![New treatment for HIV - Sakshi](/styles/webp/s3/article_images/2018/09/28/image.jpg.webp?itok=BGXDhQrW)
యాంటీ రెట్రోవైరల్ మందుల పుణ్యమా అని ఇప్పుడు హెచ్‌ఐవీతో జీవితాన్ని పొడిగించుకోవడం సాధ్యమవుతోంది. అయితే ఈ మందులు వైరస్‌ను పూర్తిగా చంపలేవు. మందులు వేసుకోవడం మానేస్తే.. లేదా మరచిపోయినా చాలు.. మళ్లీ విజంభిస్తుంది. ఈ నేపథ్యంలో రాక్‌ఫెల్లర్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు హెచ్‌ఐవీపై చేసిన కొన్ని ప్రయోగాలు విజయవంతం కావడం ప్రాముఖ్యతను సంతరించుకుంటోంది. హెచ్‌ఐవీ యాంటీబాడీలు రెండింటిని ఒక్కసారి వాడటం ద్వారా వైరస్‌ను కొన్ని నెలలపాటు నిద్రాణంగా ఉంచవచ్చునని వీరు అంటున్నారు. బ్రాడ్‌లీ న్యూట్రలైజింగ్ యాంటీబాడీస్ (బీనాబ్స్) అని పిలుస్తున్న ఈ సరికొత్త మందులు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే హెచ్‌ఐవీ వ్యాధిగ్రస్తులు కొన్ని నెలలకు ఒకసారి మాత్రలేసుకుంటే సరిపోతుందని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త మైకేల్ సి. నాసెన్‌వీగ్ అంటున్నారు.
పరిశోధన వివరాలు నేచర్, నేచర్ మెడిసిన్ జర్నల్స్ తాజా సంచికల్లో ప్రచురితమయ్యాయి. ఈ కొత్త యాంటీబాడీలు సహజసిద్ధమైనవని.. హెచ్‌ఐవీ వైరస్ పైభాగంలో ఉండే ప్రొటీన్లపై దాడి చేయడం ద్వారా పనిచేస్తాయని వివరించారు. అంతేకాకుండా ఈ క్రమంలో ఈ రెండు యాంటీబాడీలు శరీరపు సహజ రోగ నిరోధక వ్యవస్థలు ఉపయోగించుకోవడం విశేషమన్నారు. తొలిదశ ప్రయోగాల్లో రెండు యాంటీబాడీల మందును ఆరువారాల వ్యవధిలో మూడుసార్లు ఇస్తే.. 21 నుంచి 30 వారాలపాటు వైరస్‌ను అదుపులో ఉంచగలిగిందని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment