nbc
-
ఈ పాపం ఎవరిది?
గత వారం జరిగిన అగ్ని ప్రమాదాలు దేశాన్ని ఉలిక్కిపడేలా చేశాయి. ఇరవై నాలుగు గంటల్లో వేర్వేరు చోట్ల సంభవించిన ఈ ప్రమాదాల్లో అభం శుభం తెలియని పలువురు చిన్నారులతో సహా 40 మంది ప్రాణాలు కోల్పోవడం పెను విషాదం. గుజరాత్లోని రాజ్కోట్లో ఓ గేమింగ్ జోన్లో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో 33 మంది, అదే రాత్రి తూర్పు ఢిల్లీలోని పిల్లల ఆసుపత్రిలోని ఘోర ప్రమాదంలో నవజాత శిశువులు ఏడుగురు దుర్మరణం పాలైన ఘటనలు సున్నిత మనస్కుల్ని చాలాకాలం వెంటాడనున్నాయి. ఆక్సిజన్ సిలిండర్ల పేలుడు సంభవించిన ఆ ఆసుప్రతి లైసెన్స్ గడువు రెండు నెలల క్రితమే తీరిపోతే, రాజ్కోట్ గేమింగ్ జోన్ నిరభ్యంతర పత్రమే (ఎన్ఓసీ) లేకుండానే యథేచ్ఛగా నడుస్తుండడం మన వ్యవస్థలోని లోపాలను ఎత్తిచూపుతోంది. నిబంధనల అమలులో అధికార యంత్రాంగం నిర్లక్ష్యం మరోసారి బహిర్గతమైంది. అగ్నిప్రమాద నివారణ నిబంధనలు, భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టంగా అమలు చేయాల్సిన అవసరంపై మరోసారి చర్చ మొదలైంది. తాజా ఘటనల నేపథ్యంలో – పాతికేళ్ళ పైచిలుకు క్రితం 1997లో ఢిల్లీలో జరిగిన ఉపహార్ సినిమా హాలు ప్రమాదం మొదలు 2004లో 90 మంది పాఠశాల విద్యార్థులను బలి తీసుకున్న కుంభకోణం అగ్నిప్రమాదం దాకా పాత పీడకలలు మళ్ళీ గుర్తుకొస్తున్నాయి. గతం నుంచి మనం ఏం పాఠాలు నేర్చుకున్నామని నిలదీస్తున్నాయి. వాణిజ్య సంస్థల నుంచి నివాస ప్రాంగణాల దాకా అన్నిచోట్లా ఇవాళ ప్రాథమిక భద్రతా ఏర్పాట్లు మృగ్యమైపోతున్నాయి. అనుకోనిది ఏం జరిగినా పదుల కొద్దీ ప్రాణాలను ప్రమాదంలో పెడుతున్నాయి. మే 26 నాటి ప్రమాదంలో శిక్షణ పొందిన వైద్య సిబ్బంది కానీ, ప్రమాద భద్రతా సర్టిఫికెట్ కానీ, చివరకు అగ్ని ప్రమాద నివారణ సామగ్రి కానీ, సరైన నిష్క్రమణ మార్గాలు కానీ లేకుండానే ఢిల్లీ లాంటి చోట ఒక ఆసుపత్రి నడుస్తోందంటే ఏమనాలి? రాజ్కోట్ గేమింగ్ జోన్లో ఎలాంటి కనీస అగ్నిప్రమాద భద్రతా లేకుండా దాదాపు రెండంతస్తుల భవనం ఎత్తున రేకులతో పెద్ద నిర్మాణం చేపడితే అధికారులు ఏం చేస్తున్నట్టు? ఆ ప్రాంగణంలో 2 వేల లీటర్ల పెట్రోల్, లెక్కకు మిక్కిలి టైర్లు నిల్వ చేస్తుంటే అడ్డుచెప్పే నాథుడు లేడా?ఒక్క ఢిల్లీలోనే గత రెండేళ్ళ పైచిలుకు కాలంలో 66 ఆసుపత్రుల్లో అగ్నిప్రమాదాలు జరిగాయని గణాంకాలు చెబుతున్నాయి. దీన్నిబట్టి, అగ్నిప్రమాద నివారణ నిబంధనలు ఎంతగా ఉల్లంఘనకు గురవుతున్నాయో స్పష్టమవుతోంది. సాక్షాత్తూ మన దేశ రాజధానిలోనే ఇలా ఉంటే, దేశంలోని ఇతర ప్రాంతాల్లో పరిస్థితిని ఇట్టే ఊహించుకోవచ్చు. మన దేశంలో ఆరోగ్య సంరక్షణ రంగంలో ప్రభుత్వ పెట్టుబడులు ఇప్పటికీ అంతంత మాత్రమే. మూడేళ్ళ క్రితం దేశంలో కరోనా మహమ్మారి విజృంభించి, డెల్టా వేరియంట్ విలయ తాండవం చేసినప్పుడు ఆ నిష్ఠురసత్యం మన కళ్ళ ముందు కనిపించింది. ప్రభుత్వ రంగంలో ఆరోగ్య రంగం అలా కునారిల్లుతుండడం వల్లే, ఆ లోటును పూడ్చడానికి ప్రైవేట్ రంగం అవసరం ఉంటోంది. జనం ప్రైవేట్ ఆసుపత్రులు, క్లినిక్లు, తదితరాలపై ఆధారపడడం ఎక్కువవుతోంది. సరిగ్గా ఈ కారణాల రీత్యానే ప్రైవేట్ ఆరోగ్యరక్షణ రంగంలో భవనాల మొదలు నాణ్యమైన మందులు, సేవల వరకు అన్నింటిలో కనీసపాటి భద్రతా ప్రమాణాలు తప్పనిసరి. కానీ, చాలాచోట్ల అవి హుళక్కి. తాజా ఘటనలే అందుకు తార్కాణం.నిజానికి, మన దేశంలో అగ్నిప్రమాదాల నుంచి భద్రతకు కీలకమైన ప్రమాణంగా జాతీయ నిర్మాణ నిబంధనావళి (ఎన్బీసీ) ఉంది. 1970లోనే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) దీన్ని ప్రచురించింది. 2016లో సైతం దాన్ని నవీకరించారు. అగ్నిప్రమాద నివారణ అనేది రాష్ట్ర జాబితాలోని అంశమైనా, అన్ని రాష్ట్రాలూ దీన్ని పాటించడం తప్పనిసరి. ఇవి కాక స్థానిక భవననిర్మాణ చట్టాల్లోనూ కావాల్సినన్ని కఠిన నియమ నిబంధనలున్నాయి. అయితే, అవి తరచూ ఉల్లంఘనకు గురవుతున్నాయి. తాజా ప్రమాదాల్లోనూ అదే జరిగింది. ఆ మాటకొస్తే, గడచిన 2022లోనే మన దేశంలో 7500 పైగా అగ్నిప్రమాదాలు జరిగాయని తాజా నివేదిక. వాటిలో కనీసం 7435 మంది మరణించినట్టు ప్రమాద మరణాలు, ఆత్మహత్యలపై తాజా నివేదిక మాట. నిన్నటి ఢిల్లీ ప్రమాదంలో సైతం అగ్నిమాపక సిబ్బంది వేగంగా స్పందించి, పక్కనున్న భవనం నుంచి నిచ్చెన ఎక్కి, ఆసుపత్రి వెనకవైపు నుంచి వెళ్ళబట్టి కనీసం అయిదుగురు శిశువుల్ని ఆఖరు క్షణంలో కాపాడగలిగారు. లేదంటే ఏమిటి పరిస్థితి? అందుకే, ఇది ప్రభుత్వ యంత్రాంగం అంతటికీ మరోసారి మేలుకొలుపు. గుజరాత్ లాంటి చోట్ల నిబంధనల్లోని లోపాలను అడ్డం పెట్టుకొని, అహ్మదాబాద్, గాంధీనగర్ సహా అనేకచోట్ల చట్టవిరుద్ధంగా వినోద కార్యకలాపాల వసతులు పుట్టగొడుగుల్లా మొలుస్తున్నాయి. తాత్కాలిక నిర్మాణాలతో భద్రతా ప్రమాణాలను తుంగలో తొక్కి, ప్రాణాలకే ముప్పు తెస్తున్నాయి. దీన్ని అరికట్టాలి. తప్పులు జరిగినప్పుడు సంబంధిత శాఖల అధికారులను సస్పెండ్ చేసి చేతులు దులుపుకోవడం పరిష్కారం కాదు. కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి. మనుషుల ప్రాణాలను తృణప్రాయంగా తీసుకొని కొందరు సాగిస్తున్న దుర్మార్గ వ్యాపారాలకు అడ్డుకట్ట వేయాలి. ఎవరినీ ఉపేక్షించేది లేదనే సంకేతాలు మాటల్లోనే కాదు చేతల్లోనూ చూపాలి. ప్రమాదాల నివారణకు సమర్థ, ప్రామాణిక చర్యల ప్రణాళికను అమలుచేయాలి. దీనికి ముందు రాజకీయ నేతల చిత్తశుద్ధి అవసరం. ఆపైన అలాంటి వసతులనే ఎంచుకోవడంలో సామాన్యుల అప్రమత్తత కీలకం. దేశవ్యాప్తంగా అధికారులు రంగంలోకి దిగి, చర్యలు చేపట్టేందుకు ప్రమాద భద్రతపై సత్వరమే జాతీయ స్థాయి ఆడిట్ జరిపితే మేలు. నేతల సంతాపాలు, నష్టపరిహారాలు మనుషుల ప్రాణాల్ని వెనక్కి తీసుకురాలేవు. -
ఇళ్ల విస్తీర్ణంలోనూ రికార్డే
సాక్షి, అమరావతి : ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద రాష్ట్రంలో ఇదివరకెన్నడూ లేనంత పెద్ద సంఖ్యలో నిర్మాణంలో ఉన్న ఇళ్లు విస్తీర్ణంలోనూ కొత్త చరిత్రను సృష్టిస్తున్నాయి. ఏ లెక్కన చూసుకున్నా, ఇదివరకెన్నడూ ఇంత విస్తీర్ణంలో పేదల ఇళ్లు నిర్మించలేదని స్పష్టం అవుతోంది. నేషనల్ బిల్డింగ్ కోడ్ (ఎన్బీసీ), ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) నిబంధనలను ఖచ్చితంగా పాటిస్తూనే.. వారు సూచించిన విస్తీర్ణం కంటే ఎక్కువ విస్తీర్ణంలోనే ఇళ్ల నిర్మాణం జరుగుతోంది. గతంలో ప్రభుత్వాలు నిర్మించిన దానికంటే ఎక్కువ విస్తీర్ణంలోనే ఇళ్ల నిర్మాణం సాగుతోందని గణాంకాలు చెబుతున్నాయి. నగరాలు, పట్టణాల్లోని కాలనీల్లో 435.56 చదరపు అడుగుల స్థలంలో, గ్రామాల్లో 653.34 చదరపు అడుగుల స్థలంలో ఇళ్ల నిర్మాణం సాగుతోంది. బెడ్రూమ్, హాలు, వంట గది, బాత్ రూమ్, వరండాతో ఇళ్లు రూపుదిద్దుకుంటున్నాయి. కాలనీల్లో ప్రభుత్వం అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తోంది. ఈ దిశగా ఇప్పటికే రూ.10 వేల కోట్లు వ్యయం చేసింది. -
గతం కన్నా మిన్నగా.. నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు
సాక్షి, అమరావతి: ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద పేదల ఇళ్ల నిర్మాణంలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని నిబంధనలను అనుసరిస్తోందని, నేషనల్ బిల్డింగ్ కోడ్(ఎన్బీసీ), ప్రధాన మంత్రి ఆవాస్ యోజన(పీఎంఏవై) నిబంధనలను ఖచ్చితంగా పాటిస్తోందని అధికారులు చెబుతున్నారు. ఎన్బీసీ నిబంధనలతో పోలిస్తే ఎక్కువ విస్తీర్ణంలోనే ఇళ్లను కడుతోందని వారు పేర్కొంటున్నారు. అలాగే గతంలో ప్రభుత్వాలు నిర్మించిన దాని కన్నా ఎక్కువ విస్తీర్ణంలోనే ఇళ్ల నిర్మాణం చేపడుతోందని గణాంకాలు చెబుతున్నాయి. అన్ని వసతులు ఉన్న పట్టణాల్లోని కాలనీల్లో 435.56 చదరపు అడుగుల స్థలంలో, గ్రామాల్లో 653.34 చదరపు అడుగుల స్థలంలో పేదలకు ఇళ్లు నిర్మించి ఇస్తోంది. ఎంతో ఆశతో ఎదురుచూస్తున్న లబ్ధిదారులను న్యాయస్థానం తీర్పు ఎంతో నిరాశపరిచింది. ఎన్బీసీ నిబంధనలతో పోలిస్తే.. ఎన్బీసీ నిబంధనల ప్రకారం ఇంటిలో పడక గది, హాల్ విస్తీర్ణం 167 చ.అ ఉండాలి. ప్రస్తుతం ప్రభుత్వం నిర్మిస్తున్న ఇళ్లలో ఆ విస్తీర్ణం 169.54 చ.అ ఉంటోంది. అంటే పడక గది విస్తీర్ణం 97 చదరపు అడుగులకు గాను 97.07 చ.అడుగుల లోనూ, హాల్ విస్తీర్ణం 70 చ.అ గాను 72.47 చ.అడుగుల విస్తీర్ణంలోను ప్రభుత్వం ఇళ్లు నిర్మిస్తోంది. అదే విధంగా వంట గది 35.5 చ.అ లకు గాను 35.75 చ.అ ల్లో నిర్మిస్తున్నారు. బాత్రూమ్ విస్తీర్ణం 19.4 చ.అ లకు గాను 20.52 చ.అ ఉండేలా ఇళ్లకు ప్రణాళికను రూపొందించారని అధికారులు వివరించారు. గతంతో పోలిస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇందిరమ్మ ఇళ్ల ప్లింత్ ఏరియా 215 చదరపు అడుగులు, కార్పెట్ ఏరియా 144 చదరపు అడుగులుగా ఉండేది. 2014–19 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో నిర్మించిన ఎన్టీఆర్ రూరల్ ఇళ్ల ప్లింత్ ఏరియా 224 చ.అ, కార్పెట్ ఏరియా 180 చ.అవిస్తీర్ణం. ప్రస్తుతం ప్రభుత్వం నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకం కింద నిర్మిస్తున్న ఇళ్ల ప్లింత్ ఏరియా 340చ.అ, కార్పెట్ ఏరియా 218.65 చ.అ విస్తీర్ణం ఉంటోంది. (సాధారణంగా కార్పెట్ ఏరియా అంటే గోడలు కాకుండా ఇంటిలో ఉపయోగించే స్థలాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు. అదే గోడలు కలుపుకొని ఇంట్లోని మొత్తం స్థలాన్ని ప్లింత్ ఏరియాగా పరిగణిస్తారు. -
ఔను నాకు హెచ్ఐవీ ఉంది..!
యావత్ హాలీవుడ్ సినీ ప్రపంచం ఉత్కంఠకు తెరదించుతూ ప్రముఖ నటుడు చార్లీ షీన్ తనకు హెచ్ఐవీ వ్యాధి ఉందని అంగీకరించారు. మంగళవారం ఎన్బీసీ చానెల్ ప్రత్యక్ష ప్రసారంలో ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన ఈ విషయాన్ని ప్రపంచానికి వెల్లడించారు. 'నాకు హెచ్ఐవీ పాజిటివ్ ఉందని అంగీకరించడానికి ఇక్కడికి వచ్చాను. ఈ విషయంలో జరుగుతున్న డొంక తిరుగుడు దాడులు, అర్ధసత్యాలు, విషపూరిత, ప్రమాదకరమైన కథనాలకు ఫుల్స్టాప్ పెటేందుకే ఈ విషయాన్ని నేను స్పష్టం చేస్తున్నారు. ఈ విషయంలో ఎంతోమంది ఆరోగ్యాన్ని దెబ్బతీసేవిధంగా కథనాలు అందిస్తున్నారు' అని ఆయన పేర్కొన్నారు. దాదాపు నాలుగేళ్ల కిందట తనకు హెచ్ఐవీ సోకిందని తెలిసిందని, అప్పటినుంచి చికిత్స పొందుతున్నానని ఆయన వివరించారు. ఈ నాలుగేళ్ల కాలంలో ఎవరికైనా ఈ వ్యాధిని అంటించారా? అన్న ప్రశ్నకు ఆ ప్రసక్తే లేదని సమాధానమిచ్చారు. ప్రస్తుతం 50 ఏళ్ల చార్లీ షీన్ ఆరోగ్య పరిస్థితిపై ఆయన డాక్టర్ రాబర్ట్ హుజెంగా వివరించారు. దాదాపు ఐదారేళ్లుగా ఆయన క్రమంతప్పకుండా చికిత్స పొందుతున్నారని, ప్రస్తుతం ఆయన రక్తంలో హెచ్ఐవీ వైరస్ ఉనికి కనబడటం లేదని, చార్లీ షీన్ చాలా ఆరోగ్యంగా ఉన్నారని వివరించారు. హాలీవుడ్ నటుడు చార్లీ షీన్కు హెచ్ఐవీ సోకిందన్న వార్తల నేపథ్యంలో ఆయన ఎన్బీసీ చానెల్లోని టుడే షో కార్యక్రమంలో ఇవ్వనున్న ఇంటర్వ్యూపై సర్వత్రా ఆసక్తి నెలకొన్న సంగతి తెలిసిందే. మద్యం,మాదక ద్రవ్యాలు వంటి వ్యసనాల నుంచి కోలుకున్న చార్లీ షీన్ టాప్ రేటెడ్ టీవీ సిరీస్ 'టు అండ్ హాఫ్ మెన్' కార్యక్రమంతో ప్రేక్షకులకు చేరువయ్యారు. అయితే వార్నర్ బ్రదర్స్తో బహిరంగంగా గొడవ పడటంతో 2011లో ఆయనను ఈ కార్యక్రమం నుంచి తొలగించారు. ఈ నేపథ్యంలో ఆయనకు హెచ్ఐవీ వ్యాధి సోకిందని బయటకు పొక్కడం సంచలనం రేపింది. ఆయనతో లైంగిక సంబంధాలు ఉన్న అనేకమంది సెలబ్రిటీలు ఈ విషయమై ఆందోళన చెందారు. తనకు హెచ్ఐవీ ఉందన్న విషయాన్ని దాచడంపై ఆయనతో లైంగిక సంబంధాలున్న పలువురు కోర్టుకు ఎక్కేందుకు సిద్ధమవుతున్నారు. తనకు హెచ్ఐవీ ఉందన్న విషయం ఏడాది కిందటే తెలిసినా.. ఆ విషయాన్ని చార్లీ షీన్ దాచిపెట్టారని, ఆయనతో లైంగిక సంబంధం ఉన్న ఓ పోర్న్ స్టార్ కూడా వెల్లడించడంతో ఈ వార్త సంచలనం అయింది. ఈ నేపథ్యంలో తనకు హెచ్ఐవీ సోకడంపై అనేక రకాల కథనాలు, ఊహాగానాలు వస్తుండటంతో వాటికి తెరదించేందుకు ఆయన స్వయంగా టీవీ ముందుకు వచ్చి నిజం అంగీకరించారు.