
న్యూఢిల్లీ: దేశంలో గత పదేళ్లలో 17,08,777 మంది హెచ్‌ఐవీ బారిన పడ్డారని జాతీయ ఎయిడ్స్ నియంత్రణ(ఎన్‌ఏసీఓ) సంస్థ వెల్లడించింది. అరక్షితశృంగారమే ఇందుకు కారణమని పేర్కొంది. కొత్తగా హెచ్‌ఐవీ బారినపడే వారి సంఖ్య క్రమంగా తగ్గుతోందని వివరించింది. 2011–12లో 2.4 లక్షల మందికి హెచ్‌ఐవీ సోకగా, 2020–21 85,268కు తగ్గిందని తెలిపింది.
► ఎయిడ్స్ బాధితుల్లో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది. గత పదేళ్లలో ఏపీలో 3,18,814, మహారాష్ట్రలో 2,84,577, కర్ణాటకలో 2,12,982, తమిళనాడులో 1,16,536, యూపీలో 1,10,911, గుజరాత్‌లో 87,440 హెచ్‌ఐవీ కేసులు బయటపడ్డాయి.
► 2011–12 నుంచి 2020–21 మధ్య రక్తం ద్వారా 15,782 మందికి హెచ్‌ఐవీ సోకింది.
► తల్లి నుంచి బిడ్డకు సోకిన కేసులు గత పదేళ్లలో 4,423 బయటపడ్డాయి.
► 2020 నాటికి 23,18,737 హెచ్‌ఐవీ బాధితులున్నారు. వీరిలో 81,430 మంది పిల్లలు.
► హెచ్‌ఐవీ వైరస్ ప్రధానంగా రోగ నిరోధక వ్యవస్థపై దాడి చేసి ఎయిడ్స్‌కు దారితీస్తుంది. ఎయిడ్స్‌ను పూర్తిగా నయం చేసే ప్రామాణికమైన చికిత్స ఇప్పటిదాకా అందుబాటులో లేదు.
Comments
Please login to add a commentAdd a comment