ఔను నాకు హెచ్‌ఐవీ ఉంది..! | Charlie Sheen is Expected to Reveal He's HIV Positive Live on TV | Sakshi
Sakshi News home page

ఔను నాకు హెచ్‌ఐవీ ఉంది..!

Published Tue, Nov 17 2015 3:16 PM | Last Updated on Sun, Sep 3 2017 12:37 PM

ఔను నాకు హెచ్‌ఐవీ ఉంది..!

ఔను నాకు హెచ్‌ఐవీ ఉంది..!

యావత్ హాలీవుడ్ సినీ ప్రపంచం ఉత్కంఠకు తెరదించుతూ ప్రముఖ నటుడు చార్లీ షీన్‌ తనకు హెచ్‌ఐవీ వ్యాధి ఉందని అంగీకరించారు. మంగళవారం ఎన్బీసీ చానెల్‌ ప్రత్యక్ష ప్రసారంలో ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన ఈ విషయాన్ని ప్రపంచానికి వెల్లడించారు. 'నాకు హెచ్‌ఐవీ పాజిటివ్ ఉందని అంగీకరించడానికి ఇక్కడికి వచ్చాను. ఈ విషయంలో జరుగుతున్న డొంక తిరుగుడు దాడులు, అర్ధసత్యాలు, విషపూరిత, ప్రమాదకరమైన కథనాలకు ఫుల్‌స్టాప్‌ పెటేందుకే ఈ విషయాన్ని నేను స్పష్టం చేస్తున్నారు. ఈ విషయంలో ఎంతోమంది ఆరోగ్యాన్ని దెబ్బతీసేవిధంగా కథనాలు అందిస్తున్నారు' అని ఆయన పేర్కొన్నారు.

దాదాపు నాలుగేళ్ల కిందట తనకు హెచ్‌ఐవీ సోకిందని తెలిసిందని, అప్పటినుంచి చికిత్స పొందుతున్నానని ఆయన వివరించారు. ఈ నాలుగేళ్ల కాలంలో ఎవరికైనా ఈ వ్యాధిని అంటించారా? అన్న ప్రశ్నకు ఆ ప్రసక్తే లేదని సమాధానమిచ్చారు. ప్రస్తుతం 50 ఏళ్ల చార్లీ షీన్ ఆరోగ్య పరిస్థితిపై ఆయన డాక్టర్ రాబర్ట్‌ హుజెంగా వివరించారు. దాదాపు ఐదారేళ్లుగా ఆయన క్రమంతప్పకుండా చికిత్స పొందుతున్నారని, ప్రస్తుతం ఆయన రక్తంలో హెచ్‌ఐవీ వైరస్‌ ఉనికి కనబడటం లేదని, చార్లీ షీన్‌ చాలా ఆరోగ్యంగా ఉన్నారని వివరించారు.

హాలీవుడ్‌ నటుడు చార్లీ షీన్‌కు హెచ్‌ఐవీ సోకిందన్న వార్తల నేపథ్యంలో ఆయన ఎన్‌బీసీ చానెల్‌లోని టుడే షో కార్యక్రమంలో ఇవ్వనున్న ఇంటర్వ్యూపై సర్వత్రా ఆసక్తి నెలకొన్న సంగతి తెలిసిందే. మద్యం,మాదక ద్రవ్యాలు వంటి వ్యసనాల నుంచి కోలుకున్న చార్లీ షీన్‌ టాప్ రేటెడ్‌ టీవీ సిరీస్‌ 'టు అండ్ హాఫ్ మెన్‌' కార్యక్రమంతో ప్రేక్షకులకు చేరువయ్యారు. అయితే వార్నర్ బ్రదర్స్‌తో బహిరంగంగా గొడవ పడటంతో 2011లో ఆయనను ఈ కార్యక్రమం నుంచి తొలగించారు. ఈ నేపథ్యంలో ఆయనకు హెచ్‌ఐవీ వ్యాధి సోకిందని బయటకు పొక్కడం సంచలనం రేపింది. ఆయనతో లైంగిక సంబంధాలు ఉన్న అనేకమంది సెలబ్రిటీలు ఈ విషయమై ఆందోళన చెందారు. తనకు హెచ్‌ఐవీ ఉందన్న విషయాన్ని దాచడంపై ఆయనతో లైంగిక సంబంధాలున్న పలువురు కోర్టుకు ఎక్కేందుకు సిద్ధమవుతున్నారు.

తనకు హెచ్‌ఐవీ ఉందన్న విషయం ఏడాది కిందటే తెలిసినా.. ఆ విషయాన్ని చార్లీ షీన్ దాచిపెట్టారని,  ఆయనతో లైంగిక సంబంధం ఉన్న ఓ పోర్న్‌ స్టార్‌ కూడా వెల్లడించడంతో ఈ వార్త సంచలనం అయింది. ఈ నేపథ్యంలో తనకు హెచ్‌ఐవీ సోకడంపై అనేక రకాల కథనాలు, ఊహాగానాలు వస్తుండటంతో వాటికి తెరదించేందుకు ఆయన స్వయంగా టీవీ ముందుకు వచ్చి నిజం అంగీకరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement