'నేను కేబినెట్ మంత్రి కూతురితో రాత్రంతా గడిపా' | Charlie Sheen boasts Cabinet minister's daughter during Q&A with Piers Morgan | Sakshi
Sakshi News home page

'నేను కేబినెట్ మంత్రి కూతురితో రాత్రంతా గడిపా'

Published Mon, Jun 20 2016 12:36 PM | Last Updated on Mon, Sep 4 2017 2:57 AM

'నేను కేబినెట్ మంత్రి కూతురితో రాత్రంతా గడిపా'

'నేను కేబినెట్ మంత్రి కూతురితో రాత్రంతా గడిపా'

లండన్: తాను బ్రిటన్ కేబినెట్ మంత్రి కూతురుతో కూడా ఒక రాత్రి గడిపినట్లు ప్రముఖ హాలీవుడ్ నటుడు చార్లీ షీన్ చెప్పాడు. ఆదివారం రాత్రి జరిగిన ఓ టీవీ షో కార్యక్రమంలో పీర్స్ మోర్గాన్ అడిగిన ప్రశ్నలకు ఈ సమాధానం చెప్పాడు. ఆ సమయంలో తన ఎదురుగా వందలమంది కూర్చుని ఉన్నారు. ప్రముఖ నటుడిగా పేరు తెచ్చుకున్న షీన్ తనకు హెచ్ఐవీ ఉందని గత ఏడాది బహిరంగంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ మధ్య తరుచు ఇంటర్వ్యూలు ఇస్తూ వివాదాలు రాజేస్తున్న ఈ నటుడు ఈసారి ఏకంగా ఓ కేబినెట్ మంత్రి నెత్తిన బాంబు పేల్చాడు.

మీరు గడిపిన అమ్మాయిల్లో అత్యంత ఫేమస్ అయి ఉండి బయటకు చెప్పని వారు ఎవరైనా ఉన్నారా అంటూ మోర్గాన్ వేసిన ప్రశ్నకు వెంటనే అతడు బదులిస్తూ 'ఉన్నారు.. అది సరిగ్గా 20 ఏళ్ల కిందట. ఆమె ఫేమస్ అని చెప్పనుగానీ ఆమె తండ్రి మాత్రం ఫేమస్.. ఓ బ్రిటన్ కేబినెట్ మంత్రి కూతురుతో ఒక రాత్రంతా గడిపాను' అని చెప్పాడు. దీంతో అక్కడ కూర్చున్న వాళ్లంతా షాక్ అయ్యారు. వెంటనే మోర్గాన్ ఆ మంత్రి ఎవరనే విషయం తెలుసుకునేందుకు పలు ప్రశ్నలు సందించాడు.

ఇప్పుడు కూడా ఆ మంత్రి అధికారంలో ఉన్నాడా? ఏ శాఖలో ఉన్నారు? పోని ఇప్పుడు లేకుండా ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఏ శాఖలో బాధ్యతలు నిర్వర్తించారు? అంటూ గుచ్చిగుచ్చి ప్రశ్నించారు. దీనికి ఆయన స్పందిస్తూ తాను అలా పేరు చెప్పి సమస్యలు కొని తెచ్చుకోలేనని, ఇంటర్ పోల్ అధికారులు నా వెంటపడతారని చెప్పాడు. అయితే, పదే పదే ప్రశ్నించగా ఆమె పేరు చెప్పేందుకు నిరాకరించిన ఆయన ఆ మంత్రి గతంలో హోంశాఖ కార్యదర్శిగా కూడా పనిచేశారంటూ తన సమాధానం ముగించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement