మూడు నెలల మందులు అందజేస్తున్న జిల్లా అదనపు వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ పవన్ కుమార్
తూర్పుగోదావరి, రామచంద్రపురం: హెచ్‌ఐవీ వ్యాధితో జీవిస్తున్న వారికిది నిజంగా శుభవార్తే. ఇప్పటివరకు ప్రతినెలా లింక్ ఏఆర్‌టీ కేంద్రానికి వచ్చి మందులు తీసుకోవాల్సి వచ్చేది. అయితే ప్రభుత్వం ఈ విషయంలో వీరికి కొంత వెసులుబాటు కల్పించింది. ఇక నుంచి వీరు ప్రతి మూడు నెలలకు ఒకసారి మూడు నెలలకు సరిపడా మందులు అందించనున్నారు.
ఈ మేరకు గురువారం పట్టణంలోని ఏరియా ఆసుపత్రిలో ఈ కార్యక్రమాన్ని జిల్లా అదనపు వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎం.పవన్‌కుమార్, రామచంద్రపురం ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రవీణ్ ఆధ్వర్యంలో ప్రారంభించారు. కార్యక్రమంలో ఏపీ సాక్స్ అసిస్టెంట్ డైరెక్టర్ జావేద్ లాల్‌బండ్, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ పి.సత్యనారాయణ, జిల్లా ప్రోగ్రాం మేనేజర్ జి. ఆదిలింగం, జిల్లా ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఐసీటీసీ సూపర్‌వైజర్ ఎ.బుజ్జిబాబు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment