హెచ్‌ఐవీ, ఎయిడ్స్ నియంత్రణ కోసం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, జిల్లా ఎయిడ్స్ నియంత్రణ సంస్థ చేపడుతున్న కార్యక్రమాలు మంచి ఫలితాలను అందిస్తున్నాయి.
నల్లగొండ టౌన్ :హెచ్‌ఐవీ, ఎయిడ్స్ నియంత్రణ కోసం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, జిల్లా ఎయిడ్స్ నియంత్రణ సంస్థ చేపడుతున్న కార్యక్రమాలు మంచి ఫలితాలను అందిస్తున్నాయి. దీంతో జిల్లాలో హెచ్‌ఐవీ బాధితుల సంఖ్య గణనీయంగా తగ్గుముఖం పట్టింది. గత సంవత్సరం(2013-14)లో జిల్లాలో 1832 హెచ్‌ఐవీ కేసులు నమోదు కాగా, ఈ ఏడాది(2014-15) ఇప్పటి వరకు 1029 కేసులు మాత్రమే నమోదయ్యాయి. 2004-05లో హెచ్‌ఐవీ బాధితుల సంఖ్య 2074గా ఉంది.
జిల్లాలో 105 పరీక్షల కేంద్రాలు..
జిల్లా వ్యాప్తంగా పీపీటీసీటీలు 5, ఐసీటీసీలు 14, ఎఫ్‌ఐఐసీటీసీలు 72, పీపీపీలు 11, ఒక మొబైల్ ఐసీటీసీ సెంటర్‌లతో పాటు మొత్తం 105 సెంటర్‌లలో హెచ్‌ఐవీ పరీక్షలు నిర్వహిస్తున్నారు. జిల్లా కేంద్రంలోని హెడ్‌క్వార్టర్ హాస్పిటల్‌లో ఏఆర్‌టీ సెంటర్, అదే విధంగా భువనగిరి, మిర్యాలగూడ, సూర్యాపేట ఏరియా ఆస్పత్రులలో మూడు లింకెడ్ ఏఆర్‌టీ సెంటర్‌లు పనిచేస్తున్నాయి. వీటి ద్వారా ఎయిడ్స్ పాజి టీవ్ బాధితులకు ఉచిత వైద్య పరీక్షలతో, ఉచిత మందులు, గ్రూప్ కౌన్సిలింగ్, వ్యక్తిగత కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారు. దాంతో పాటు ఏఆర్‌టీ సెంటర్‌లో సీడీ-4 పరీక్షలను ఉచి తంగా నిర్వహిస్తున్నారు. జిల్లాలోని 72 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ఫిసిలీటీ ఇంటిగ్రేటెడ్ కౌన్సిలింగ్ అండ్ టెస్టింగ్ సెంటర్(ఎఫ్‌ఐసీటీసీ)లు, 13 ప్రైవేటు ఆస్పత్రులలో పబ్లిక్ ప్రైవేటు పార్టనర్‌షిప్ సెంటర్(పీపీపీ)లు ఉన్నాయి. ఈ పరీ క్షా కేంద్రాల ద్వారా హెచ్‌ఐవీ, ఎయిడ్స్ పరీక్షలు నిర్వహించడంతో పాటు గర్బిణులకు, సామాన్య ప్రజ లు, ప్రమాదకర ప్రవర్తన కలిగిన వ్యక్తులు ఉచితంగా పరీక్షలు నిర్వహించి హెచ్‌ఐవీ పాజిటీవ్ కలిగిన వ్యక్తులకు కౌన్సిలింగ్‌ను నిర్వహిస్తున్నారు. అవగాహన కోసం వివిధ కార్యక్రమాలు చేపడుతూ హెచ్‌ఐవీ, ఎయిడ్స్ నియంత్రణ కోసం కృషి చేస్తుండడంతో గతంలో కంటే ప్రస్తు తం హెచ్‌ఐవీ పాజిటీవ్ కేసుల నమోదు గణనీయంగా తగ్గింది.
నేడు జిల్లా కేంద్రంలో ర్యాలీ
ప్రపంచ ఎయిడ్స్ నివారణ దినం సందర్భంగా సోమవారం జిల్లా కేంద్రంలో అవగాహన ర్యాలీ నిర్వహిస్తున్నారు. స్థానిక జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రి వద్ద జిల్లా కలెక్టర్ టి.చిరంజీవులు ర్యాలీని ప్రారంభిస్తారు. ఎన్జీ కళాశాల వరకు కొనసాగుతుంది.
నివారణ ఒక్కటే మార్గం : డాక్టర్ విజయ్‌కుమార్ అడిషనల్ డీఎంహెచ్‌ఓ(ఎయిడ్స్‌అండ్ లెప్రసీ)
ఎయిడ్స్‌ను అవగాహనతో నివారించవచ్చు. ముఖ్యంగా యువతీయువకులు సురక్షిత శృంగార పద్ధతులు పాటిం చాలి. సురక్షితమైన రక్తాన్ని మాత్రమే ఎక్కించుకోవాలి. పాజిటీవ్ వ్యక్తులు ఏఆర్‌టీ సెంటర్‌లో అందజేసే మందులు క్రమం తప్పకుండా వాడడం ద్వారా తమ జీవితకాలాన్ని పెంచుకోవచ్చు. బోగస్ ప్రకటనలను నమ్మి మొసపోవద్దు.
ప్రపంచ ఎయిడ్స్ నివారణ దినోత్సవాన్ని పురస్కరిం చుకుని కోదాడలోని తేజ టాలెంట్ స్కూల్‌కు చెందిన విద్యార్థులు వ్యాధిపై అవగాహన కల్పించడానికి వినూత్నంగా ప్రయత్నించారు. నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్(నాకో) రూపంలో ఇలా కూర్చున్నారు.
బాధితుల సంరక్షణ ఇలా..
హెచ్‌ఐవీ పాజిటీవ్ బాధితులను జిల్లా కేంద్రంలోని ఏఆర్‌టీ సెంటర్ లేదా సూర్యాపేటలోని ఏఆర్‌టీ సెంటర్‌లకు పంపిస్తారు. అక్కడ వైద్యాధికారులు వారికి ఉచితంగా సీడీ-4 పరీక్షలు చేసి కౌన్సెలింగ్ ఇస్తారు. అలాగే అవసరమైన మందులు ఉచితంగా అందజేస్తారు. 250 కంటే సీడీ-4 కణాలు తక్కువ ఉన్నవారికి ఎన్‌ఎన్‌ఆర్‌టీఐ, ఎన్‌ఆర్‌టీఐ మందులను అందజేస్తూ వారిని పరిశీలన, సంరక్షణ, కౌన్సిలింగ్ కోసం జిల్లాలోని మూడు ఆధరణ సంరక్షణ కేంద్రాలకు పంపిస్తున్నారు.
ఏఆర్‌టీఐ మందులను క్రమం తప్పకుండా ఆరు నెలలపాటు వాడిన బాధితులను వారికి దగ్గరలోని లింక్‌డ్ ఏఆర్‌టీ సెంటర్‌లకు పంపించి ఆ సెంటర్‌ల ద్వారా మందులను ఉచితంగా అందజేస్తున్నారు. ఏఆర్‌టీ సెంటర్‌లలో క్రమం తప్పకుండా వాడిన వేలాది మంది హెచ్‌ఐవీ పాజిటీవ్ బాధితులలో సీడీ-4, బరువులో పెరుగుదల లేని వారిని వైద్యులు, కౌన్సిలర్‌లు పరీక్షించి సెకండ్‌లైన్ మందుల కోసం హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి పంపిస్తున్నారు. దీంతో పాటు జిల్లా వ్యాప్తంగా శుభం కార్యక్రమాలు, నల్లగొండ యూత్ పాజిటీవ్ సొసైటీ, ఇతర స్వచ్ఛంద సంస్థలు, జిల్లా ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో విరివిగా అవగాహన కల్పించడంతో జిల్లాలో హెచ్‌ఐవీ పాజిటీవ్ కేసుల నమోదు గణనీయంగా తగ్గడం శుభ సూచికంగా పేర్కొనవచ్చు.