హెచ్‌ఐవీ రోగులకు అధిక బీమా ప్రీమియం: ఐఆర్‌డీఏ | HIV/AIDS patients not to be denied insurance cover: Irda | Sakshi
Sakshi News home page

హెచ్‌ఐవీ రోగులకు అధిక బీమా ప్రీమియం: ఐఆర్‌డీఏ

Published Sat, Dec 14 2013 3:24 AM | Last Updated on Thu, Mar 28 2019 8:28 PM

హెచ్‌ఐవీ రోగులకు అధిక బీమా ప్రీమియం: ఐఆర్‌డీఏ - Sakshi

హెచ్‌ఐవీ రోగులకు అధిక బీమా ప్రీమియం: ఐఆర్‌డీఏ

న్యూఢిల్లీ: హెచ్‌ఐవీ/ఎయిడ్స్ రోగులు అధిక జీవిత బీమా ప్రీమియం చెల్లించాల్సి ఉంటుందని నియంత్రణ సంస్థ ఐఆర్‌డీఏ స్పష్టం చేసింది. బీమా పథకం తీసుకొనేటప్పుడు ఇతర వ్యాధులు ఏవైనా ఉన్నా అధిక ప్రీమియం చెల్లింపు వర్తిస్తుందని ఐఆర్‌డీఐ చైర్మన్ టీఎస్ విజయన్ శుక్రవారం స్పష్టంచేశారు. బీమా ప్రొడక్ట్‌లు కొనేటప్పటికే వ్యాధులు ఏమైనా ఉన్నా, బీమా కంపెనీలు లైఫ్ కవర్ సదుపాయాన్ని అందిస్తాయని అయితే వాణిజ్యపరమైన గిట్టుబాటుకు వీలుగా తగిన ప్రీమియంను చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు.
 
 ఇక్కడ జరిగిన ఫిక్కీ కార్యక్రమంలో పాల్గొన్న విజయన్ ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు.  హెచ్‌ఐవీ/ఎయిడ్స్ రోగులకు కొన్ని బీమా కంపెనీలు ఇప్పటికే బీమా కవరేజ్‌లు కల్పిస్తున్నాయని, మరిన్ని కంపెనీలు సైతం ఈ దశలో ముందుకు వస్తాయని తాను భావిస్తున్నానని అన్నారు.    హెచ్‌ఐవీ/ఎయిడ్స్ రోగులను జీవిత బీమా కవర్‌లోకి తీసుకురావడంసహా పలు అంశాలపై అక్టోబర్‌లో ఐఆర్‌డీఏ ముసాయిదా మార్గదర్శకాలను ఆవిష్కరించింది. వీటిపై డిసెంబర్‌లోపు సంబంధిత వర్గాలు సూచనలు, సలహాలూ ఇవ్వాల్సి ఉంటుంది.  వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచీ ఈ తాజా మార్గదర్శకాలు అమల్లోకి వచ్చే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement