
హెచ్‌ఐవీని నిరోధించే రింగ్...
మహిళల్లో హెచ్‌ఐవీ నిరోధానికి ఉపయోగపడే సరికొత్త ఇంట్రా-వెజైనల్ రింగ్ ఇది.
మహిళల్లో హెచ్‌ఐవీ నిరోధానికి ఉపయోగపడే సరికొత్త ఇంట్రా-వెజైనల్ రింగ్ ఇది. రిట్రోవైరస్(హెచ్‌ఐవీ)ని నివారించే శక్తిమంతమైన ‘టీనోఫోవిర్’ ఔషధంతో నింపిన ఈ రింగ్‌ను ఇటీవల ఆడ కోతుల్లో పరీక్షించగా.. వంద శాతం ఎస్‌హెచ్‌ఐవీని అడ్డుకోగలిగింది. ఒకసారి యోనిలోకి ప్రవేశపెడితే 30 రోజుల వరకూ ఇది పనిచేస్తుందని, దీనిని వచ్చే నవంబరులో 60 మంది స్త్రీలలోనూ పరీక్షించనున్నట్లు న్యూయార్క్‌లోని అల్బర్ట్ ఐన్‌స్టీన్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్ శాస్త్రవేత్తలు వెల్లడించారు.