
‘హెచ్‌ఐవీ’చికిత్సతో సిఫిలిస్ ముప్పు!
హెచ్‌ఐవీకి యాంటీరెట్రోవైరల్ మందులు వాడుతున్న పురుషులకు సిఫిలిస్ అవకాశాలు ఎక్కువగా ఉంటాయని కొత్త అధ్యయనం హెచ్చరిస్తోంది.
టొరంటో: హెచ్‌ఐవీకి యాంటీరెట్రోవైరల్ మందులు వాడుతున్న పురుషులకు సిఫిలిస్ అవకాశాలు ఎక్కువగా ఉంటాయని కొత్త అధ్యయనం హెచ్చరిస్తోంది. ప్రస్తుతం హెచ్‌ఐవీకి ‘హార్ట్’(హైలీ యాక్టివ్ యాంటీరెట్రోవైరల్ థెరపీ) మంచి చికిత్సగా ఉంది. కెనడాలోని బ్రిటిష్ కొలంబియా విశ్వవిద్యాలయం, దక్షిణాఫ్రికాలోని ఆఫ్రికన్ ఇన్ స్టిట్యూట్ ఫర్ మేథమెటికల్ సైన్సెస్ పరిశోధకులు ఈ అధ్యయనం చేశారు.
హార్ట్ చికిత్స రోగ నిరోధక శక్తిని పెంచుతుందనీ, కానీ చికిత్స తీసుకుంటున్న వారిలో గనేరియా, క్లామైడియాలకన్నా, సిఫిలిస్ ఎక్కువగా రావడానికి కారణం ఏంటో అంతుపట్టడం లేదని పరిశోధకులు అంటున్నారు.