
రోగ నిరోధకత చికిత్సతో హెచ్‌ఐవీ నుంచి రక్షణ
అత్యాచార బాధితులకు ఘటన జరిగిన ఎనిమిది గంటల్లోపు రోగనిరోధకత చికిత్స అందిస్తే హెచ్‌ఐవీ ఇన్ఫెక్షన్ నుంచి రక్షించవచ్చని
ముంబై: అత్యాచార బాధితులకు ఘటన జరిగిన ఎనిమిది గంటల్లోపు రోగనిరోధకత చికిత్స అందిస్తే హెచ్‌ఐవీ ఇన్ఫెక్షన్ నుంచి రక్షించవచ్చని ఎయిడ్స్ సొసైటీ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు డాక్టర్ ఈశ్వర్ గిలాడ ప్రకటించారు. సరైన అవగాహన లేకపోవడం, సంబంధిత నిబంధనలు లేకపోవడంతో భారత్‌లాంటి దేశాల్లో బాధితులకు ఇలాంటి చికిత్స అందడంలేదని ఆయన అన్నారు. బాధితులకు చట్టబద్ధంగా అందిస్తున్న చికిత్సలకు తోడుగా పోస్ట్-ఎక్స్‌పోజర్ ప్రొఫిలాక్సిస్(పెప్) చేస్తే వారికి ప్రాణాపాయం నుంచి కాపాడవచ్చని ఆయన ఆదివారం ఆయన ముంబైలో పీటీఐతో చెప్పారు. పెప్‌పై అవగాహన కల్పించేందుకు శనివారం నుంచి ముంబైలో కార్యక్రమాన్ని చేపట్టారు. జాతీయ నేర గణాంకాల విభాగం వెల్లడించిన లెక్కల ప్రకారం గత ఏడాది దేశవ్యాప్తంగా 36,735 రేప్ కేసులు నమోదయ్యాయి.