) ప్రత్యేక లైసెన్సుదారు అని ఒక ప్రకటనలో తెలిపింది.
కాగా 2012 లో మంధనా ఇండస్ట్రీస్ సల్మాన్ ఖాన్ ఛారిటబుల్ ట్రస్టు తో 'బీయింగ్ హ్యూమన్' బ్రాండ్ పేరుతో చేనేత విక్రయాలను ప్రారంభించింది. ఈ ఆర్థిక సం.రం తొలి క్వార్టర్ లో రూ.57 కోట్ల నికర లాభాలను ప్రకటించింది. రూ.1,646.61 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. ఈ ఏడాది జనవరిలో 70శాతం నష్టాలతో 52 వారాల కనిష్టాన్ని తాకింది.