'సనాతన ధర్మంపై 'ఇండియా' ఉద్దేశం ఇదే..' | Congress Response On DMK MP likens Sanatana Dharma to HIV - Sakshi
Sakshi News home page

'సనాతన ధర్మంపై 'ఇండియా' ఉద్దేశం ఇదే..'

Published Thu, Sep 7 2023 9:38 PM | Last Updated on Fri, Sep 8 2023 9:56 AM

Congress Response On DMK MP likens Sanatana Dharma to HIV - Sakshi

ఢిల్లీ: ప్రతిపక్ష కూటమి 'ఇండియా' అన్ని మతాలను, సిద్ధాంతాలను గౌరవిస్తుందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి పవన్ ఖేరా చెప్పారు. సనాతన ధర్మాన్ని డీఎంకే ఎంపీ ఏ రాజా ఎయిడ్స్‌తో పోల్చుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తర్వాత కాంగ్రెస్ ఈ మేరకు స్పందించింది. ఎంపీ రాజా వ్యాఖ్యలను సమ్మతించబోమని చెప్పారు.  

డీఎంకే ఎంపీ ఏ రాజా వివాదాస్పద వ్యాఖ్యల తర్వాత స్పందించిన కాంగ్రెస్ తన సిద్ధాంతం సర్వధర్మ సమభావం అని పేర్కొంది. ప్రతి మతానికి, సిద్ధాంతానికి సమాన ఆధరణ ఉంటుందని స్పష్టం చేసింది. తాము ఏ మతానికి, విశ్వాసాలను కించపరచబోమని వెల్లడించింది. డీఎంకే వ్యాఖ్యలపై స్పందిస్తూ.. కూటమిలో ప్రతి ఒక్కరూ అన్ని మతాలను గౌరవిస్తారని అన్నారు. 

డీఎంకే ఎంపీ రాజా ఈ రోజు సనాతన ధర్మంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మాన్ని ఎయిడ్స్, కుష్టు రోగంతో పోల్చారు. దీనిపై బీజేపీ మండిపడింది. దేశవ్యాప్తంగా ఈ వ్యాఖ్యలు విమర్శలకు కారణమయ్యాయి. అనంతరం కాంగ్రెస్ తన అభిప్రాయాన్ని మరోసారి స్పష్టం చేసింది. 

ఇదీ చదవండి: ‘సనాతన ధర్మం అంశంపై చర్చలకు ఎవరు రమ్మన్నా వస్తా’

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement