న్యూఢిల్లీ: ప్రాణాంతకర హెచ్‌ఐవీ సోకిన చిన్నారులను సైతం బలహీనవర్గాల జాబితా (డిస్‌అడ్వాంటేజ్ గ్రూప్)లో చేరుస్తూ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కొత్త నోటిఫికేషన్ జారీచేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. చిన్నారులకు ఉచిత, నిర్భంద విద్యా హక్కు కల్పిస్తూ 2009లో తెచ్చిన చట్టం ప్రకారం హెచ్‌ఐవీ బాధిత చిన్నారులను డిస్‌అడ్వాంటేజ్ గ్రూప్‌లో చేర్చాల్సి ఉంది.
అందుకనుగుణంగా ఇప్పటికే 11 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం కొత్త నోటిఫికేషన్ తెచ్చాయని, మిగతా రాష్ట్రాలు, కేంద్రపాలితప్రాంతాలు అదేబాటలో నడవాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేఎస్ ఖేహర్, జస్టిస్ డీవై చంద్రచూడ్‌ల ధర్మాసనం ఆదేశించింది. జమ్మూకశ్మీర్‌మినహా మిగతావన్నీ వచ్చే ఎనిమిది వారాల్లో నోటిఫికేషన్ జారీచేయాలని కోర్టు పేర్కొంది.