
సాక్షి, కాకినాడ (తూర్పుగోదావరి): కోవిడ్ చికిత్సకు రూ. 14లక్షలు వసూలు చేశారన్న ఆరోపణ ఎదుర్కొంటున్న సాయిసుధా ఆస్పత్రికి అధికారులు భారీగా జరిమానా విధించారు. బాధిత బంధువుల ఫిర్యాదుతో విచారణ చేసిన అధికారులు సాయిసుధ ఆస్పత్రికి రూ.75.80 లక్షల జరిమానా విధించడంతో పాటు త్రీ టౌన్ పిఎస్ లో క్రిమినల్ కేసు నమోదు చేశారు. అయితే, ఆస్పత్రి యాజమాన్యం.. కలెక్టర్ మురళీధర్ రెడ్డి సమక్షంలో సొమ్ము తిరిగి చెల్లించింది. బాధితులకు రూ.10.84 లక్షలను ఆసుపత్రి యాజమాని డా.వాడ్రేవు రవి తిరిగి ఇచ్చేశారు.
Comments
Please login to add a commentAdd a comment