charlie sheen
-
'నేను కేబినెట్ మంత్రి కూతురితో రాత్రంతా గడిపా'
లండన్: తాను బ్రిటన్ కేబినెట్ మంత్రి కూతురుతో కూడా ఒక రాత్రి గడిపినట్లు ప్రముఖ హాలీవుడ్ నటుడు చార్లీ షీన్ చెప్పాడు. ఆదివారం రాత్రి జరిగిన ఓ టీవీ షో కార్యక్రమంలో పీర్స్ మోర్గాన్ అడిగిన ప్రశ్నలకు ఈ సమాధానం చెప్పాడు. ఆ సమయంలో తన ఎదురుగా వందలమంది కూర్చుని ఉన్నారు. ప్రముఖ నటుడిగా పేరు తెచ్చుకున్న షీన్ తనకు హెచ్ఐవీ ఉందని గత ఏడాది బహిరంగంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ మధ్య తరుచు ఇంటర్వ్యూలు ఇస్తూ వివాదాలు రాజేస్తున్న ఈ నటుడు ఈసారి ఏకంగా ఓ కేబినెట్ మంత్రి నెత్తిన బాంబు పేల్చాడు. మీరు గడిపిన అమ్మాయిల్లో అత్యంత ఫేమస్ అయి ఉండి బయటకు చెప్పని వారు ఎవరైనా ఉన్నారా అంటూ మోర్గాన్ వేసిన ప్రశ్నకు వెంటనే అతడు బదులిస్తూ 'ఉన్నారు.. అది సరిగ్గా 20 ఏళ్ల కిందట. ఆమె ఫేమస్ అని చెప్పనుగానీ ఆమె తండ్రి మాత్రం ఫేమస్.. ఓ బ్రిటన్ కేబినెట్ మంత్రి కూతురుతో ఒక రాత్రంతా గడిపాను' అని చెప్పాడు. దీంతో అక్కడ కూర్చున్న వాళ్లంతా షాక్ అయ్యారు. వెంటనే మోర్గాన్ ఆ మంత్రి ఎవరనే విషయం తెలుసుకునేందుకు పలు ప్రశ్నలు సందించాడు. ఇప్పుడు కూడా ఆ మంత్రి అధికారంలో ఉన్నాడా? ఏ శాఖలో ఉన్నారు? పోని ఇప్పుడు లేకుండా ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఏ శాఖలో బాధ్యతలు నిర్వర్తించారు? అంటూ గుచ్చిగుచ్చి ప్రశ్నించారు. దీనికి ఆయన స్పందిస్తూ తాను అలా పేరు చెప్పి సమస్యలు కొని తెచ్చుకోలేనని, ఇంటర్ పోల్ అధికారులు నా వెంటపడతారని చెప్పాడు. అయితే, పదే పదే ప్రశ్నించగా ఆమె పేరు చెప్పేందుకు నిరాకరించిన ఆయన ఆ మంత్రి గతంలో హోంశాఖ కార్యదర్శిగా కూడా పనిచేశారంటూ తన సమాధానం ముగించాడు. -
తాగేసి కండోమ్ మర్చిపోయా
లాస్ ఏంజెలిస్: తనకు హెచ్ఐవీ వ్యాధి ఉందని హాలీవుడ్ ప్రముఖ నటుడు చార్లీ షీన్ గతేడాది డిసెంబర్ లో అంగీకరించాడు. ఓ ప్రైవేట్ చానల్ ప్రత్యక్ష ప్రసారంలో ఆయన ఈ నిజాన్ని వెల్లడించి అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తిన విషయం తెలిసిందే. నిజానికి తాను కేవలం రెండుసార్లు మాత్రమే రక్షణ(కండోమ్) లేకుండా శృంగారంలో పాల్గొన్నట్లు తాజాగా తెలిపాడు. తరచుగా కండోమ్స్ యాడ్స్, వాటిపై ప్రచారం చేయడంతో కనిపించే చార్లీ.. తాను దురదృష్టవంతుడినని ఆవేదన వ్యక్తం చేశాడు. దాదాపు నాలుగున్నర ఏళ్ల కిందట తనకు హెచ్ఐవీ సోకిందని తెలిసిందని, అప్పటినుంచి చికిత్స పొందుతున్నానని ఆయన వివరించారు. కేవలం రెండుసార్లు మాత్రమే అసురక్షిత లైంగిక చర్యలో పాల్గొన్నాను, అందుకే ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్నానని చెప్పాడు. ఫుల్లుగా తాగి కండోమ్ వాడటం మరిచిపోయానని దీంతో వైరస్ సంక్రమించి ఉండొచ్చని అభిప్రాయపడ్డాడు. హెచ్ఐవీ సోకిన విషయం తెలిసిన తర్వాత కూడా కొన్ని నెలల పాటు శృంగారంలో పాల్గొనడం మానలేదని చార్లీ వెల్లడించాడు. తనకు సోకిన వ్యాధిని ఇతరులకు అంటించలేదని వ్యాఖ్యానించాడు. తనకు హెచ్ఐవీ ఉందన్న విషయం ఏడాది కిందటే తెలిసినా.. ఆ విషయాన్ని చార్లీ షీన్ దాచిపెట్టారని, ఆయనతో లైంగిక సంబంధం ఉన్న ఓ పోర్న్ స్టార్ కూడా వెల్లడించడంతో ఈ వార్త అప్పట్లో సంచలనం అయింది. -
'నీకు ఎయిడ్స్ ఉందని ఎందుకు చెప్పలేదు?'
బ్రిటన్: ఆమె తన మాజీ ప్రేయసి.. ఒకప్పుడు ఎంతో గాఢమైన అనుబంధం ఉంది. కొద్దికాలం విడిపోయారు. ఆ తర్వాత మళ్లీ మాటలు కలిశాయి. గతంలో ఉన్న చనువు మేరకు వారిద్దరు తిరిగి శృంగారంలో పాల్గొన్నారు. కాకపోతే, ఆ ప్రియుడు ఆమె ముందు నిజం దాచాడు. ఆ నిజమేమిటంటే అతడికి అప్పటికే హెచ్ఐవీ సోకింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూ కార్యక్రమంలో మాట్లాడుతూ అతడు తాఫీగా తనకు ఎయిడ్స్ ఉందంటూ బహిర్గతం చేశాడు. ఈ విషయం తెలుసుకున్న ఆ మాజీ ప్రేయసి గుండె ఒక్కసారిగా జారిపోయింది. ఎందుకు ఇంతపనిచేశావ్ అని నిలదీస్తే ఎంతో నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడు. అతడే.. చార్లీ షీన్. తొలుత రంగస్థల నటుడిగా ఉన్న ఇతడు అనంతరం పలు అమెరికన్ చిత్రాల్లో నటించి కొద్ది కాలంలోనే పేరు ప్రఖ్యాతులు సంపాధించుకున్నాడు. కానీ, అతడి విచ్చల విడితనం కారణంగా హెచ్ఐవీ సోకింది. ఆ విషయాన్ని తన మాజీ ప్రేయసికి చెప్పకుండా దాచేశాడు. ఇదే విషయాన్ని అతడిని ఆమె ప్రశ్నిస్తే ఏం చెప్పాడో ఒకసారి చూస్తే.. మాజీ ప్రేయసి: నీకు ఎయిడ్స్ లేదని ఎందుకు చెప్పావ్? షీన్: అది నీకు చెప్పాల్సిన అవసరం లేదు మాజీ ప్రేయసి: కండోమ్ లేకుండా శృంగారంలో పాల్గొంటున్నప్పుడు ఆ విషయం తెలుసుకోవడం నా హక్కు షీన్: నువ్వు ఇలాంటివి కోరుకోకూడదు.. అంటూ ఇంకా ఎన్నో కొన్ని చెప్పకూడని మాటలు వారిద్దరు ఫోన్లో మాట్లాడుకున్నారు. -
హెచ్ఐవీ ఉందని ఆయన నాకు చెప్పలేదు!
'నేను ఆయన గర్ల్‌ఫ్రెండ్‌ను. ఆయనతో కలిసి జీవించాను. అయినా ఆయన నాకేమీ చెప్పలేదు' అంటూ మాజీ పోర్న్ స్టార్, చార్లీ షీన్ మాజీ ప్రియురాలు బ్రీ ఓల్సన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. తనకు హెచ్ఐవీ ఉందని హాలీవుడ్ నటుడు చార్లీషీన్ ఎన్బీసీ 'టుడే షో' కార్యక్రమంలో ప్రకటించిన గంటసేపటికే ఆమె మీడియా ముందుకొచ్చి.. తన ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఆయన ఏనాడూ తనకు హెచ్ఐవీ ఉందని, చికిత్స పొందుతున్నానని చెప్పలేదని ఆమె తెలిపింది. 2011లో చార్లీ కెరీర్ ఒడిదుడుకుల్లో ఉన్నప్పుడు ఆయనతో దాదాపు ఏడాదిపాటు బ్రీ ఓల్సన్ కలిసి జీవించింది. చార్లీ షీన్‌కు హెచ్ఐవీ పాజిటివ్ ఉందని గాసిప్ వెబ్సైట్ల ద్వారా తెలియడంతో తాను భయాందోళనకు గురయ్యానని, వెంటనే ఆస్పత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకోగా.. హెచ్ఐవీ నెగిటివ్ వచ్చిందని, దీంతో కాస్తా ఊపిరి పీల్చుకున్నానని ఆమె చెప్పారు. చార్లీ వ్యాధి గురించి యావత్ ప్రపంచంతోపాటే తానూ తెలుసుకోవాల్సిరావడం ఆగ్రహం కలిగిస్తున్నదని, ఆయనకు తానే హెచ్ఐవీ అంటించానని పేర్కొంటూ చార్లీ మద్దతుదారులు చంపేస్తామని హెచ్చరికలు చేయడంతో తాను వెంటనే ఇండియానా నుంచి న్యూయార్క్ పరిగెత్తుకొని వచ్చి ఈ రేడియో కార్యక్రమంలో మాట్టాడుతున్నాని తెలిపింది. ' ఆయన నాకు ఎప్పుడూ చెప్పలేదు. నేను ఆయన గర్ల్ ఫ్రెండ్ ను. మేం కలిసి జీవించాం. దాదాపు ఏడాదిపాటు ప్రతిరోజూ మేం లైంగిక అనుభవం పొందాం' అని వివరించింది. అయితే, గర్భం రాకుండా ఉండేందుకు మాత్రమే లెదర్ కండోమ్ లను వాడినట్టు తెలిపింది. అత్యంత ప్రజాదరణ పొందిన 'టు అండ్ హాఫ్ మెన్' కార్యక్రమం నుంచి తొలగించిన కొన్ని రోజులకే 2011లో తనకు హెచ్ఐవీ ఉన్నట్టు తెలిసిందని చార్లీ ఇంటర్వ్యూలో చెప్పారని, ఆ సమయంలో దాదాపు ఏడాదికాలం పాటు అతనితో కలిసి ఉన్నా అతను ఆ విషయాన్ని తనకు చెప్పలేదని చార్లీ తీరుపై బ్రీ ఒల్సన్ మండిపడుతున్నది. వార్నర్ బ్రదర్స్ తో గొడవపడి.. అత్యంత వివాదాస్పదంగా టీవీ షో నుంచి వైదొలిగిన చార్లీ ఆ సమయంలో ఇద్దరు భామలతో ప్రణయాన్ని నెరిపారు. అందులో ఒల్సన్ ఒకరు. 2011లో తను ఒడిదుడుకుల్లో ఉన్నప్పుడే హెచ్ఐవీ ఉందని మీకు తెలిసిందా? అని ఇంటర్వ్యూలో విలేకరి ప్రశ్నించగా.. అప్పటికీ ఇంకా కచ్చితంగా తెలియలేదని చార్లీ చెప్పారు. అయితే అప్పటికే చార్లీ తనకు హెచ్ఐవీ ఉందనే విషయం చార్లీకి తెలుసని ఒల్సన్ వాదిస్తున్నది. -
'ఆ రహస్యాన్ని దాచడానికి రూ. 66 కోట్లు'
హాలీవుడ్ నటుడు చార్లీ షీన్ తనకు హెచ్ఐవీ పాజిటివ్ ఉందన్న విషయాన్ని దాచడానికి చాలానే డబ్బును వదిలించుకున్నాడు. 'ఓ హాలీవుడ్ స్టార్‌కు హెచ్ఐవీ సోకింది' అని ఇటీవల ఓ పోర్న్ స్టార్ చేసిన సంచలన వ్యాఖ్యల నేపథ్యంలో అది తానేనంటూ చార్లీ షీన్ బహిరంగంగా అంగీకరించిన విషయం తెలిసిందే. అయితే ఈ రహస్యాన్ని దాచేందుకు బ్లాక్ మెయిల్ చేసినవారికి సుమారు రూ. 66 కోట్లను ఇచ్చినట్లు చార్లీ బుధవారం వెల్లడించాడు. 'టూ అండ్ ఎ ఆఫ్ మెన్ షో' తో ఫేమస్ అయిన ఈ నటుడు తనపై వస్తున్న ఆరోపణలపై ఓ టీవీ షోలో వివరణ ఇచ్చాడు. ఉద్దేశపూర్వకంగానే ఇతరులకు హెచ్ఐవీని అంటించాడని, తనకు గల వ్యాధి వివరాలను దాచి లైంగిక సంబంధాలను కొనసాగించాడని తనపై వస్తున్న ఆరోపణలను ఆయన ఖండించాడు. తనకు నాలుగేళ్ల క్రితం ఎయిడ్స్ ఉన్నట్లు నిర్థారణ అయిందని ఆ తరువాత తగిన జాగ్రత్తలు తీసుకొని నిజాయితీగా లైగిక సంబంధాలు జరిపినట్లు తెలిపాడు. అయితే చార్లీతో నాలుగేళ్ల క్రితం ఏడాది పాటు గడిపిన మాజీ పోర్న్ స్టార్ బ్రీ ఓల్సన్ మాత్రం అతని వ్యాఖ్యలను ఖండించింది. చార్లీ తనతో గడిపిన ఏడాదిలో మాట మాత్రమైనా తనకు ఈ విషయం గురించి చెప్పలేదని ఆమె వెల్లడించింది. ఎప్పుడూ 'ఐయామ్ క్లీన్' అని చెప్పేవాడని తెలిపింది. అయితే తనకు హెచ్ఐవీ ఫలితాలు నెగటీవ్ అని తేలాయని చెప్పిన ఓల్సన్ ఉద్దేశపూర్వకంగానే చార్లీ రహస్యాన్ని దాచాడని ఆరోపించింది. ఒకప్పుడు అమెరికాలోనే టీవీ షో కార్యక్రమాలలో అత్యంత రెమ్యునరేషన్ అందుకున్న నటుడుగా పేరున్న చార్లీ షీన్ పలువురు సెలబ్రిటీలతో పాటు పోర్న్స్టార్లతో విచ్చలవిడిగా లైంగిక సంబంధాలు కొనసాగించి ఉద్దేశపూర్వకంగానే హెచ్ఐవీని అంటించాడనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
ఔను నాకు హెచ్ఐవీ ఉంది..!
యావత్ హాలీవుడ్ సినీ ప్రపంచం ఉత్కంఠకు తెరదించుతూ ప్రముఖ నటుడు చార్లీ షీన్ తనకు హెచ్ఐవీ వ్యాధి ఉందని అంగీకరించారు. మంగళవారం ఎన్బీసీ చానెల్ ప్రత్యక్ష ప్రసారంలో ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన ఈ విషయాన్ని ప్రపంచానికి వెల్లడించారు. 'నాకు హెచ్ఐవీ పాజిటివ్ ఉందని అంగీకరించడానికి ఇక్కడికి వచ్చాను. ఈ విషయంలో జరుగుతున్న డొంక తిరుగుడు దాడులు, అర్ధసత్యాలు, విషపూరిత, ప్రమాదకరమైన కథనాలకు ఫుల్స్టాప్ పెటేందుకే ఈ విషయాన్ని నేను స్పష్టం చేస్తున్నారు. ఈ విషయంలో ఎంతోమంది ఆరోగ్యాన్ని దెబ్బతీసేవిధంగా కథనాలు అందిస్తున్నారు' అని ఆయన పేర్కొన్నారు. దాదాపు నాలుగేళ్ల కిందట తనకు హెచ్ఐవీ సోకిందని తెలిసిందని, అప్పటినుంచి చికిత్స పొందుతున్నానని ఆయన వివరించారు. ఈ నాలుగేళ్ల కాలంలో ఎవరికైనా ఈ వ్యాధిని అంటించారా? అన్న ప్రశ్నకు ఆ ప్రసక్తే లేదని సమాధానమిచ్చారు. ప్రస్తుతం 50 ఏళ్ల చార్లీ షీన్ ఆరోగ్య పరిస్థితిపై ఆయన డాక్టర్ రాబర్ట్ హుజెంగా వివరించారు. దాదాపు ఐదారేళ్లుగా ఆయన క్రమంతప్పకుండా చికిత్స పొందుతున్నారని, ప్రస్తుతం ఆయన రక్తంలో హెచ్ఐవీ వైరస్ ఉనికి కనబడటం లేదని, చార్లీ షీన్ చాలా ఆరోగ్యంగా ఉన్నారని వివరించారు. హాలీవుడ్ నటుడు చార్లీ షీన్‌కు హెచ్ఐవీ సోకిందన్న వార్తల నేపథ్యంలో ఆయన ఎన్బీసీ చానెల్లోని టుడే షో కార్యక్రమంలో ఇవ్వనున్న ఇంటర్వ్యూపై సర్వత్రా ఆసక్తి నెలకొన్న సంగతి తెలిసిందే. మద్యం,మాదక ద్రవ్యాలు వంటి వ్యసనాల నుంచి కోలుకున్న చార్లీ షీన్ టాప్ రేటెడ్ టీవీ సిరీస్ 'టు అండ్ హాఫ్ మెన్' కార్యక్రమంతో ప్రేక్షకులకు చేరువయ్యారు. అయితే వార్నర్ బ్రదర్స్‌తో బహిరంగంగా గొడవ పడటంతో 2011లో ఆయనను ఈ కార్యక్రమం నుంచి తొలగించారు. ఈ నేపథ్యంలో ఆయనకు హెచ్ఐవీ వ్యాధి సోకిందని బయటకు పొక్కడం సంచలనం రేపింది. ఆయనతో లైంగిక సంబంధాలు ఉన్న అనేకమంది సెలబ్రిటీలు ఈ విషయమై ఆందోళన చెందారు. తనకు హెచ్ఐవీ ఉందన్న విషయాన్ని దాచడంపై ఆయనతో లైంగిక సంబంధాలున్న పలువురు కోర్టుకు ఎక్కేందుకు సిద్ధమవుతున్నారు. తనకు హెచ్ఐవీ ఉందన్న విషయం ఏడాది కిందటే తెలిసినా.. ఆ విషయాన్ని చార్లీ షీన్ దాచిపెట్టారని, ఆయనతో లైంగిక సంబంధం ఉన్న ఓ పోర్న్ స్టార్ కూడా వెల్లడించడంతో ఈ వార్త సంచలనం అయింది. ఈ నేపథ్యంలో తనకు హెచ్ఐవీ సోకడంపై అనేక రకాల కథనాలు, ఊహాగానాలు వస్తుండటంతో వాటికి తెరదించేందుకు ఆయన స్వయంగా టీవీ ముందుకు వచ్చి నిజం అంగీకరించారు. -
హీరోపై లైంగిక దాడి కేసు
హాలీవుడ్ నటుడు చార్లీ షీన్పై లైంగిక దాడి కేసు నమోదైంది. అతడు తనను కావాలని భావపరమైన ఒత్తిడికి గురిచేశాడని చార్లీ డెంటల్ టెక్నీషియన్ మార్గరిటా పాలెస్టినో ఫిర్యాదు చేశారు. అతడు తన డెంటల్ ఛైర్ నుంచి ఒక్కసారిగా గెంతి, నైట్రస్ ఆక్సైడ్ మాస్క్ తీసేసి, తనను గట్టిగా పట్టుకున్నాడని ఆమె ఫిర్యాదుచేసింది. ఈ సంఘటన సెప్టెంబర్ 25వ తేదీన జరిగింది. లాస్ ఏంజెలిస్ కౌంటీ సుపీరియర్ కోర్టులో పాలెస్టినో న్యాయవాదులు ఈ ఫిర్యాదు చేశారు. 49 ఏళ్ల చార్లీ షీన్ దంత వైద్యం చేయించుకుంటుండగా, నైట్రస్ ఆక్సైడ్ మాస్క్ వేసిన కొద్దిసేపటికే ఉన్నట్టుండి ఒక్కసారిగా లేచి, ''నేను నిన్ను ...... చంపేస్తాను'' అని అసభ్యకరంగా అన్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. తన దుస్తులు విప్పేసేందుకు కూడా షీన్ తీవ్రంగా ప్రయత్నించాడని ఆమె ఆరోపించారు. ఇటీవలి కాలంలో షీన్ బాగా ఎక్కువగా కొకైన్ వాడుతున్నట్లు ఇతర డెంటిస్టులు తనకు చెప్పారన్నారు. ఇంతకుముందు మరో డెంటిస్టును అతడు కత్తితో బెదిరించి, డెంటల్ ఛైర్‌ను కూడా కత్తితో పొడిచాడన్నారు. అయితే, ఆమె ఒక సెలబ్రిటీతో తనకు దొరికిన పావుగంట సమయాన్ని వాడుకోడానికి ఇలా అసత్య ఆరోపణలు చేస్తున్నారని షీన్ న్యాయవాది మార్టీ సింగర్ అన్నారు.