'ఆ రహస్యాన్ని దాచడానికి రూ. 66 కోట్లు' | Charlie Sheen says paid millions to blackmailers to keep HIV secret | Sakshi
Sakshi News home page

'ఆ రహస్యాన్ని దాచడానికి రూ. 66 కోట్లు'

Published Wed, Nov 18 2015 10:29 AM | Last Updated on Sun, Sep 3 2017 12:40 PM

'ఆ రహస్యాన్ని దాచడానికి రూ. 66 కోట్లు'

'ఆ రహస్యాన్ని దాచడానికి రూ. 66 కోట్లు'

హాలీవుడ్ నటుడు చార్లీ షీన్ తనకు హెచ్ఐవీ పాజిటివ్ ఉందన్న విషయాన్ని దాచడానికి చాలానే డబ్బును వదిలించుకున్నాడు. 'ఓ హాలీవుడ్ స్టార్కు హెచ్ఐవీ సోకింది' అని ఇటీవల ఓ పోర్న్ స్టార్ చేసిన సంచలన వ్యాఖ్యల నేపథ్యంలో అది తానేనంటూ చార్లీ షీన్ బహిరంగంగా అంగీకరించిన విషయం తెలిసిందే. అయితే ఈ రహస్యాన్ని దాచేందుకు బ్లాక్ మెయిల్ చేసినవారికి సుమారు రూ. 66 కోట్లను ఇచ్చినట్లు చార్లీ బుధవారం వెల్లడించాడు.

'టూ అండ్ ఎ ఆఫ్ మెన్ షో' తో ఫేమస్ అయిన ఈ నటుడు తనపై వస్తున్న ఆరోపణలపై ఓ టీవీ షోలో వివరణ ఇచ్చాడు.  ఉద్దేశపూర్వకంగానే ఇతరులకు హెచ్ఐవీని అంటించాడని, తనకు గల వ్యాధి వివరాలను దాచి లైంగిక సంబంధాలను కొనసాగించాడని తనపై వస్తున్న ఆరోపణలను ఆయన ఖండించాడు. తనకు నాలుగేళ్ల క్రితం ఎయిడ్స్ ఉన్నట్లు నిర్థారణ అయిందని ఆ తరువాత తగిన జాగ్రత్తలు తీసుకొని నిజాయితీగా లైగిక సంబంధాలు జరిపినట్లు తెలిపాడు.

అయితే చార్లీతో నాలుగేళ్ల క్రితం ఏడాది పాటు గడిపిన మాజీ పోర్న్ స్టార్ బ్రీ ఓల్సన్ మాత్రం అతని వ్యాఖ్యలను ఖండించింది. చార్లీ తనతో గడిపిన ఏడాదిలో మాట మాత్రమైనా తనకు ఈ విషయం గురించి చెప్పలేదని ఆమె వెల్లడించింది. ఎప్పుడూ 'ఐయామ్ క్లీన్' అని చెప్పేవాడని తెలిపింది. అయితే తనకు హెచ్ఐవీ ఫలితాలు నెగటీవ్ అని తేలాయని చెప్పిన ఓల్సన్ ఉద్దేశపూర్వకంగానే చార్లీ రహస్యాన్ని దాచాడని ఆరోపించింది.

ఒకప్పుడు అమెరికాలోనే టీవీ షో కార్యక్రమాలలో అత్యంత రెమ్యునరేషన్ అందుకున్న నటుడుగా పేరున్న చార్లీ షీన్ పలువురు సెలబ్రిటీలతో పాటు పోర్న్స్టార్లతో విచ్చలవిడిగా లైంగిక సంబంధాలు కొనసాగించి ఉద్దేశపూర్వకంగానే హెచ్ఐవీని అంటించాడనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement