హెచ్ఐవీ ఉందని ఆయన నాకు చెప్పలేదు!
'నేను ఆయన గర్ల్ఫ్రెండ్ను. ఆయనతో కలిసి జీవించాను. అయినా ఆయన నాకేమీ చెప్పలేదు' అంటూ మాజీ పోర్న్ స్టార్, చార్లీ షీన్ మాజీ ప్రియురాలు బ్రీ ఓల్సన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. తనకు హెచ్ఐవీ ఉందని హాలీవుడ్ నటుడు చార్లీషీన్ ఎన్బీసీ 'టుడే షో' కార్యక్రమంలో ప్రకటించిన గంటసేపటికే ఆమె మీడియా ముందుకొచ్చి.. తన ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఆయన ఏనాడూ తనకు హెచ్ఐవీ ఉందని, చికిత్స పొందుతున్నానని చెప్పలేదని ఆమె తెలిపింది. 2011లో చార్లీ కెరీర్ ఒడిదుడుకుల్లో ఉన్నప్పుడు ఆయనతో దాదాపు ఏడాదిపాటు బ్రీ ఓల్సన్ కలిసి జీవించింది.
చార్లీ షీన్కు హెచ్ఐవీ పాజిటివ్ ఉందని గాసిప్ వెబ్సైట్ల ద్వారా తెలియడంతో తాను భయాందోళనకు గురయ్యానని, వెంటనే ఆస్పత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకోగా.. హెచ్ఐవీ నెగిటివ్ వచ్చిందని, దీంతో కాస్తా ఊపిరి పీల్చుకున్నానని ఆమె చెప్పారు. చార్లీ వ్యాధి గురించి యావత్ ప్రపంచంతోపాటే తానూ తెలుసుకోవాల్సిరావడం ఆగ్రహం కలిగిస్తున్నదని, ఆయనకు తానే హెచ్ఐవీ అంటించానని పేర్కొంటూ చార్లీ మద్దతుదారులు చంపేస్తామని హెచ్చరికలు చేయడంతో తాను వెంటనే ఇండియానా నుంచి న్యూయార్క్ పరిగెత్తుకొని వచ్చి ఈ రేడియో కార్యక్రమంలో మాట్టాడుతున్నాని తెలిపింది. ' ఆయన నాకు ఎప్పుడూ చెప్పలేదు. నేను ఆయన గర్ల్ ఫ్రెండ్ ను. మేం కలిసి జీవించాం. దాదాపు ఏడాదిపాటు ప్రతిరోజూ మేం లైంగిక అనుభవం పొందాం' అని వివరించింది. అయితే, గర్భం రాకుండా ఉండేందుకు మాత్రమే లెదర్ కండోమ్ లను వాడినట్టు తెలిపింది.
అత్యంత ప్రజాదరణ పొందిన 'టు అండ్ హాఫ్ మెన్' కార్యక్రమం నుంచి తొలగించిన కొన్ని రోజులకే 2011లో తనకు హెచ్ఐవీ ఉన్నట్టు తెలిసిందని చార్లీ ఇంటర్వ్యూలో చెప్పారని, ఆ సమయంలో దాదాపు ఏడాదికాలం పాటు అతనితో కలిసి ఉన్నా అతను ఆ విషయాన్ని తనకు చెప్పలేదని చార్లీ తీరుపై బ్రీ ఒల్సన్ మండిపడుతున్నది. వార్నర్ బ్రదర్స్ తో గొడవపడి.. అత్యంత వివాదాస్పదంగా టీవీ షో నుంచి వైదొలిగిన చార్లీ ఆ సమయంలో ఇద్దరు భామలతో ప్రణయాన్ని నెరిపారు. అందులో ఒల్సన్ ఒకరు. 2011లో తను ఒడిదుడుకుల్లో ఉన్నప్పుడే హెచ్ఐవీ ఉందని మీకు తెలిసిందా? అని ఇంటర్వ్యూలో విలేకరి ప్రశ్నించగా.. అప్పటికీ ఇంకా కచ్చితంగా తెలియలేదని చార్లీ చెప్పారు. అయితే అప్పటికే చార్లీ తనకు హెచ్ఐవీ ఉందనే విషయం చార్లీకి తెలుసని ఒల్సన్ వాదిస్తున్నది.